కీవ్: కల్తీ మద్యం సేవించిన 38 మంది మృతి చెందారు. మరో 39 మంది తీవ్ర అస్వస్థతకు గురైచికిత్స పొందుతున్నారు. మరికొంత మంది తమ చూపును సైతం కోల్పోయిన ఘటన ఉక్రెయిన్లో శుక్రవారం చోటు చేసుకుంది. మరిన్ని మరణాలు పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు వెల్లడించారు. గత కొంత కాలంగా కల్తీ మద్యం సేవించి తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతంలో చాలా మంది మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు,ఆరోగ్యశాఖ అదికారులు పలుచోట్ల దాడులు నిర్వహించారు. కర్కోవ్ ప్రాంతంలో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కల్తీ మద్యానికి 38 మంది బలి
Published Sat, Oct 1 2016 7:41 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
Advertisement