చైనా: బొగ్గు గనిలో తవ్వకాలు జరుగుతున్న సమయంలో గ్యాస్ పేలుడు సంభవించడం వల్ల 33 మంది మరణించినట్లు బుధవారం అధికారులు ధ్రువీకరించారు. యాంగ్ చువాన్ జిల్లాలోని జిన్ షాంగౌ బొగ్గు నిక్షేపాల్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 80 మందితో కూడిన సహాయక బృందం తాజాగా 15 మృతదేహాలను మైన్ల నుంచి వెలికితీసినట్లు చెప్పారు. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ మైన్ ఓ ప్రైవేటు కంపెనీకి చెందిందనే వార్తలు కూడా వస్తున్నాయి.
సోమవారం ఉదయం పేలుడు జరిగిన సమయంలో మొత్తం 35మంది వ్యక్తులు మైన్ లోపల ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మంగళవారం 18 మృతదేహాలను వెలికితీశారు.
బొగ్గు గనిలో పేలుడు, 33 మంది మృతి
Published Wed, Nov 2 2016 4:48 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
Advertisement