వాషింగ్టన్: అమెరికాలో గత డిసెంబర్‌లో కొత్తగా సుమారు 3 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు అధికారిక నివేదిక ఒకటి వెల్లడించింది. దేశంలో నిరుద్యోగిత రేటు 3.9 శాతంగా నమోదైందని, వ్యవసాయేతర రంగాల్లో కొత్తగా 3.12 లక్షల ఉద్యోగాలు వచ్చాయని బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తన నెలవారీ నివేదికలో పేర్కొంది. అమెరికా తొలిసారిగా 150 మిలియన్ జాబ్ మార్క్‌ను అందుకుందని కార్మిక శాఖ మంత్రి అలెగ్జాండర్ పేర్కొన్నారు.
ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ: సీనియర్ డెమోక్రాట్, భారత్ అనుకూల నేతగా పేరున్న నాన్సీ పెలోసీ(78) అమెరికా ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) స్పీకర్‌గా రెండోసారి ఎన్నికయ్యారు. దీంతోపాటు ట్రంప్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే పెలోసీ నేతృత్వంలో సమావేశమైన సభ ‘షట్‌డౌన్’కు ముగింపు పలుకుతూ మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి నిధుల కేటాయింపు లేకుండానే బిల్లును ఆమోదించింది.
అమెరికాలో 3 లక్షల ఉద్యోగాల సృష్టి
Published Sat, Jan 5 2019 5:12 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment