హైదరాబాద్: ఫార్మా రంగానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ప్రథమకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా ఉమన్ సైంటిస్ట్ అవార్డు లభించింది. కేన్సర్, క్షయ, కేంద్ర నాడీ వ్యవస్థ సంబంధిత వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే కొత్త కొత్త రసాయనాలను గుర్తించడంలో డాక్టర్ ప్రథమ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో అవార్డును ఆమెకు అందజేసినట్లు ఐఐసీటీ ఒక ప్రకటనలో తెలిపింది. అవార్డు కింద రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేశారు.
డాక్టర్ ప్రథమకు ఫార్మా అవార్డు
Published Mon, Oct 24 2016 7:39 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
Advertisement