లోటస్పాండ్లో వైఎస్ఆర్ సీఎల్పీ భేటీ | ysr clp meeting in lotus pond | Sakshi
Sakshi News home page

లోటస్పాండ్లో వైఎస్ఆర్ సీఎల్పీ భేటీ

Published Mon, Mar 21 2016 11:57 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

లోటస్పాండ్లో వైఎస్ఆర్ సీఎల్పీ భేటీ - Sakshi

లోటస్పాండ్లో వైఎస్ఆర్ సీఎల్పీ భేటీ

హైదరాబాద్: ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం లోటస్పాండ్లో వైఎస్ఆర్ సీఎల్పీ భేటీ అయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రోజా సస్పెన్షన్పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ సోమవారం అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
 
రోజా సస్పెన్షన్ వ్యవహారంలో అనుసరించాల్సిన విధానంపై వైఎస్ఆర్ సీఎల్పీలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ప్రభుత్వం కోర్టు తీర్పును గౌరవించకుండా తామే సుప్రీం అన్న ధోరణిలో ముందుకుపోతుందని విమర్శించారు. సభలో సాక్షాత్తు ముఖ్యమంత్రే బూతులు మాట్లాడిన స్పీకర్, సభా హక్కుల కమిటీ పట్టించుకోలేదని వారు వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement