
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్–12 ఎమ్మెల్యే కాలనీలోని లోటస్‌పాండ్ పార్క్‌ను జీహెచ్‌ఎంసీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఫ్లోటింగ్ ఐలాండ్స్, విద్యుద్దీపాలు, ఎయిరేటర్స్, బెంచీలు, రంగురంగుల గోడలు పార్కుకు నూతన శోభను తీసుకొచ్చాయి. సందర్శకులతో పాటు మంత్రి కేటీఆర్‌ను ఇక్కడి దృశ్యాలు మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. మరిన్ని చెరువుల్ని ఇలాగే తీర్చిదిద్దాలని శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు.
Great job 👍 need many more of these https://t.co/ZPyEdSAaus
— KTR (@KTRTRS) August 20, 2021