తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం | weathers changes in telugu states | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం

Published Sun, Feb 28 2016 3:46 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం

► తెలంగాణలో వడగళ్ల వానలు
 
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రానున్న 24 గంటల్లో తెలంగాణలో వడగళ్ల వానలు, కోస్తాంధ్రలో తేలిక పాటి జల్లులు కురవనున్నాయి. రెండ్రోజుల క్రితం దక్షిణ కర్ణాటక నుంచి విదర్భ వరకు తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి, ఛత్తీస్‌గఢ్‌పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అలాగే కొనసాగుతున్నాయి. ఫలితంగా శుక్రవారం ఆదిలాబాద్  జిల్లాలో ఒకట్రెండు చోట్ల వడగళ్ల వాన కురిసింది.

వచ్చే 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వర్షం, కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన జల్లులు గానీ, తేలికపాటి వర్షం గానీ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం శనివారం వెల్లడించింది. కానీ రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. రానున్న రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement