prisoners escape
-
భూకంపంతో జైలు గోడలు ధ్వంసం.. 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు జంప్..!
టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించి వేల భవనాలు నేలమట్టం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ భూకంపం కారణంగా కొందరు ఖైదీలకు జైలు నుంచి తప్పించుకునేందుకు అవకాశం లభించింది. టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతం రాజోలోని జైలు భూప్రకంపనల కారణంగా పాక్షికంగా దెబ్బతింది. గోడలకు పగుళ్లు వచ్చి కులిపోయాయి. దీన్నే అదునుగా భావించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థకు చెందిన ఖైదీలు జైలులో తిరుగుబాటు చేశారు. జైలులోని ఓ భాగాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అనంతరం 20 మంది జైలు నుంచి తప్పించుకుని పారిపోయారు. వీరంతా ఐసిస్ సంస్థకు చెందిన వారేరని అధికారులు తెలిపారు. ఈ జైలును టర్కీ అనుకూల గ్రూప్‌లే నియంత్రిస్తాయి. మొత్తం 2,000 మంది ఖైదీలున్నారు. వీరిలో 1,300 మంది ఐసిస్ ఉగ్రసంస్థకు చెందినవారే. వీరితో పాటు సిరియా అనుకూల ఖుర్షీద్ దళాలకు చెందిన ఫైటర్లు ఉన్నారు. అయితే జైలులో తిరుగుబాటు జరిగిన విషయం నిజమేనని, కానీ 20 మంది ఐసిస్ ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు ధ్రువీకరించలేమని బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబసర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ తెలిపింది. ఐసిస్ ఖైదీలను తప్పించేందుకు గతేడాది డిసెంబర్లో సెక్యూరిటీ కాంప్లెక్స్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఖుర్దీష్ దళాలకు చెందిన ఆరుగురు చనిపోయరు. చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
ఇర్మా సమయంలో 100 మంది ఖైదీలు పరార్!
లండన్: ఇర్మా తుపాను సమయంలో బ్రిటిష్ వర్జిన్ దీవుల్లోని జైలు నుంచి దాదాపు 100 మంది ఖైదీలు పారిపోయారని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి చెప్పారు. వారి నుంచి ప్రజలకు కలిగే ముప్పును ఎదుర్కొనేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశామని ఆయన బ్రిటన్ పార్లమెంటులో వెల్లడించారు. అయితే ఎంత మంది ఖైదీలను తిరిగి పట్టుకున్నదీ మంత్రి స్పష్టం చేయలేదు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 40 మంది ఖైదీలను తిరిగి బంధించగా, మరో 60 మంది కోసం వేట కొనసాగుతోంది. మరోవైపు నెదర్లాండ్స్ దీవి సెయింట్ మార్టిన్‌లో ఉన్న జైలు గోడ కూలిపోవడంతో అక్కడ ఉన్న ఖైదీలు కూడా తప్పించుకున్నారని వచ్చిన వార్తలను అధికారులు ఖండించారు. గోడ కూలడం నిజమేననీ, ఖైదీలు తప్పించుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ముందుగానే చేశామని అధికారులు చెప్పారు. -
తీహార్ జైలుకు ఖైదీల కన్నం!
సినీఫక్కీలో ఇద్దరు విచారణ ఖైదీల పరారీ * మూడు 13 అడుగుల గోడలు దూకి...16 అడుగుల గోడకు కన్నం వేసి... * పోలీసులకు చిక్కిన ఒక ఖైదీ సాక్షి, న్యూఢిల్లీ: కన్నాలు వేసినందుకు జైలుపాలైన ఇద్దరు చోరశిఖామణులు దేశంలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతగల జైళ్లలో ఒకటిగా పేరుగాంచిన ఢిల్లీలోని తీహార్ జైలుకే కన్నం వేశారు. 13 అడుగుల పొడవైన మూడు గోడల మీద నుంచి దూకడమే కాకుండా 16 అడుగుల పొడవైన మరో గోడకు కన్నం వేసి తప్పించుకున్నారు. ఫైజన్(19), జావేద్(18) అనే విచారణ ఖైదీలను రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో 7వ నంబర్ జైల్లోని ‘రోజా’ వార్డులో ఉంచగా శనివారం అర్ధరాత్రి దాటాక వారు 13 అడుగుల పొడవున్న ఆ జైలు గోడను దూకారు. అక్కడి నుంచి మరో 13 అడుగుల గోడను దూకి ఆపై 16 అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పు ఉన్న గోడకు రాళ్లతో రంధ్రం చేసి అందులోంచి దూరారు. చివరగా మరో 13 అడుగుల గోడ దూకి దానికి సమీపంలోని డ్రైనేజీ వద్దకు చేరుకున్నారు. అయితే జావేద్‌తో కలసి బయటపడేందుకు ఫైజన్ భయపడగా జావేద్ అతన్ని వదిలేసి డ్రైనేజీలోంచి వెళ్లిపోయాడు. ఫైజన్ అందులో ఇరుక్కుపోవడంతో పోలీసులకు చిక్కాడు. ఆదివారం ఉదయం ఖైదీల హాజరు సమయంలో వారిద్దరూ కనిపించకపోవడంతో ఈ విషయం బయటపడింది. జావేద్ దొరక్కపోవడంతో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఖైదీల పరారీలో జైలు అధికారుల ప్రమేయంపైనా దర్యాప్తు చేస్తున్నారు. పనిముట్లేవీ లేకుండా ఖైదీలు ఉట్టి చేతులతో కన్నం వేయడం సాధ్యం కాదన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రం జైలు అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో కూడా ఆప్ ప్రభుత్వం ఎల్జీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ సొంతంగా విచారణకు ఆదేశించింది. -
జైలు నుంచి నలుగురు ఖైదీలు పరారు
ఖైదీలు, జైలు సిబ్బందికి మధ్య ఘర్షణను అసరాగా చేసుకుని నలుగురు విచారణలో ఉన్న ఖైదీలు పరారైయ్యారు. ఆ ఘటన బీహార్ సీతామర్హి జిల్లాలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఖైదీలు పరారైన విషయాన్ని జైలు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దాంతో వారిని పట్టుకునేందుకు అధికారులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. పరారైన ఖైదీలు సడ్రి అలాం, సుభోద్ కుమార్, సురజ్ కుమార్, వినయ్ బైతాలుగా గుర్తించినట్లు జైలు సుపరింటెండెంట్ మంగళవారం వెల్లడించారు. సుపరింటెండెంట్ కథనం ప్రకారం... తినే ఆహారం నాణ్యత ఉండటం లేదంటూ ఖైదీలు సోమవారం జైలులో నిరసనకు దిగారు. ఆ క్రమంలో జైలు సిబ్బందికి, ఖైదీలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ఘర్షణలో పలువురు తీవ్రంగా ఖైదీలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించడంలో జైలు సిబ్బంది తలమునకలై ఉన్న సమయంలో విచారణలో ఉన్న ఖైదీలు పరారైయ్యారన్నారు. ఖైదీలను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని జైలు సుపరింటెండెంట్ వెల్లడించారు.