న్యూఢిల్లీ: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఇరాక్ నుంచి దాదాపు 600 మంది భారతీయులు బయటపడినట్లు విదేశాంగశాఖ బుధవారం తెలిపింది. మరో 900 మంది కూడా అదే బాటలో ఉన్నారని పేర్కొంది. 530 మంది భారతీయులకు విమాన టికెట్లు అందించామని...మరో 850 మంది పత్రాలను పరిశీలిస్తున్నట్లు వివరించింది. ఇరాక్‌లోని తిక్రిత్‌లో చిక్కుకుపోయిన 46 మంది భారత నర్సులతో బాగ్దాద్‌లోని భారత ఎంబసీ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని, వారంతా క్షేమంగానే ఉన్నారని విదేశాంగశాఖ తెలిపింది.