
ప్రతీకాత్మక చిత్రం
న్యూయార్క్ : వందేళ్ల ఆ వృద్ధురాలు తన పుట్టిన రోజునాడు కోరిన కోరికేంటో తెలిస్తే మనం షాక్ అవుతాం. ఎందుకంటే ఆమె కోరిక అంత ప్రత్యేకమైనది కాబట్టి. షాక్ అయ్యేంతలా ఏం కోరిందనుకుంటున్నారా?.. ఏం లేదు.. పుట్టిన రోజు నాడు సరదాగా ఓ ఖైదీలా జైలులో గడపాలనుకుందంతే!!
అమెరికాకు చెందిన రుత్ బ్రయాంట్ అనే వందేళ్ల వృద్ధురాలు తన పుట్టిన రోజు సందర్భంగా తాను ఉంటున్న వృద్ధాశ్రమం వారిని ఓ కోరిక కోరింది! కొంత సమయం ఖైదీలా జైలులో గడపాలనుకుంటున్నట్లు తెలిపింది. ఆ కోరిక విని వాళ్లు నోళ్లు వెళ్లబెట్టారు. అయితే ఆ ముసలావిడ పుట్టినరోజు కోరికను తెలుసుకున్న ఓ పోలీసు అధికారి దాన్ని తీర్చడానికి ముందుకొచ్చాడు.
కదలలేని పరిస్థితిలో వాకర్‌లో ఉన్న ఆమెను సాధారణ ఖైదీలలాగే బేడీలు వేసి పోలీసు జీపులో కూర్చోబెట్టారు. సైరన్, లైట్ల వెలుగులతో ఆమెను జైలుకు తరలించారు. అనంతరం సెల్‌లో కొద్దిసేపు ఉంచారు. దీంతో ఆమె ఎంతో సంతోషపడింది. తిరిగొచ్చేటప్పుడు ఆమె చేతిలో ‘పర్సన్ కౌంటీ జైల్’ అని ముద్రించి ఉన్న ఓ ఆరెంజ్ టీషర్ట్ ఉంచారు. బ్రయాంట్.. వృద్ధాశ్రమానికి తిరిగొచ్చిన తర్వాత ఎంతో ఆనందంగా పుట్టిన రోజు వేడుకలను పూర్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment