కైరో: ఈజిప్టులోని గిజా ప్రావిన్స్లో గురువారం జరిగిన పేలుడులో కనీసం పదిమంది మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు పోలీసులున్నారు.
ఈజిప్టు రాజధాని కైరో సమీపంలో ఉన్న గిజా ప్రావిన్స్లో ఉగ్రవాద స్థావరంపై భద్రత బలగాలు దాడి చేసినపుడు ఈ పేలుడు సంభవించింది. ఓ అపార్ట్మెంట్లో ఉగ్రవాదులు దాక్కున్నట్టు సమాచారం రావడంతో భద్రత బలగాలు అక్కడికి వెళ్లాయని ఈజిప్టు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి చెప్పారు. గత రెండేళ్లుగా ఈజిప్టులో ప్రభుత్వ వ్యతిరేక దాడులు హెచ్చుమీరాయి. వందలాది మంది పోలీసులు, సైనికులు చనిపోయారు.
ఈజిప్టులో పేలుడు; 10 మంది మృతి
Published Fri, Jan 22 2016 10:43 AM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM
Advertisement
Advertisement