ఎంఎంటీఎస్ ఢీకొని ఇద్దరు యువకుల మృతి | two youth dies after being hit by mmts train near secunderabad | Sakshi
Sakshi News home page

ఎంఎంటీఎస్ ఢీకొని ఇద్దరు యువకుల మృతి

Published Sun, Jan 3 2016 10:15 PM | Last Updated on Sat, Aug 25 2018 5:29 PM

two youth dies after being hit by mmts train near secunderabad

అడ్డగుట్ట (సికింద్రాబాద్): ప్రమాదవశాత్తూ ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

మెట్టుగూడకు చెందిన డోమ్నిక్ (18), నవీన్ చారి (25)లు ఆదివారం మధ్యాహ్నం సీతాఫల్‌మండిలోని దూద్ బావి రైలు పట్టాల వద్ద నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే అటుగా వచ్చిన రైలును గుర్తించడంలో ఆలస్యం కావడంతో రైలు వారిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యలోనే వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement