‘కసూర్‌’ దోషికి మరో 12 మరణ శిక్షలు | 12 more death sentences for Kasur convict | Sakshi
Sakshi News home page

‘కసూర్‌’ దోషికి మరో 12 మరణ శిక్షలు

Published Mon, Aug 6 2018 5:55 AM | Last Updated on Mon, Aug 6 2018 5:55 AM

12 more death sentences for Kasur convict - Sakshi

లాహోర్‌: పాకిస్తాన్‌లో తీవ్ర సంచలనం రేపిన కసూర్‌ హత్యాచార ఘటనలో దోషికి న్యాయస్థానం మరో 12 మరణ శిక్షలు విధించింది. నేరస్తుడు మరో మూడు నేరాలకు పాల్పడినట్లు తేలడంతో లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక ప్రత్యేక కోర్టు(ఏటీసీ) ఈ తీర్పు వెలువరించింది. కసూర్‌ నగరానికి చెందిన ఇమ్రాన్‌ అలీ(23) జనవరి నెలలో జైనబ్‌(7) అనే చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టడంతోపాటు హత్య చేసి మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేశాడు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా తీవ్ర అలజడికి కారణమయింది.

అలీపై నేరం రుజువు కావడంతో న్యాయస్థానం..జీవితకాల జైలు, మరణశిక్షతోపాటు రూ.40 లక్షలు చెల్లించాలని ఫిబ్రవరిలో తీర్పు వెలువరించింది. ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్‌ విచారణ సందర్భంగా 8 ఏళ్లలోపు మరో ఎనిమిది మంది చిన్నారులపై హత్యాచారం జరిపినట్లు ఒప్పుకున్నాడు. ఇందులో ముగ్గురు చిన్నారులపై నేరాలు రుజువు కావటంతో ఏటీసీ జడ్జి సజ్జాద్‌ అహ్మద్‌ 12 మరణశిక్షలతోపాటు రూ.60 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తం నుంచి రూ.30 లక్షలను బాధితుల కుటుంబాలకు చెల్లించాలని ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement