ఘోర ప్రమాదం..17 మంది సజీవదహనం
బెర్లిన్: జర్మనిలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది సజీవ దహనమవ్వగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ హృదయ విచారక ఘటన దక్షిణ జర్మని బవేరియా రాష్ట్రంలోని స్టాంబాక్ పట్టణ సమీపంలో చోటుచేసుకుంది. సుమారు 46 మంది ప్రయాణీకులు, ఇద్దరు డ్రైవర్లతో వెళ్తున్న బస్సు ఏ9 మోటార్ వేపై అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సును మంటలు చుట్టుముట్టడంతో బస్సు పూర్తిగా దహనం అయింది. అందులోని 17 మంది అక్కడికక్కడే సజీవ దహనం అవ్వగా 30 మంది గాయపడ్డారు. చికిత్స పొందుతూ మరోకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 18 కి చేరింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేసిన అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
బస్సు, ట్రక్ ఢీకొన్న ఘటనలో 17 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటన దక్షిణ జర్మనీలో సోమవారం చోటుచేసుకుంది. బవేరియా రాష్ట్రంలోని స్టాంబాక్ పట్టణం వైపు దాదాపు 46 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో కొద్దిక్షణాల్లోనే బస్సును మంటలు చుట్టుముట్టాయి. బస్సు పూర్తిగా కాలిపోగా అందులోని 17 మంది సజీవ దహనం కాగా 29 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఏ9 మోటార్‌వేపై వాహన రాకపోకలను పూర్తిగా నిలిపేసిన అధికారులు, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.