అవయవాల సృష్టి ఇక ఈజీ
టోరంటో: హృదయ, కాలేయ కణజాలాల 3డీ మోడళ్లను యూనివర్సిటీ ఆఫ్ టోరంటో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇందుకుగాను వారు ‘పర్సన్ ఆన్ ఏ చిప్’ టెక్నాలజీని వినియోగించారు. భవిష్యత్తులో నిజమైన మానవ అవయవాలను శరీరం వెలుపల వృద్ధిచేయడానికి ఉపయోగపడే టెక్నాలజీ ఇదే. పాడైన అవయవాలను బాగుచేయడానికి లేదా వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చడానికి వీటిని వినియోగించే అవకాశముంది.
తాము రూపొందించిన హృదయ, కాలేయ కణజాల 3డీ నమూనాలు అసలైన అవయవాల మాదిరిగానే పనిచేస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ టోరంటో ప్రొఫెసర్ మిలికా రాడిసిక్ తెలిపారు. తమ లాబొరేటరీలో మరిన్ని మానవ కణజాలాలను అభివృద్ధి చేసే యత్నాల్లో ఉన్నామని చెప్పారు.