Jinshangou coal mine
-
బొగ్గు గనిలో పేలుడు, 33 మంది మృతి
చైనా: బొగ్గు గనిలో తవ్వకాలు జరుగుతున్న సమయంలో గ్యాస్ పేలుడు సంభవించడం వల్ల 33 మంది మరణించినట్లు బుధవారం అధికారులు ధ్రువీకరించారు. యాంగ్ చువాన్ జిల్లాలోని జిన్ షాంగౌ బొగ్గు నిక్షేపాల్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 80 మందితో కూడిన సహాయక బృందం తాజాగా 15 మృతదేహాలను మైన్ల నుంచి వెలికితీసినట్లు చెప్పారు. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ మైన్ ఓ ప్రైవేటు కంపెనీకి చెందిందనే వార్తలు కూడా వస్తున్నాయి. సోమవారం ఉదయం పేలుడు జరిగిన సమయంలో మొత్తం 35మంది వ్యక్తులు మైన్ లోపల ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మంగళవారం 18 మృతదేహాలను వెలికితీశారు. -
బొగ్గుగనిలో భారీ పేలుడు
బీజింగ్: బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించడంతో కనీసం 15 మందికి పైగా మృతిచెందారు. ఈ ఘటన చైనాలోని చాంగ్ కింగ్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి(భారత కాలమాన ప్రకారం) చోటుచేసుకుంది. స్థానిక అధికారుల వివరాల ప్రకారం.. పశ్చిమచైనా లో బొగ్గుగనిలో తవ్వకాలు జరుగుతుండగా ప్రమాదవశాత్తూ గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. చాంగ్ కింగ్ లోని జిన్హాంగౌ బొగ్గు గనిలో ఒక్కసారిగా ఈ దుర్ఘటన చోటుచేసుకుకోవడంతో అందులో పనిచేస్తున్న 15 మంది మృత్యువాత పడగా, మరో 18 మంది గనిలో చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. గనిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషయంపై స్థానిక మీడియా చాంగ్ కింగ్ మునిసిపల్ అధికారులకు ఫోన్ చేయగా, వారు ఏ విధంగానూ స్పందించడం లేదని సమాచారం. భద్రతాపరమైన ఏర్పాట్లు సరిగ్గా లేనికారణంగానే మృతులసంఖ్య ఎక్కువగా ఉందని స్థానిక మీడియా షిన్హువా వెల్లడించింది.