15 లీటర్ల తల్లిపాలను పారబోయించారు
లండన్: నిబంధనల పేరుతో తన పసి బిడ్డ కోసం ఓ మహిళ తీసుకెళుతున్న 14.8 లీటర్ల తల్లిపాలను లండన్‌లోని హీత్రూ విమానాశ్రయ భద్రతా సిబ్బంది బలవంతంగా పారబోయించారు. అర్థం లేని నిబంధనలతో తన కుమారుడికి రెండు వారాలకు సరిపోయే పాలను నేలపాలు చేశారంటూ అమెరికాకు చెందిన జెస్సికా కోక్‌లే మార్టినెజ్ ఫేస్‌బుక్‌లో తెలిపారు.
బిడ్డ తన వెంట లేకుండా ప్రయాణం చేసిన ఆమె విమానాశ్రయ అధికారుల తీరును తప్పు పట్టారు. పసి పిల్లలు వెంట లేనప్పుడు భారీగా పాలను తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఇలాంటి కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉండాలని ఆమె కోరారు.