డచ్ పార్లమెంట్‌లో సభ్యులు చేసిన ఆరోపణలు రైతన్నల గుండెల్లో తూటాల్లా పేలాయి. వారంతా ఆందోళన బాట పట్టి ప్రభుత్వాన్ని హడలెత్తించారు. దేశంలో పర్యావరణ కాలుష్యానికి, గాలిలో నైట్రోజన్ ఆక్సైడ్ శాతం పెరిగిపోవడానికి వ్యవసాయమే కారణమని కొందరు సభ్యులు పార్లమెంట్‌లో వ్యాఖ్యానించారు. వారికి మద్దతుగా మరికొందరు గోశాలల్ని మూసివేయాలంటూ నినదించారు. దీంతో అన్నదాతల్లో ఆగ్రహం పెల్లుబుకింది. డచ్‌లో విమానాల పరిశ్రమ సర్వ అనర్థాలకు కారణమంటూ వారు మండిపడ్డారు. కానీ వారిని ఎవరూ నిందించడం లేదని తప్పుబట్టారు. రైతులు నిరసన వ్యక్తం చేయడానికి హేగ్‌కు వెళ్లే రహదారిని వేలాది ట్రాక్టర్లతో మోహరించారు. దాదాపుగా 1,136 కి.మీ. మేర ట్రాఫిక్‌జామ్ అయింది. ఇంచుమించుగా 3 వేల మంది వరకు రైతన్నలు ట్రాక్టర్లతో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment