లండన్: ఇర్మా తుపాను సమయంలో బ్రిటిష్ వర్జిన్ దీవుల్లోని జైలు నుంచి దాదాపు 100 మంది ఖైదీలు పారిపోయారని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి చెప్పారు. వారి నుంచి ప్రజలకు కలిగే ముప్పును ఎదుర్కొనేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన బ్రిటన్ పార్లమెంటులో వెల్లడించారు. అయితే ఎంత మంది ఖైదీలను తిరిగి పట్టుకున్నదీ మంత్రి స్పష్టం చేయలేదు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం 40 మంది ఖైదీలను తిరిగి బంధించగా, మరో 60 మంది కోసం వేట కొనసాగుతోంది. మరోవైపు నెదర్లాండ్స్ దీవి సెయింట్ మార్టిన్‌లో ఉన్న జైలు గోడ కూలిపోవడంతో అక్కడ ఉన్న ఖైదీలు కూడా తప్పించుకున్నారని వచ్చిన వార్తలను అధికారులు ఖండించారు. గోడ కూలడం నిజమేననీ, ఖైదీలు తప్పించుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ముందుగానే చేశామని అధికారులు చెప్పారు.