lotuspond
-
సునీల్ నాయక్ కుటుంబానికి అండగా షర్మిల
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న మహబూబాబాద్‌కు చెందిన నిరుద్యోగి బోడ సునీల్ నాయక్ కుటుంబానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అండగా నిలిచారు. గురువారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ 12వ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర ఐటీ వింగ్ కన్వీనర్ ఇరుమళ్ల కార్తీక్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది. ఈ జాబ్ మేళాలో సునీల్ నాయక్ తమ్ముడు బోడ శ్రీనివాస్ నాయక్‌కు ఉద్యోగం కల్పిస్తూ షర్మిల నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువత తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, జీవితంలో స్థిరపడాలని సూచించారు. ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన్లను విడుదల చేయకుండా తాత్సారం చేస్తోందని, యువత కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ఉండాలన్నారు. నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్టీపీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన 250 మందికి నియామక పత్రాలు అందజేశారు. మరో 700 మందికి వివిధ దశల్లో ఇంట ర్వూ్యలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె రక్తదానం చేశారు. హైదరాబాద్‌లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన దార్శనికుడు వైఎస్ఆర్ అని పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ కొనియాడారు. -
లోటస్‌పాండ్‌కు కొత్త శోభ
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్–12 ఎమ్మెల్యే కాలనీలోని లోటస్‌పాండ్ పార్క్‌ను జీహెచ్ఎంసీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఫ్లోటింగ్ ఐలాండ్స్, విద్యుద్దీపాలు, ఎయిరేటర్స్, బెంచీలు, రంగురంగుల గోడలు పార్కుకు నూతన శోభను తీసుకొచ్చాయి. సందర్శకులతో పాటు మంత్రి కేటీఆర్‌ను ఇక్కడి దృశ్యాలు మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. మరిన్ని చెరువుల్ని ఇలాగే తీర్చిదిద్దాలని శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. Great job 👍 need many more of these https://t.co/ZPyEdSAaus — KTR (@KTRTRS) August 20, 2021 -
ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగ దీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నడుంబిగించింది. ఉద్యోగం లేక నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతకు భరోసా కల్పించేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ తెలిపారు. శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె పార్టీ అడహక్ కమిటీ సభ్యులు పిట్టా రాంరెడ్డి, భూమిరెడ్డి, సాహితీ, ఆయూబ్ ఖాన్, కృష్ణమోహన్ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యువత కోసం ఏప్రిల్ 15 నుంచి 72 గంటల పాటు షర్మిల దీక్ష చేసినప్పటికీ ప్రభుత్వంలో స్పందన కానరాలేదన్నారు. కేవలం ఎన్నికల సమయంలో వరాలు కురిపించే సంస్కృతిని మాని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో ఉద్యోగ నోటిఫికేషన్ కేలండర్ రూపొందించాలని డిమాండ్ చేశారు. -
సంకల్ప సభను సక్సెస్ చేయండి: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో ఈ నెల 9న ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సంకల్పసభను విజయవంతం చేయాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయం లో ఆమె పాలేరు నియోజకవర్గానికి చెందిన యెనికే కిషోర్‌బాబు ఆధ్వర్యంలో రూపొందించిన సంకల్ప సభ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, తమ పార్టీ విధి విధానాలను ఆవిష్కరించే ఈ సభకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలిరావాలన్నారు. ఆ దిశగా ఖమ్మంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ అనుచరులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా భారీ జన సమీకరణకు నడుంబిగించారన్నారు. ఈ సభను కరోనా నిబంధనలకు అనుగుణంగా జరుపుకుందామని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని షర్మిల కోరారు. అదే విధంగా ఖమ్మం జిల్లాలో సైతం నియోజకవర్గాల వారీగా ఆయా పరిశీలకుల ఆధ్వర్యంలో సంకల్ప సభ సన్నాహాక సమావేశాలు కొనసాగుతున్నాయి. షర్మిలకు పెరుగుతున్న మద్దతు వైఎస్ షర్మిలకు రోజురోజుకీ వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి మద్దతు పెరుగుతోంది. సోమవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో లోటస్‌పాండ్‌కు తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు అచ్యుతా యాదవ్ తన పదవికి రాజీనామా చేసి షర్మిలకు మద్దతు పలికారు. నారాయణపేట్ జిల్లా మక్తల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్‌లు ఆరుగురు కూడా మద్దతు తెలిపారు. అదే విధంగా కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ లోటస్‌పాండ్‌లో షర్మిలను కలిశారు. హైదరాబాద్‌లోని సివిల్, క్రిమినల్ కోర్టులతో పాటు హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు మతీన్ ముజాద్దది షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముందడుగు వేస్తున్న షర్మిలకు తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. షర్మిలను కలిసిన వారిలో న్యాయవాదులు సుభాన్ జావీద్, సయ్యద్ నసీబ్ ఫహీమ్, సిద్దయ్య, కోటేశ్వరావు, నాజిబా సుల్తాన, ఎస్.జె.సుజాత, వాహెబ్ అలీ, ఎ.శ్రీధర్ తదితరులు ఉన్నారు. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన సర్దార్జీలు, నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రికి చెందిన వైద్యుడు పెద్దఎత్తున అనుచర గణంతో షర్మిలకు మద్దతు తెలిపారు. జగ్జీవన్‌రామ్ చరిత్ర స్ఫూర్తిదాయకం: షర్మిల సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ చరిత్ర స్ఫూర్తిదాయకమని వైఎస్ షర్మిల అన్నారు. సోమవారం లోటస్‌పాండ్‌లో జగ్జీవన్‌రామ్ 114వ జయంతి వేడకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా షర్మిల జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం సాగించిన ఆయన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం రాజీలేని పోరాటాన్ని కొనసాగించిన జగ్జీవన్.. మహనీయుడని శ్లాఘించారు. కార్యక్రమంలో షర్మిల అనుచరుడు పిట్టా రాంరెడ్డి, అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇది మారాలి.. మీరు మార్చాలి: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పాలకులు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని, కేంద్ర పాలకులు మాత్రం హేట్‌బ్యాంకుగా చూస్తున్నారని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల ఆరోపించారు. ‘ఇది మారాలి.. మీరు మార్చాలి. రాజన్న బిడ్డగా మీ పక్షాన పోరాటం చేయడానికి నేను సిద్ధం. మనం చేయి చేయి కలిపితే మళ్లీ రాజన్న సంక్షేమ పాలన సాధ్యమని నేను గట్టిగా నమ్ముతున్నాను’అని పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ముస్లిం నేతలతో సోమవారం లోటస్‌పాండ్‌లో షర్మిల సమావేశమయ్యారు. ‘నేను వైఎస్సార్ కూతురిని. మీ అందరి కూతురిని. వైఎస్సార్‌కు ముస్లింలు అంటే ప్రత్యేకమైన అభిమానం. 4 శాతం రిజర్వేషన్లతో ముస్లింలు అనేక ఉద్యోగాలు సాధించుకున్నారు. ప్రీ మెట్రిక్, పోస్టుమెట్రి క్ స్కాలర్షిప్ ఇచ్చారు’అని వివరించారు. వక్ఫ్‌బోర్డు భూములు ఆక్రమణలకు గురైతే వాటిని వైఎస్సార్ వెనక్కి తెచ్చారని షర్మిల పేర్కొన్నారు. పాతబస్తీ అభివృద్ధి కోసం రూ.2 వేల కోట్లు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, డ్రైనేజీ సమస్య లేకుండా చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రగతిలో ముస్లింల పాత్రను మరవలేమని, వారులేని తెలంగాణ సమాజాన్ని ఊహించలేమని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంలో ముస్లింల బతుకులేమైనా మారాయా అని పశ్నించారు. -
ఇది మారాలి.. మీరు మార్చాలి: వైఎస్ షర్మిల
-
ఖమ్మం సభ చరిత్రలో జరగని విధంగా ఉండాలి: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దొరల కుటుంబ పాలన పోవాలని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి తనయ వై.ఎస్. షర్మిల పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఇంతవరకు చరిత్రలో జరగని విధంగా ఏప్రిల్ 9న ఖమ్మం సభ జరగాలన్నారు. సభకు రాష్ట్రవ్యాప్తంగా భారీగా జన సమీకరణ చేయాలని, ఆ దశగా వ్యూహరచన చేయాలని ఖమ్మం, పార్టీ ముఖ్య నేతలకు ఆమె సూచించారు. ఆ వేదికపైనే పార్టీ విధివిధానాలపై ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఖమ్మం సభ కోసం కో–ఆర్డినేషన్ కమిటీని వేశారు. షర్మిలమ్మ రాజ్యం కోసం తాను రాజకీయాల్లోకి రావడం లేదని, రాజన్న సంక్షేమ పాలన కోసమే తాను ముందుకు వచ్చానన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధిని వైఎస్సార్ కోరుకున్నారని, ఖమ్మం జిల్లాలో పోడు భూములు సాగు చేస్తున్న వారికి వైఎస్సార్ పట్టాలు ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. రాజశేఖరరెడ్డి రెండు ప్రాంతాలను రెండు కళ్లలా చూసుకునేవారన్నారు. -
మీతోడు ఉంటే అది సాధ్యమని నమ్ముతున్నా: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (రాజన్న) రాజ్యం రావాలని, ఆయన సంక్షేమ పాలన తేవాలని వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. క్షేత్రస్థాయిలో మీతోడు ఉంటే అది సాధ్యమని నమ్ముతున్నానని వెల్లడించారు. శనివారం లోటస్ పాండ్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో వైఎస్సార్ అభిమాన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. బ్యాండ్ మేళాలు, లంబాడీ నృత్యాలతో కార్యాలయ ఆవరణ అంతా అభిమానులతో సందడిగా మారింది. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి.. అనంతరం షర్మిల మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు ప్రజలందరినీ ప్రేమించారన్నారు. ప్రతీ రైతు రాజు కావాలనే తపనతో రైతు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చారన్నారు. అందుకే ఆ మహానేత మరణాన్ని తట్టుకోలేక అనేక మంది తెలంగాణలో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం లోటస్ పాండ్ ఆవరణలో వైఎస్సార్ అభిమానులకు అభివాదం చేస్తున్న షర్మిల డబ్బుల్లేక చదువు ఆపేయొద్దని, ప్రతీ పేద విద్యార్థి ఉచితంగా చదువుకునేలా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తెచ్చారని గుర్తు చేశారు. పేదవాడికి అనారోగ్యం వస్తే నేనున్నా అనే భరోసా ఇస్తూ ఆరోగ్యశ్రీ పథకం తెచ్చారని, సొంత ఇళ్లు ఉండాలని గృహాలు నిర్మించి ఇచ్చారని వివరించారు. ఇలా ఎన్నో పథకాలు తెచ్చారు కాబట్టే ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారన్నారు. రాజన్న బిడ్డ ఒక్క మాట పిలవగానే మనస్ఫూర్తిగా వచ్చినవారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. రాజన్న తెచ్చిన పథకాలన్నీ టీఆర్ఎస్ పాలనలో అందుతున్నాయా అని ప్రశ్నించారు. వారికి ఇచ్చిన 11 ప్రశ్నలకు ఫీడ్ బ్యాక్ అందించాలని కోరారు. హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకోసం రూ.1,250 కోట్లు కేటాయించారని కొండా రాఘవరెడ్డి అన్నారు. ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని, ఔటర్‌రింగ్ రోడ్డు, గిరిజనులకు పోడు భూములు ఇచ్చారని అన్నారు. జై తెలంగాణ... జై జై తెలంగాణ.. జోహార్ వైఎస్సార్ అన్న షర్మిల నినాదాలతో సభ దద్దరిల్లింది. సమావేశంలో వెల్లాల రామ్మోహన్, భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 11 ప్రశ్నల ఫీడ్ బ్యాక్ ఇది.. ►రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్సార్ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలు ఏమిటి? వాటిని ఎలా తీర్చుకోవాలి? ►మీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతంలో వైఎస్సార్ చేసిన పనులు ఏమిటి? ►మనం తీసుకున్న రాజకీయ నిర్ణయం గురించి సామాన్య ప్రజలు ఏం అనుకుంటున్నారు? ►అధికారంలో ఉన్న కేసీఆర్/టీఆర్ఎస్ని మనం ఎలా ఎదుర్కోవాలి? మీరిచ్చే సలహాలు ఏమిటి? ►రాష్ట్రంలో బీజేపీని ఎలా ఎదుర్కోవాలి? మీరిచ్చే సలహాలు ఏమిటి? ►తెలంగాణ సమాజం/ ఉద్యమకారుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఏమిటి? వాటికి ఎలాంటి సమాధానం చెప్పాలి? ►రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే రాష్ట్ర స్థాయిలో పోరాడాల్సిన అంశాలు ఏమిటి? ►రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే జిల్లా స్థాయిలో పోరాడాల్సిన అంశాలు ఏమిటి? ►రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే అసెంబ్లీ, నియోజవర్గ స్థాయిలో పోరాడాల్సిన అంశాలు ఏమిటి? ►సంస్థాగతంగా బలపడటానికి, క్యాడర్ నిర్మాణానికి చేయాల్సిన పనులు ఏమిటి? ►వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలంటే మీరిచ్చే సలహాలు ఏమిటి? -
రాజన్న రాజ్యం రావాలి: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్నది తన కోరిక అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల స్పష్టం చేశారు. దీనికోసం ఏం చేయాలన్న దానిపై జిల్లాల వారీగా సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుంటానని ఆమె చెప్పారు. మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులతో హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని నివాసంలో ఆమె భేటీ అయ్యారు. అలాగే అదే జిల్లా నాయకులతో ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం బాగా జరిగిందని, అందరూ ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. ప్రతీ జిల్లాకు చెందిన నేతలను కలుస్తానని, హైదరాబాద్‌లోనా.. లేక జిల్లాలకు వెళ్లాలా.. అనేది త్వరలో నిర్ణయిస్తానన్నారు. వారానికి ఒకటి లేదా రెండు జిల్లాల వారిని కలుస్తానని పేర్కొన్నారు. పార్టీ ఎప్పుడు పెడుతున్నారని ప్రశ్నించగా, పార్టీ పెడుతున్నానని మీరే నిర్ణయించుకున్నారా అని మీడియాను ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారా?.. విద్యార్థులందరూ ఉచితంగా చదువుకుంటున్నారా? మీరే చెప్పాలని విలేకరులను అడిగారు. తాము సరైన దిశలో వెళుతున్నామని, చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని షర్మిల వివరించారు. మీకు జగన్ మద్దతు ఉందా అని ప్రశ్నించగా, జగన్ మద్దతు లేదని మీకు ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో అభిమానులకు అభివాదం చేస్తున్న వైఎస్ షర్మిల మనతోనే సాధ్యం... ఆత్మీయ సమావేశంలో భాగంగా తెలంగాణలో రాజన్న రాజ్యం ఏర్పాటు తనతోనే సాధ్యమన్న నమ్మకం ఉందని షర్మిల అన్నారు. రాజశేఖరరెడ్డిని అభిమానించే ప్రతి గుండెకు రాజన్న బిడ్డ నమస్కరిస్తోంది అంటూ ప్రసంగం ప్రారంభించిన షర్మిల ‘నాన్న మన నుంచి వెళ్లిపోయి ఎన్నేళ్లయినా అభిమానం చెక్కుచెదరలేదు. ప్రతి రైతు.. రాజు లాగా బతకాలి.. ప్రతి పేదవాడికి ఒక పక్కా ఇల్లు ఉండాలని ఆయన ఆశపడ్డారు. ప్రతి పేద విద్యార్థి గొప్ప చదువులు చదువుకోవాలని, గొప్ప ఉద్యోగాలు చేయాలనుకున్నారు. పేదరికం ఒక శాపమని, వారికి అనారోగ్యం వస్తే అప్పుల పాలవుతారని ఆరోగ్యశ్రీ తీసుకువచ్చారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అందుకే రాజన్న రాజ్యం మళ్లీ రావాలని నా కోరిక. నేను మాట్లాడటానికి రాలేదు.. మీరు చెప్పింది విని అర్థం చేసుకోవడానికి వచ్చాను. వెల్కమ్’అని ముగించారు. ఈ సమావేశంలో కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, నల్లగొండ డీసీసీ మాజీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, గున్నం నాగిరెడ్డి, గున్నం విజయభాస్కర్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, సిరాజ్ ఖాన్, మేకల ప్రదీప్‌రెడ్డి, అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి, మల్లు రవీందర్‌రెడ్డి, పడాల శ్రీకాంత్, ఇంజం నర్సిరెడ్డి, గూడూరు జైపాల్‌రెడ్డి, పిడమర్తి రాజు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ నేతలతో సమావేశంలో భాగంగా లోటస్‌పాండ్‌కు పెద్ద ఎత్తున వైఎస్ అభిమానులు తరలివచ్చారు. వారి కోలాహలంతో ఆ పరిసరాలు సందడిగా మారాయి.‘రావాలి షర్మిల.. కావాలి షర్మిల’ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. -
లోటస్‌పాండ్‌లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు
-
వైఎస్ జగన్ ఆహ్వానించారు: ఆర్.కృష్ణయ్య
-
వైఎస్ జగన్ ఆహ్వానించారు: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీ సంఘం నాయకుడు ఆర్.కృష్ణయ్య శనివారం లోటస్‌పాండ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఆర్. కృష్ణయ్య విలేకరులతో మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్‌పై చట్టసభల్లో చర్చ జరపాలని వైఎస్ జగన్‌ను కోరినట్టు తెలిపారు. 14 పేజీలతో కూడిన వినతిపత్రం ఆయనకు ఇచ్చినట్టు వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ గురించి మొట్టమొదటిగా ప్రైవేట్ బిల్లు పెట్టినందుకు వైఎస్ జగన్‌ను అభినందించినట్టు చెప్పారు. బీసీ రిజర్వేషన్ అంశాన్ని రాజ్యసభలో తమ పార్టీ తరపున లేవనెత్తుతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. బీసీల కోసం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి ఎంతో కృషి చేశారనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ఈ నెల 17న ఏలూరులో నిర్వహించనున్న బీసీ గర్జన సభకు రమ్మని తనను వైఎస్ జగన్ ఆహ్వానించారని చెప్పారు. బీసీల కోసం ఎక్కడ సభ పెట్టినా, ఏ పార్టీ సభ నిర్వహించినా వెళ్తానని ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. -
లోటస్‌పాండ్‌లో టీచర్స్ డే వేడుకలు
సాక్షి, సిటీబ్యూరో: డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గొ ప్ప పండితుడు, తత్వవేత్త అని వైఎస్సార్ సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొనియాడారు. ఉపాధ్యా య లోకానికి ఆయన ఒక దిక్సూచి అన్నా రు. లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఉపాధ్యా య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో విశిష్ట సేవలందించిన వివిధ జిల్లాలకు చెందిన తొమ్మిది మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తికి నిలువెత్తు అద్దం రాధాక్రిష్ణన్ అని చెప్పారు. ఒక వైపు వినాయక చవితి పర్వదినం, మరో వైపు సర్వేపల్లి పుట్టినరోజు రావటం శుభసూచకమన్నారు. తొలుత సర్వేపల్లి రాధాక్రిష్ణన్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వి.విజయ సాయి రెడ్డి, తెలంగా ణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, వైఎస్సార్ సీపీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రాష్ట్ర నాయకులు పుత్తా ప్రతాప్ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, బి.మోహన్ కుమార్, కొల్లి నిర్మల కుమారి, అరుణ్ కుమార్, భువనం భూషన్, సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, బుర్ర సురేష్ గౌడ్, సిద్ధారెడ్డి, బెంబడి శ్రీనివాస రెడ్డి, రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్కారం అందుకున్న ఉపాధ్యాయుల వీరే... ఈదర్ ఆంథోని రెడ్డి(సెంట్ ఆంథోని హైస్కూల్, విద్యానగర్, సంగారెడ్డి), షేక్ మస్తాన్ వలి(ఎస్జీటీ, వెంకటేశ్వరనగర్, బాలానగర్), బోనాల శ్రీనివాస్(జెడ్పీహెచ్ఎస్, సనత్‌నగర్), జి.రఘునాథ్ రెడ్డి(బాగ్అమీర్ ప్రాథమిక పాఠశాల, బాలనగర్), ఏర్రాడి రామేశ్వరరావు(హెచ్ ఎం, జెడ్పీహెచ్ఎస్, జగద్గిరిగుట్ట), కారు పోతుల వెంకటయ్య (హెచ్ఎం, సీ బీ రాజునగర్ ప్రాథమిక పాఠశాల, బాల నగర్), యాదయ్య (హెచ్ఎం, హఫీజ్‌పేట్), ఎ.ఎం.ప్రసన్న లక్ష్మి, ఎస్జీటీ, ప్రాథమికపాఠశాల, వెంకటేశ్వనగర్, రం గారెడ్డి), శ్రీనివాస్(హెచ్ఎం, జెడ్పీహెచ్ ఎస్, సంగారెడ్డి)లను పార్టీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయ సాయిరెడ్డిలు శాలువతో సత్కరించి, వినాయక ప్రతిమ ఉన్న జ్ఞాపిక అందజేశారు. కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు... వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని ఘనంగా పూజలు ని ర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు రామచంద్రశాస్త్రి పూజ అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పార్టీ నాయకులు, కార్యకర్తలకు తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. -
లోటస్‌పాండ్‌లో వైఎస్ఆర్ సీఎల్పీ భేటీ
హైదరాబాద్: ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం లోటస్‌పాండ్‌లో వైఎస్ఆర్ సీఎల్పీ భేటీ అయింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ సోమవారం అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. రోజా సస్పెన్షన్ వ్యవహారంలో అనుసరించాల్సిన విధానంపై వైఎస్ఆర్ సీఎల్పీలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ప్రభుత్వం కోర్టు తీర్పును గౌరవించకుండా తామే సుప్రీం అన్న ధోరణిలో ముందుకుపోతుందని విమర్శించారు. సభలో సాక్షాత్తు ముఖ్యమంత్రే బూతులు మాట్లాడిన స్పీకర్, సభా హక్కుల కమిటీ పట్టించుకోలేదని వారు వాపోయారు. -
'రాయలసీమకు పూర్తిగా అన్యాయం'
-
'రాయలసీమకు పూర్తిగా అన్యాయం'
హైదరాబాద్: ఏపీ సర్కార్ మాటలకే పరిమితమైందని, వారి చేతలు శూన్యమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ విమర్శించారు. హైదరాబాద్ లోని లోటస్‌పాండ్‌లో కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నేతలతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ నేతలు వైఎస్ జగన్‌తో శనివారం నాడు చర్చించారు. ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మేథోమధనం చేస్తున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పారిశ్రామిక రాయితీలు కేవలం అమరావతి ప్రాంతానికే కావాలని ఏపీ సీఎం కోరడం దుర్మార్గమని పార్టీ నేతలు మండిపడ్డారు. టీడీపీ వ్యతిరేకపాలనను ప్రజల్లోనే ఎండగడతామని వారు పేర్కొన్నారు. టీడీపీ పాలనలో రాయలసీమకు పూర్తిగా అన్యాయం జరుగుతోందని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ సూచించారు. పార్టీకి చెందిన ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ ఈ సమీక్షలో పాల్గొన్నారు. -
YSRCP ఆఫీసులో అంబేద్కర్ జయంతి వేడుకలు
-
కార్యకర్తలు, అభిమానులకు ఆప్యాయంగా పలకరింపు
-
వైసీపీలో చేరిన తమ్మినేని సీతారాం