కాచిగూడ: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మొదటి బహిరంగ సభను ఆదివారం నారాయణగూడలోని వైఎంసీఏ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బర్కత్‌పుర చమన్ నుంచి వైఎంసీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇర్ఫాన్ ఖాన్ దంపతుల ఆధ్వర్యంలో వందలాదిమంది కార్యకర్తలు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో పార్టీ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఆదం విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వందలాది మంది నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంబర్‌పేట నియోజకవర్గం నుంచి పార్టీ యువజన విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎ.అవినాష్‌గౌడ్, పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్.హరినాథ్‌రెడ్డి, జార్జి హెర్బర్ట్, నిరంజన్‌రెడ్డి, డి. గోపాల్ రెడ్డి, పి. సిద్ధార్థరెడ్డి, మెరుగు శ్రీనివాసరెడ్డి, ఆరె లింగారెడ్డి, గ్రేటర్ స్టీరింగ్ కమిటీ నాయకులు కాలేరు శ్రీనివాస్, కె.పవన్, అమిత్, క్రిసోలైట్, హర్షద్, జితేందర్ తివారీ, రమేష్ యాదవ్, నీలం రాజు, నాగదేశి రవికుమార్, జె.అమర్‌నాథ్ రెడ్డి, హర్షద్, బండారు సుధాకర్, మోహన్ కుమార్, బి.రఘురామిరెడ్డి, సాయి, హమీద్, మహిళా నేత జె.మేరీ, ఆర్.శ్యామల తదితరులతో పాటు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు తరలివచ్చారు. సభ సక్సెస్ అయినందుకు నేతలు సంతోషం వ్యక్తంచేశారు.
వైఎస్సార్ సీపీ సభ సక్సెస్
Published Mon, Apr 27 2015 1:44 AM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM
Advertisement
Advertisement