అమ్మో ఇంత బరువా..? | Weighing 500 kilos, Egyptian woman believed to be the fattest in the world! | Sakshi
Sakshi News home page

అమ్మో ఇంత బరువా..?

Published Sun, Oct 23 2016 10:05 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

అమ్మో ఇంత బరువా..?

అమ్మో ఇంత బరువా..?

అలెగ్జాండ్రియా: ఈజిప్టుకు చెందిన ఓ 36 ఏళ్ల మహిళ బరువు ఏకంగా 500 కేజీలకు చేరింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక బరువు కలిగిన మహిళ ఈమెనని భావిస్తున్నారు. ఈఐ అరేబియా రిపోర్టు ప్రకారం.. ఇమాన్ అహ్మద్ అబ్దులాతి అనే మహిళ గత 25 ఏళ్లుగా ఇల్లు దాటి బయటకు రానే లేదు. బరువు కారణంగా తన మంచం దిగి బయటకు రాలేకపోతున్నానని ఆమె తెలిపింది.

అంతేకాదు పక్కకు తిరిగి పడుకోవాలన్నా కుదరదని చెప్పింది. ఆహారం తీసుకోవడానికి, బట్టలు మార్చుకోవడానికి, రోజూ వారి పనులు చేసుకోవడానికి కచ్చితంగా తన తల్లి, సోదరి సాయం ఉండాలని అబ్దులాతి పేర్కొంది. తాను ఎలిఫెంటయాసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. దీని కారణంగా తాను ఇంత భారీగా పెరిగినట్లు చెప్పింది. దాంతో తాను స్కూల్ కు వెళ్లడం మానేసినట్లు తెలిపింది. వైద్య పరీక్షల్లో తన శరీరం అవసరమైన మొత్తం కంటే ఎక్కువగా నీటిని తనలో ఉంచుకుంటున్నట్లు తేలిందని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement