ఎయిర్‌పోర్టులో రోబో సేవలు | Airline introduces robot customer service agent | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో రోబో సేవలు

Published Thu, Feb 11 2016 12:08 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM

ఎయిర్‌పోర్టులో రోబో సేవలు

ఎయిర్‌పోర్టులో రోబో సేవలు

టోక్యో: హ్యుమనాయిడ్ రోబోలతో విమాన ప్రయాణికులకు సేవలందించాలని జపాన్ భావిస్తోంది. ఇందుకోసం రూపొందించిన 'నాఓ' అనే రోబోను టోక్యోలోని హానిడా ఎయిర్‌పోర్ట్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ రోబో పొడవు 60 సెం.మీ. జపనీస్, ఇంగ్లిష్, చైనీస్ భాషలు మాట్లాడుతుంది. విమానాశ్రయంలోని సదుపాయాలన్నింటి గురించి చెబుతుంది.

వాతావరణ పరిస్థితులు, గమ్యస్థానాల వివరాలు, విమానాల రాకపోకల సమయాలను తెలుపుతుంది. అంతేకాదు ప్రయాణికులు అడిగే ప్రశ్నలను అర్థం చేసుకుని కచ్చితంగా, వేగంగా జవాబిస్తుంది. ఈ నెల 16 నుంచి 18 వరకు నాఓను మరోసారి పరీక్షిస్తారు. ఆశించిన ఫలితాలు వస్తే నాఓను విమాన ప్రయాణికులకు సేవలందించేందుకు ఉపయోగిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement