ట్విట్టర్‌లో అల్‌కాయిదా! | Al-Qaeda joins Twitter bandwagon | Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌లో అల్‌కాయిదా!

Published Sun, Sep 29 2013 12:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదా కూడా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ బాట పట్టింది.

వాషింగ్టన్‌: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదా కూడా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ బాట పట్టింది. అల్‌కాయిదా తన షముఖ్‌ అల్‌-ఇస్లామ్‌ వెబ్‌సైట్‌ పేరుతో మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో మంగళవారం తొలి ఖాతాను తెరిచినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. సిరియాలో ఇస్లామిస్‌‌ట తిరుగుబాటుదారుల చీలిక నేపథ్యంలో వారిని ఐక్యం చేసే యత్నాల్లో భాగంగానే అల్‌కాయిదా ఈ ఖాతా తెరిచినట్లు ‘ఫాక్‌‌స న్యూస్‌’ పేర్కొంది.

 

సిరియాలో అల్‌కాయిదాకు చెందిన రెండు తిరుగుబాటు ముఠాల మధ్య విభేదాలను పరిష్కరించే దిశగా ట్విట్టర్‌ ఖాతా ద్వారా అల్‌కాయిదా తొలి ట్వీట్‌ చేసినట్లు తెలిపింది. అల్‌కాయిదా ట్విట్టర్‌ ఖాతా ద్వారా 29 ట్వీట్లు చేసిందని, ఆ ఖాతాను ప్రముఖ జీహాదిస్టులతోపాటు 1,532 మంది అనుసరించారని సమాచారం. ఇంటర్‌నెట్‌ సాయంతో ఆన్‌లైన్‌ జిహాద్‌ను ప్రోత్సహిస్తూ ఉగ్రవాద సంస్థలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయనడానికి దీనిని ఓ సూచికగా పరిగణించవచ్చని ఉగ్రవాదనిరోధక సంస్థల అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement