మాస్కో: ఉత్తర రష్యాలోని సెవెర్నయ గనిలో ఆదివారం మరోమారు మీథేన్ గ్యాస్ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న ఐదుగురు రెస్క్యూ సిబ్బంది, ఒక గని కార్మికుడు మృతి చెందారు. మరో 11 మంది గాయాలపాలయ్యారు. గత గురువారం జరిగిన పేలుడులో నలుగురు మరణించగా.. 26 మంది గల్లంతయ్యారు.
వీరి జాడ కోసం రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతుండగా మరోమారు పేలుడు సంభవించింది. కాగా, గల్లంతైన ఆ 26 మంది బతికుండే అవకాశం లేదని, వారంతా చనిపోయినట్లేనని వొర్కుటౌగోల్ మైన్స్ అధికార ప్రతినిధి తత్యాన బుషుకోవా తెలిపారు. రెండో పేలుడు జరిగిన అనంతరం సహాయక చర్యలను నిలిపివేశామని, గల్లంతైన వారితో కలుపుకుని మొత్తంగా 36 మంది మృతి చెందారని పేర్కొన్నారు.
రష్యాలో గనిలో పేలుడు..36 మంది మృతి
Published Mon, Feb 29 2016 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM
Advertisement