లండన్: అమెరికా రచయిత జార్జ్ శాండర్స్ (58) ఈ ఏడాది మ్యాన్ బుకర్ ప్రైజ్ విజేతగా నిలిచారు. శాండర్స్ రచించిన ‘లింకన్ ఇన్ ది బార్డో’ నవలకు ఈ అవార్డును ప్రకటించారు. దివంగత అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కొడుకు విల్లీ 11 ఏళ్లకే టైఫాయిడ్ వ్యాధిబారిన పడి ప్రాణాలు కోల్పోయాడు.
లింకన్ జీవితంలోని ఆ విషాదంనాటి సంఘటనల సమాహారమే ‘లింకన్ ఇన్ ది బార్డో’ నవల. ఈ నవల కథనం ఆద్యంతం వాస్తవిక కోణంలో ఎంతో అద్భుతంగా ఉందని బుకర్ ప్రైజ్ న్యాయనిర్ణేతల మండలి చైర్మన్ లోలా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment