Published
Fri, Jul 28 2017 12:55 AM
| Last Updated on Mon, Aug 20 2018 3:02 PM
అబ్దుల్ కలాంకు వైఎస్ జగన్ నివాళి
మనందరికీ స్ఫూర్తి ప్రదాత అంటూ ట్వీటర్‌లో ట్వీట్
సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాంకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. కలాం రెండో వర్ధంతిని పురస్కరించుకుని ఆయన్ను స్మరిస్తూ జగన్ ట్వీటర్‌లో ట్వీట్ చేశారు. ‘నిరాడంబరమైన వ్యక్తి, మనందరికీ స్ఫూర్తి ప్రదాత ఈ మిస్సైల్ మ్యాన్’ అంటూ కలాంను జగన్‌మోహన్‌రెడ్డి కీర్తించారు.