బీజింగ్: బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించడంతో కనీసం 15 మందికి పైగా మృతిచెందారు. ఈ ఘటన చైనాలోని చాంగ్ కింగ్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి(భారత కాలమాన ప్రకారం) చోటుచేసుకుంది. స్థానిక అధికారుల వివరాల ప్రకారం.. పశ్చిమచైనా లో బొగ్గుగనిలో తవ్వకాలు జరుగుతుండగా ప్రమాదవశాత్తూ గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. చాంగ్ కింగ్ లోని జిన్హాంగౌ బొగ్గు గనిలో ఒక్కసారిగా ఈ దుర్ఘటన చోటుచేసుకుకోవడంతో అందులో పనిచేస్తున్న 15 మంది మృత్యువాత పడగా, మరో 18 మంది గనిలో చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు.
గనిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషయంపై స్థానిక మీడియా చాంగ్ కింగ్ మునిసిపల్ అధికారులకు ఫోన్ చేయగా, వారు ఏ విధంగానూ స్పందించడం లేదని సమాచారం. భద్రతాపరమైన ఏర్పాట్లు సరిగ్గా లేనికారణంగానే మృతులసంఖ్య ఎక్కువగా ఉందని స్థానిక మీడియా షిన్హువా వెల్లడించింది.
బొగ్గుగనిలో భారీ పేలుడు
Published Tue, Nov 1 2016 7:56 AM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
Advertisement
Advertisement