కారు బోల్తా- మహిళ మృతి | woman dies in car accident | Sakshi
Sakshi News home page

కారు బోల్తా- మహిళ మృతి

Published Sun, Apr 24 2016 11:36 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

woman dies in car accident

శామీర్‌పేట్: కారు బోల్తాపడిన ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. శామీర్‌పేట్ ఠాణా పరిధిలోని రాజీవ్ రహదారిపై ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చే సుకుంది. వివరాలు.. ఘట్‌కేసర్ మండలం మేడిపల్లికి చెందిన కుమారి(25), జ్యోతిలు అక్కాచెల్లెళ్లు. వీరు తమ సోదరుడు నరేశ్, వీరి కుటుంబానికి చెందిన చిన్నారులు గౌతమ్, సాత్విక, అన్వితతో కలిసి ఓ కారులో డ్రైవర్ రాజుతో కలిసి మండలంలోని తుర్కపల్లిలో ఆదివారం జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు.

సాయంత్రం తిరుగు ప్రయాణంలో రాజీవ్ రహదారిపై వెళ్తుండగా శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్దకు రాగానే ఓ మహిళ కారుకు అడ్డుగా వచ్చింది. ఆమెను తప్పించబోయిన కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కుమారితో పాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి ఆస్పత్రికి తరలిస్తుండగా కుమారి మృతిచెందింది. ఈ ఘటనలో చిన్నారులకు స్వల్పగాయాలయ్యాయి. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement