పావు డాలరు... పాతిక లక్షలా...! | 1970 Quarter Selling for Thousands on eBay | Sakshi
Sakshi News home page

పావు డాలరు... పాతిక లక్షలా...!

Published Wed, Jun 15 2016 1:28 PM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

పావు డాలరు... పాతిక లక్షలా...!

పావు డాలరు... పాతిక లక్షలా...!

కాలిఫోర్నియా: ఔను ఇది నిజమే...! కానీ అది మామూలు పావుడాలరు కాదు. 1970వ సంవత్సరం నాటిది. అయితే ఈ నాణాన్ని కేవలం ముద్రించి వదిలేశారని, ఇది వాడుకలోకి రాలేదని ఈ నాణెం యజమాని మైక్ బయర్స్ చెబుతున్నాడు. అతను ఈ నాణేన్ని ఈబే సైట్లో రూ. 25 లక్షలకు వేలానికి ఉంచాడు. ఇవి ఎన్ని తయారయ్యాయనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. తనకు మాత్రం కాలిఫోర్నియా ప్రభుత్వం నిర్వహించిన ఓ వేలంలో ఇది లభించిందన్నాడు.

దీన్ని మన దగ్గర ఉంచుకోవడానికి సీక్రెట్ సర్వీస్ వారు ఇచ్చే అనుమతి కూడా తన దగ్గర ఉందని చెబుతున్నాడు. అయితే ఈ నాణేన్ని సొంతం చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నపటికీ ఇతగాడు చెబుతున్న ధర విని బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటివరకు ఇతని ప్రకటనను 445 మంది చూశారు. తొమ్మిది మంది బేరమాడారు. అయితే ఈ నాణెం అసలు వాడుకలోకే రాలేదు కాబట్టి అంత ధర పెట్టడంలో తప్పు లేదనేది బయర్స్ వాదన.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement