
చంద్రబాబు నీతులు చెబుతారు.. ఏదీ పాటించరు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతులు చెబుతారు గానీ, ఏదీ పాటించరని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ఆర్‌సీప శాసనసభా పక్ష సమావేశం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం జరిగింది. సమావేశం అనంతరం ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు.
కాల్ మనీ వ్యవహారం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, సీఎం అంటే కాల్‌మనీలా మారిందని ఆమె మండిపడ్డారు. కాల్‌మనీ వ్యవహారంపై చంద్రబాబు అసెంబ్లీలో సమాధానం చెప్పేవరకు వదిలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలను కేవలం ఆరు రోజులకే పరిమితం చేయడం ఏంటని రోజా మండిపడ్డారు. కనీసం 25-30 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు.