
మల్‌ఖా లేడీస్
తొందర్లోనే పారిస్‌లోని ఈఫిల్ టవర్‌పై సత్తా చాటనున్న మల్‌ఖా చేనేత సౌందర్యం శనివారం సిటీలో సందడి చేసింది. సిటీ డిజైనర్ శిల్పారెడ్డి డిజైన్ చేసిన మల్‌ఖా చేనేత వస్త్రాల్లో సినీనటి మంచు లక్ష్మి,నిజామాబాద్ ఎంపీ కవిత తళుక్కుమన్నారు. బంజారాహిల్స్‌లోని
రాడిసన్ బ్లూ హోటల్ ఇందుకు వేదికైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే వినియోగించే మల్‌ఖా చేనేత వస్త్రాన్ని పారిస్‌లో
ఈ నెల 31న ప్రదర్శిస్తున్న శిల్పారెడ్డి కూడా మల్‌ఖా ఫ్యాబ్రిక్‌లోనే కనిపించారు.
‘మల్‌ఖా ఫ్యాబ్రిక్‌ను మరింత అందంగా తీర్చిదిద్దిన శిల్పారెడ్డి డిజైనింగ్ మెళకువలు అద్భుతం’ అన్నారు మంచు లక్ష్మి. చేనేత కార్మికుల కష్టాల్లో నుంచి వచ్చిన, తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం వంటి మల్‌ఖాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడం శుభపరిణామమన్నారు ఎంపీ కవిత.
సాక్షి, సిటీప్లస్