gas explosion
-
రైతు బతుకులో నిప్పులు పోసిన గ్యాస్.. బీరువాలో దాచిన రూ. 6 లక్షలు..
సాక్షి, సూర్యపేట: ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై గుడిసె దగ్ధం కావడంతో ఓ రైతు కుటుంబం బతుకు బుగ్గిపాలైంది. గుడిసెలోని నగదుతోపాటు సామాగ్రి కాలిపోయి కట్టుబట్టలు మిగలడంతో కన్నీరుమున్నీరవుతోంది ఆ కుటుంబం. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో గురువారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం,.. నేలమర్రి గ్రామానికి చెందిన కప్పల లక్ష్మయ్య, నాగమణి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. లక్ష్మయ్య సూర్యాపేట మండల కేటీ అన్నారం గ్రామంలో తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని ఇటీవల విక్రయించగా వారం రోజుల క్రితం రూ.9 లక్షలు వచ్చాయి. ఇందులో నుంచి రూ. 3 లక్షలను గ్రామంలోని ఓ పెద్దమనిషి వద్ద ఉంచి మిగతా రూ. 6 లక్షలు గుడిసెలోని బీరువాలో దాచారు. అయితే గురువారం లక్ష్మయ్య తన భార్యతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. అనంతరం లక్ష్మయ్య పెద్ద కుమార్తె వంట చేసేందుకు ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌ను వెలిగించగా, గ్యాస్‌లీక్ కావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు లేచి గుడిసెకు అంటుకున్నాయి. లక్ష్మయ్య కుమార్తె బయటకు వచ్చికేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పే లోగా రూ. 4 లక్షల విలువైన సామగ్రితోపాటు బీరువాలో ఉన్న రూ.6 లక్షల నగదు పట్టాదారు పాసుపుస్తకాలు అగ్రికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న మునగాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి.. మరో 132 మంది
హాంకాంగ్: మధ్య చైనా నగరంలోని హుబీ ప్రావిన్స్‌లోని షియాన్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు 138 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఉదయం 6:30 గంటలకు జరిగిన ఈ ఘటనలో పేలుడు ధాటికి ఆహార మార్కెట్ భవనం కూలిపోయింది. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న 150 మందిని రక్షించారు. ఇక మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. గాయపడిన వారిని షియాన్‌లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. చదవండి: పెళ్లైన రెండో రోజే.. మాజీ ప్రియురాలి చేతిలో ప్రియుడి హత్య.. ఎందుకంటే? -
గ్యాస్ పైప్‌లైన్ లీక్.. ఏడుగురి మృతి
డాకా: ఓ అపార్టమెంట్లో సమీపంలో గ్యాస్ పైప్‌లైన్ లీకై పేలుడు సంభవించిన ఘటనలో ఏడుగురు మరణించారు. మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు. బంగ్లాదేశ్నిలోని చిట్టాగాంగ్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనంలో సమీపంలో గ్యాస్పైల్ లీక్ అయి భారీ పేలుడు సంభవించడంంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సహాయ చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గత నెల జరిగిన ఓ గ్యాస్ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాజధాని ఢాకా ప్రాంతంలో చోటుచేసుకుంది. -
గ్యాస్ దుర్ఘటన.. నిద్రలో ఉండగానే..
-
గ్యాస్ దుర్ఘటన.. నిద్రలో ఉండగానే..
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో దారుణం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. వివరాలు.. భార్య పిల్లలతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి స్థానికంగా నివాసముంటున్నాడు. శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో వాళ్లింట్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌రెడ్డితో సహా అతని భార్యాపిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయిందని స్థానికులు తెలిపారు. కాగా, గ్యాస్ ఆఫ్ చేయడంలో నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీకైంది గ్రహించక ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేయడంతో ఈ ప్రమాదం జరగొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో శ్రీనివాసులురెడ్డి, బుజ్మమ్మ, నితిన్, భవ్య నిద్రలోనే ప్రాణాలొదిలారని పోలీసులు వెల్లడించారు. ఇదిలాఉండగా.. శ్రీనివాస్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండడంతో.. ఘటనకు సంబంధించి ఏదైనా కుట్ర దాగుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, శ్రీనివాస్‌రెడ్డికి ఎవరితో విభేదాలు లేవని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అతనికి ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడతామని పోలీసులు చెప్పారు ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు చనిపోవడంతో రాజులకండ్రిగలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. -
బొగ్గు గనిలో పేలుడు, 33 మంది మృతి
చైనా: బొగ్గు గనిలో తవ్వకాలు జరుగుతున్న సమయంలో గ్యాస్ పేలుడు సంభవించడం వల్ల 33 మంది మరణించినట్లు బుధవారం అధికారులు ధ్రువీకరించారు. యాంగ్ చువాన్ జిల్లాలోని జిన్ షాంగౌ బొగ్గు నిక్షేపాల్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 80 మందితో కూడిన సహాయక బృందం తాజాగా 15 మృతదేహాలను మైన్ల నుంచి వెలికితీసినట్లు చెప్పారు. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ మైన్ ఓ ప్రైవేటు కంపెనీకి చెందిందనే వార్తలు కూడా వస్తున్నాయి. సోమవారం ఉదయం పేలుడు జరిగిన సమయంలో మొత్తం 35మంది వ్యక్తులు మైన్ లోపల ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మంగళవారం 18 మృతదేహాలను వెలికితీశారు. -
రష్యాలో గనిలో పేలుడు..36 మంది మృతి
మాస్కో: ఉత్తర రష్యాలోని సెవెర్నయ గనిలో ఆదివారం మరోమారు మీథేన్ గ్యాస్ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న ఐదుగురు రెస్క్యూ సిబ్బంది, ఒక గని కార్మికుడు మృతి చెందారు. మరో 11 మంది గాయాలపాలయ్యారు. గత గురువారం జరిగిన పేలుడులో నలుగురు మరణించగా.. 26 మంది గల్లంతయ్యారు. వీరి జాడ కోసం రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతుండగా మరోమారు పేలుడు సంభవించింది. కాగా, గల్లంతైన ఆ 26 మంది బతికుండే అవకాశం లేదని, వారంతా చనిపోయినట్లేనని వొర్కుటౌగోల్ మైన్స్ అధికార ప్రతినిధి తత్యాన బుషుకోవా తెలిపారు. రెండో పేలుడు జరిగిన అనంతరం సహాయక చర్యలను నిలిపివేశామని, గల్లంతైన వారితో కలుపుకుని మొత్తంగా 36 మంది మృతి చెందారని పేర్కొన్నారు. -
గ్యాస్ పేలుడు : కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
మాస్కో : రష్యన్ నగరం యారోస్లావల్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటు చేసుకుంది. నగరంలోని ఐదంతస్తుల భవనంలో శక్తిమంతమైన గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో భవనం కుప్పకూలిందని అత్యవసర మంత్రిత్వశాఖ మాస్కోలో వెల్లడించింది. శిథిలాల కింద 20 మంది చిక్కుకున్నట్లు తెలిపింది. నలుగురిని మాత్రం రక్షించినట్లు పేర్కొంది. ఓ మృతదేహాన్ని మాత్రం శిథిలాల కింద నుంచి వెలికి తీసినట్లు చెప్పింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో 40 మంది ఉన్నారని వెల్లడించింది. అయితే స్వల్పగాయాలైన ముగ్గురిని మాత్రం రక్షించినట్లు తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అత్యవసర మంత్రిత్వశాఖ చెప్పింది.