
ఆమెకు విమాన ఛార్జీ ఎంతో తెలుసా?
అయితే, హమ్మయ్య అనుకునేలోగానే అందుకోసం చెల్లించాల్సిన మొత్తాన్ని చూసి అమ్మో అనుకునే పరిస్థితి తలెత్తింది. ఆమెను తరలించిందేందుకు ముందుకొచ్చిన విమానం ఈజిప్టు నుంచి ముంబయి వచ్చేందుకు రూ.20లక్షలు అడిగారు. దీంతో ప్రస్తుతం ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలి అని కుటుంబం అనుకుంటుండగానే ఆమెకు ఉచితంగా వైద్యం చేసేందుకు ముందుకొచ్చిన వైద్యులే ఎమాన్ పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచారు. స్వచ్ఛంద విరాళాలు ఇచ్చేందుకే కాకుండా వచ్చిన డబ్బును ఎందుకు ఖర్చుచేస్తున్నామనే వివరాలు కూడా పూర్తి పారదర్శకంగా ఉండేలా, దాతలకు తెలిసేలా ఏర్పాట్లు చేశారు. ఈ కేసును ముంబయి వైద్యులు ప్రత్యేకంగా చూస్తున్నారు.