♦ తీవ్రత 6.1గా నమోదు
♦ శనివారం నాటి భూకంపంలో 525కి చేరిన మృతుల సంఖ్య
మాంటా: ఈక్వెడార్‌లోని తీరప్రాంతంలో బుధవారం 6.1 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. మ్యూజిన్‌కు పశ్చిమాన 25 కి.మీ. దూరంలో 15.7 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తాజా ప్రకంపనలతో సునామీ ప్రమాద మేమీలేదని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు రాలేదు. శనివారం 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపానికి ఎపిక్ కేంద్రంగా ఉన్న ప్రాంతం తాజా భూకంప కేంద్రం దగ్గర్లోనే ఉంది. శనివారం నాటి భూకంపం మృతుల సంఖ్య 525కు చేరింది. 1,700 మంది ఆచూకీ తెలియడం లేదు. పెడెర్నల్స్, మాంటాల్లో సహాయక సిబ్బంది భవన శిథిలాల్లో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికి తీస్తున్నారు.
ఈక్వెడార్‌లో మళ్లీ భూకంపం
Published Thu, Apr 21 2016 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM
Advertisement