Booker Prize
-
సమంతాకు ‘బుకర్’
లండన్: బ్రిటిష్ రచ యిత్రి సమంతా హార్వే ను 2024 బుకర్ ప్రైజ్ వరించింది. అంతర్జాతీ య అంతరిక్ష కేంద్రంలోని ఆరుగురు వ్యోమ గాముల జీవితంలో ఒక్క రోజు జరిగే ఘటనలను వర్ణిస్తూ ఆమె రాసిన సైన్స్ ఫిక్షన్ నవల ‘ఆర్బిటాల్’కు ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు సాధించిన తొలి అంతరిక్ష నేపథ్య రచనగా ఆర్బిటా ల్ నిలిచింది. ఈ నవలను 2023 నవంబర్‌లో ప్రచురించారు. బ్రిటన్‌లో అత్యధికంగా అమ్ముడు పోయిన నవలగా నిలిచింది. అంతరిక్షపు అందాలను అద్భుతంగా కళ్లముందు ఉంచిందని జడ్జింగ్ ప్యానెల్ చైర్మన్ ఎడ్మండ్ కొనియాడారు. -
‘ప్రాఫెట్ సాంగ్’ పుస్తకానికి బుకర్ ప్రైజ్
లండన్: ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ రాసిన ‘ప్రాఫెట్ సాంగ్’ పుస్తకానికి ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్–2023 లభించింది. లండన్‌కు చెందిన భారత సంతతి రచయిత చేతన మారూ రాసిన తొలి నవల ‘వెస్ట్రన్ లేన్’ సైతం ఈ బహుమతి కోసం పోటీ పడగా, ప్రొఫెట్ సాంగ్ విజేతగా నిలిచింది. తాజాగా లండన్‌లో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. 46 ఏళ్ల పాల్ లించ్ బుకర్ ప్రైజ్ అందుకున్నారు. ఈ బహుమతి కింద ఆయనకు రూ.52,64,932 నగదు లభించింది. దిగజారుతున్న ప్రజాస్వామ్య విలువలు, పెరిగిపోతున్న నిరంశకుత్వం, ప్రబలుతున్న అశాంతి, వలసల సంక్షోభం.. వంటి పరిస్థితుల్లో ఐర్లాండ్‌లో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓ మహిళ చేసిన పోరాటాన్ని ‘ప్రాఫెట్ సాంగ్’ నవలలో పాల్ లించ్ హృద్యంగా చిత్రీకరించారు. కెన్యాలో జన్మించి లండన్‌లో స్థిరపడిన భారత సంతతి రచయిత చేతన మారూ రాసిన ‘వెస్ట్రన్ లేన్’ నవల టాప్–6లో నిలిచింది. -
Salman Rushdie: కత్తిపోట్ల నుంచి కలం ఈవెంట్ దాకా..
భారత మూలాలున్న వివాదస్పద రచయిత, బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ చాన్నాళ్ల తర్వాత బహిరంగంగా కనిపించాడు. గత ఏడాది ఆగస్టులో అనూహ్యంగా ఓ వ్యక్తి చేతిలో దాడికి గురైన సల్మాన్ రష్డీ ఇప్పుడు ప్రాణాలతో బతికి ఉండడం నిజంగా వైద్య పరంగా గొప్ప విషయమే. అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన PEN America పెన్ అమెరికా ఈవెంట్ కు రష్డీ హాజరయ్యారు. అందరికీ ధన్యవాదాలు, మీ అందరినీ మళ్లీ కలుసుకున్నందుకు సంతోషమన్నారు. ప్రపంచమనే ఈ పుస్తకంలో మానవ హక్కుల కోసం ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుందన్నారు రష్డీ. తనను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని, కత్తిపోట్లకు గురయిన తనను కాపాడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. Salman Rushdie made a surprise appearance at PEN America’s annual gala on Thursday night. It was his first public appearance since he was stabbed and gravely wounded in an attack last August at a literary event in Western New York. https://t.co/EVtnvVrTXF pic.twitter.com/uN0p414O43 — The New York Times (@nytimes) May 19, 2023 ► సల్మాన్ రష్టీపై దాడికి పాల్పడిన వ్యక్తిని.. న్యూజెర్సీకి చెందిన హదీ మటర్ అనే వ్యక్తిగా గుర్తించారు. ► 1988లో సల్మాన్ రష్టీ రాసిన ది సాటానిక్ వెర్సెస్ తీవ్ర దుమారం రేపింది. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ సైతం ఆ నవలను నిషేధించారు. ► ముంబైలో పుట్టిన సల్మాన్ రష్టీ.. ప్రతిష్టాత్మక బుక్ ప్రైజ్‌ను గెల్చుకున్నారు. అదే సమయంలో.. ‘ది సాటానిక్ వెర్సెస్’నవల ద్వారా ఊహించని రేంజ్లో వివాదాన్ని, విమర్శలను మూటగట్టుకున్నారు. ► సల్మాన్ రష్డీ.. 1947 ముంబైలో కశ్మీరీ ముస్లిం కుటుంబంలో జన్మించారు. రాడికల్ రాతలతో అజ్ఞాతంలోనే ఎక్కువగా గడిపారు ఈయన. ఆ టైంలో జోసెఫ్ ఆంటోన్ అనే కలం పేరుతో ఆయన రచనలు సాగాయి. ► 1975 నుంచి 2019 దాకా మొత్తం 14 నవలలు రాశారు ఆయన. ► మిడ్నైట్ చిల్డ్రన్కు బుక్ ప్రైజ్ గెల్చుకోవడంతోపాటు ఇప్పటిదాకా ఐదుసార్లు బుకర్కు నామినేట్ అయ్యారు. ► 2007లో సాహిత్యంలో సేవలకు బ్రిటిష్ ప్రభుత్వం నైట్‌హుడ్ గౌరవం ఇచ్చింది. ► 1988, సెప్టెంబర్‌లో ది సాటానిక్ వెర్సెస్ నవల పబ్లిష్ అయ్యింది. ఈ నవలలోని అంశం ఇస్లాం మతానికి వ్యతిరేకం. రష్డీ తనను తాను ముస్లిమేతరుడిగా, నాస్తికుడిగా అభివర్ణించుకున్నాడు. ఇస్లామిక్ ఛాందసవాదులు సల్మాన్ రష్దీ రాతల్ని చూసి రగిలిపోయారు. అది వివాదం కావడంతో.. ప్రాణభయంతో తొమ్మిదేళ్లపాటు ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు. 76 ఏళ్ల వయసున్న రష్డీ.. తన రెండో నవల మిడ్నైట్స్ చిల్డ్రన్(1981) ద్వారా బుకర్ ప్రైజ్‌ను సాధించి.. ఆ ఘనత అందుకున్న తొలి భారతీయ పౌరుడిగా ఘనత దక్కించుకున్నారు. -
Salman Rushdie: వెంటిలేటర్‌పై రష్దీ.. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం
న్యూయార్క్: భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ది సతానిక్ వర్సెస్ రచన తర్వాత దశాబ్దాలుగా ఇస్లామిక్ బెదిరింపులను ఎదుర్కొంటున్న రష్దీపై ఓ ఆగంతకుడు అమెరికాలో చర్చావేదికపైనే కత్తితో విచక్షణారహితంగా దాడిచేసిన విషయం విదితమే. రక్తసిక్తమైన రష్దీకి వాయవ్య పెన్సిల్వేనియాలోని యూపీఎంసీ హ్యమాట్ సర్జరీ సెంటర్ ఆస్పత్రి వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 20 సెకన్ల వ్యవధిలో ఆగంతకుడు వెనుక 15 సార్లు కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది. ‘గంటలపాటు ఆయనకు శస్త్రచికిత్స కొనసాగింది. మెడ భాగంలో కత్తిపోట్ల కారణంగా మెడ నుంచి చేతిలోకి వచ్చే నరాలు తెగిపోయాయి. ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉంది. పొత్తికడుపుపై కత్తిగాటుతో కాలేయం దెబ్బతింది’ అని సల్మాన్ రష్దీ ప్రతినిధి ఆండ్రూ విలే న్యూయార్క్ టైమ్స్ వార్తాసంస్థతో చెప్పారు. పశ్చిమ న్యూయార్క్‌లోని చౌటాకా ఇన్స్టిట్యూట్లో రష్దీపై దాడి చేసిన వ్యక్తిని 24 ఏళ్ల హదీ మతార్‌గా గుర్తించారు. అతడిపై హత్యాయత్నం, దాడి సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. 150 ఏళ్ల చరిత్రలో తొలి దారుణం ‘150 ఏళ్ల లాభాపేక్షలేని విద్యా సంస్థ చరిత్రలో ఇలా దాడి జరగడం ఇదే తొలిసారి’ అని చౌటౌకా ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు మైఖేల్ హిల్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. సంస్థలో జరిగే కార్యక్రమాలకు భద్రత పెంచాలంటూ గతంలోనే విజ్ఞప్తులు వచ్చాయన్న వార్తలను ఆయన కొట్టేపారేశారు. అయితే, కార్యక్రమ నిర్వాహకులు అక్కడ ఎలాంటి సెక్యూరిటీ సెర్చ్ చేయలేదని, మెటల్ డిటెక్టర్లు లేవని, బ్యాగుల తనిఖీ విధానం లేదని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పడం గమనార్హం. ‘ఇరాన్ నేత అయోతొల్లా హత్య ఆదేశాలిచ్చినా రష్దీ తన స్వేచ్ఛా గళాన్ని వినిపించారు. ఈ కష్టకాలంలో రష్దీ ధైర్యాన్ని, అంకిత భావాన్ని వేనోళ్లా పొగడాల్సిన సమయమిది’ అని కౌంటర్ ఎక్స్‌ట్రీమిజమ్ ప్రాజెక్ట్ సీఈవో మార్క్ వ్యాఖ్యానించారు. ఉగ్రసంస్థల ఆర్థికమూలాలను దెబ్బతీయాలంటూ కౌంటర్ ఎక్స్‌ట్రీమిజమ్ ప్రాజెక్ట్ అనే లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థ పనిచేస్తోంది. దాడిపై ఇరాన్ మౌనం రష్దీని చంపాలంటూ దాదాపు దశాబ్దం క్రితం దేశ సుప్రీం లీడర్ అయోతొల్లా ఇచ్చిన ఫత్వాను ఇన్నాళ్లకు ఓ ఆగంతకుడు అమలుకు యత్నించాడన్న వార్తలపై ఇరాన్ పెదవి విప్పలేదు. ‘ఫత్వాను అమలుచేసే ప్రయత్నం జరిగింది’ అంటూ పొడిపొడిగా ఒక ప్రకటనను మాత్రం శనివారం ఇరాన్ అధికారిక మీడియా వెలువరించింది. ‘ ఇలాంటి ఘటనలు ఇరాన్‌ను అంతర్జాతీయ సమాజం నుంచి దూరం చేస్తాయి’ అని ఇరాన్ మాజీ దౌత్యవేత్త మాషల్లా సెఫాజదీ అన్నారు. దాడిపై వెల్లువెత్తిన నిరసనలు ఘటనను భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా సాహిత్యలోకం అభివర్ణించింది. రచయితల గొంతు నొక్కే, హింసాత్మక, అణచివేత ధోరణులపై ముక్తకంఠంతో తమ తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు. అత్యంత హేయమైన చర్యగా బుకర్ ప్రైజ్ విజేత, రచయిత్రి గీతాంజలి శ్రీ వ్యాఖ్యానించారు. నీల్ గైమన్, అమితవ్ ఘోష్, స్టీఫెన్ కింగ్, జీన్ గెరీరో తదితరులు దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. రష్దీ త్వగా కోలుకోవాలని కోరుకున్నారు. జాగర్‌నాట్ బుక్స్, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా వంటి పలు పబ్లిషింగ్ సంస్థలూ ఘాటుగా స్పందించాయి. ఎవరీ హదీ మతార్? న్యూజెర్సీలోని ఫెయిర్‌వ్యూ ప్రాంతంలో మతార్ నివసిస్తున్నాడు. మతార్ ఎందుకు దాడి చేశాడనే కారణాలను వెతికే పనిలో అమెరికా ఎఫ్‌బీఐ, స్థానిక దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. ‘ఘటనాస్థలిలోని బ్యాక్ ప్యాక్, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సెర్చ్ వారెంట్ తీసుకునే పనిలో అధికారులు ఉన్నారు. దాడి ఘటన వెనుక ఎవరూ ఉండకపోవచ్చని, మతార్ ఒక్కడికే ఇందులో ప్రమేయముందని అధికారులు ప్రాథమికంగా విశ్వసిస్తున్నారు. లెబనాన్ మూలాలున్న మతార్ నేర చరిత్రపై వివరాలు సేకరిస్తున్నాం’ అని పోలీస్ ట్రూప్ కమాండర్ మేజర్ ఎజీన్ జె. స్టాన్జ్యూస్కీ చెప్పారు. అయితే, అతని సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించగా కొన్ని విషయాలపై స్పష్టత వచ్చింది. షియా ఉగ్రవాదులకు ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కు మతార్ సానుభూతిపరుడని తెలుస్తోందని దర్యాప్తులో భాగంగా ఉన్న ఒక ఉన్నతాధికారి ఎన్బీసీ న్యూస్‌తో చెప్పారు. మతార్ వాడుతున్న సెల్‌ఫోన్ మెసేజింగ్ యాప్‌లో ఇరాన్ కమాండర్ ఖాసిమ్ సులేమానీ ఫొటోను దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. సులేమానీ ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్కు సైన్యాధికారిగా ఉన్నాడు. రష్దీ రాసిన రచనను ఇరాన్ 1988లో నిషేధించిన విషయం తెల్సిందే. ఇంత భద్రత అవసరమా? గతంలో రష్దీ వ్యాఖ్య హత్యా బెదిరింపుల నేపథ్యంలో ఆయనకు కల్పించిన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై ఒకానొక దశలో అసహనం వ్యక్తంచేశారని న్యూయార్క్ పోస్ట్ ఒక కథనం ప్రచురించింది. చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్లో ఒక సారి రచయితల సదస్సు జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చిన రష్దీ మాట్లాడారు. ‘ఇంత మందితో నాకు భద్రత కల్పించడం నిజంగా అవసరమా? నాకైతే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. నాకు ఇంతగా అదనపు భద్రత అవసరమని నేనెప్పుడూ అడగలేదు. గతంలో ఎలాంటి భద్రతా లేకుండానే ఇక్కడొకొచ్చాను. ఇప్పుడు ఇదంతా వృథా ప్రయాస. అయినా, భద్రత అవసరమైన రోజులను నేనెప్పుడో దాటేశాను’ అని ఆనాటి సభలో అన్నారు. -
మన అక్షరానికి పట్టాభిషేకం
మన అక్షరానికి అంతర్జాతీయంగా దక్కిన అరుదైన గౌరవం. మనం ఇది గర్వించాల్సిన సందర్భం. అవును... భారతీయ రచయిత్రి గీతాంజలిశ్రీ రాసిన హిందీ నవల ‘రేత్ సమాధి’కి ఆంగ్లానువాదమైన ‘టూంబ్ ఆఫ్ శాండ్’ ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకోవడం సాహితీ ప్రియులకు ఈ మండు వేసవిలో మామిడిపండు లాంటి తీపి కబురు. భారతీయ భాషలోని ఓ రచనకు ఈ పురస్కారం దక్కడం ఇదే ప్రప్రథమం. ఎనిమిది పదుల వయసులోని స్త్రీమూర్తి తన మూలాలు వెతుక్కుంటూ సాగించిన అన్వేషణ నేపథ్యంలో దేశ విభజన నాటి పరిస్థితులనూ, కాలం మాన్పని గాయాలనూ కళ్ళకు కట్టిన నవల ఇది. ప్రేమ, కష్టనష్టాలు, వాటి నుంచి విమోచన లాంటి జీవితంలోని భావోద్వేగాలను చిత్రీకరించిన ఈ నవలకు అత్యున్నత పట్టం కట్టాలని న్యాయనిర్ణేతలు ఏకగ్రీవంగా తీర్మానించడం విశేషం. అనువదించి, అంతర్జాతీయ యవనికపైకి తీసుకొస్తే భారతీయ రచనలు ప్రపంచ సాహిత్య శ్రేణిలో నిలబెడతాయని మరోసారి రుజువైంది. ఢిల్లీకి చెందిన 64 ఏళ్ళ గీతాంజలిశ్రీ రాసిన హిందీ నవల ‘రేత్ సమాధి’ (ఇసుక సమాధి) నాలుగేళ్ళ క్రితం 2018లో ప్రచురితమైంది. తొమ్మిదేళ్ళ శ్రమ ఫలితమైన ఆ పుస్తకాన్ని మరో రచయిత్రి డైసీ రాక్వెల్ ‘టూంబ్ ఆఫ్ శాండ్’గా ఇంగ్లీషులోకి అనువదించారు. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ద్వారా వారిద్దరికీ సంయుక్తంగా 50 వేల పౌండ్ల పారితోషికం దక్కుతుంది. నవల పేరు నుంచి పాత్రల దాకా అనేక అంశాలను ప్రతీకాత్మకంగా ధ్వనింపజేస్తుందీ రచన. భర్త మరణం తర్వాత ప్రపంచానికి దూరం జరిగిన తల్లి, పితృస్వామ్య శృంఖలాలను ఛేదించుకొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఆమె కూతురు, ఉన్నత మధ్యతరగతి కుటుంబంలో సర్వసాధారణంగా కనిపించే కోడలు – ఈ మూడు బలమైన స్త్రీ పాత్రల చుట్టూ అల్లుకున్న కథ అది. ఓ ట్రాన్స్‌జెండర్ పాత్ర వీటికి అదనం. ఈ నవలలో ఇల్లు వదిలి మూలాలు వెతుక్కుంటూ వెళ్ళే మహిళ ఒకరైతే, ప్రపంచంలోని దేశదేశాల్లో సొంత ఇళ్ళున్న రిటైర్డ్ కస్టమ్స్ అధికారిణి మరొకరు. ఇలాంటి విరోధాభాసలతో పాఠకులకు ఎన్నో అంశాలను చెప్పకనే చెబుతారు రచయిత్రి. పేరుకు ఇది కాల్పనిక రచన అయినా, నవలలోని స్థల కాలాదులు, పాత్రలతో నిజజీవిత వ్యక్తులు, పరిస్థితులను స్ఫురింపజేస్తారు. దాదాపు 110 ఏళ్ళ క్రితం మన రవీంద్రనాథ్ టాగూర్ కవితా సంపుటి ‘గీతాంజలి’ సైతం ఇలాగే ఇంగ్లీషులోకి ‘సాంగ్ ఆఫరింగ్స్’ పేరిట అనువాదమైంది. సాహితీ రంగానికి గాను 1913లో నోబెల్ పురస్కారం అందుకుంది. ఒక రకంగా మళ్ళీ అలాంటి గర్వకారణమైన సందర్భం ఇది. ఎందుకంటే, ఇంగ్లీషులోనే నేరుగా రాసే నవలలకు ఏటా వార్షిక బుకర్ ప్రైజ్ ఇస్తారు. కానీ, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్‌ను మాత్రం రెండేళ్ళకు ఒకసారే ఇస్తారు. ఒకప్పుడు దీన్నే మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్‌గా పేర్కొనేవారు. ఇంగ్లీషులోనే ప్రచురితమైన, లేదంటే ఇంగ్లీషు అనువాదం అందుబాటులో ఉన్న రచనల్లో అత్యుత్తమమైనదాన్ని ఎంపిక చేసి, ఈ పురస్కారం అందిస్తారు. గీతాంజలిశ్రీ ‘రేత్ సమాధి’ ఈ పురస్కారాన్ని తొలిసారిగా భారతీయ సాహిత్యాన్ని తెచ్చిపెట్టింది. గతంలో 5 నవలలు, 5 కథా సంపుటాలు వెలువరించిన గీతాంజలిశ్రీ పేరు ఈ తాజా పురస్కారంతో దేశమంతటా వినిపిస్తోంది. మతాలకూ, దేశాలకూ, చివరకు స్త్రీ పురుషులకూ మధ్య మనం సృష్టించుకున్న సరిహద్దులను ఆమె తన రచనలో ప్రతిఫలింపజేశారు. 80 ఏళ్ళ కథానాయకి పాత్ర ద్వారా సంప్రదాయాన్ని ఎదిరించి, హద్దులను చెరిపే మానవ స్ఫూర్తికి పట్టం కట్టారు. లౌకికవాద భావజాల రచనల గీతాం జలిశ్రీ, ఆమె రచనల్లోని భావ తీవ్రత సహజంగానే పాలక వర్గాల్లో కొందరికి రుచించకపోవచ్చు. విజేతను అభినందించడానికి సైతం వారికి నోరు పెగలకపోవచ్చు. అంతమాత్రాన విలువ తగ్గదు. 41 ఏళ్ళ క్రితం 1981లో ‘మిడ్నైట్స్ చిల్డ్రన్’ రచనతో సల్మాన్ రష్దీ బుకర్ ప్రైజ్ అందుకున్నారు. ఆ తరువాత అరుంధతీ రాయ్ (ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్), కిరణ్ దేశాయ్ (ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్), అరవింద్ అడిగ (ది వైట్ టైగర్) ఈ పురస్కారం తెచ్చిపెట్టారు. ఆ వరుసలో మరో అడుగు ముందుకేసి గీతాంజలిశ్రీ తొలిసారి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ సాధించారు. కాళిదాసు, భవభూతుల కాలం నుంచి భారతీయ సాహిత్యం విస్తృతమైనది, వైవిధ్యభరితౖ మెనది. మన ప్రాచీన సాహిత్య ఔన్నత్యానికి పాశ్చాత్యులు శిరసు వంచిన ఘట్టాలు అనేకం. సమ కాలీన భారతీయ సాహిత్యంలోనూ అనర్ఘ రత్నాలెన్నో. కానీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, మరాఠీల్లో వస్తున్న గొప్ప రచనలు ఆయా భాషల పరిధులు దాటి బాహ్యప్రపంచానికి చేరుతున్న సందర్భాలు ఇవాళ్టికీ అరుదు. ఈ తాజా అవార్డుతో మన భారతీయ భాషా సాహిత్యంపై మళ్ళీ విశ్వవ్యాప్తంగా ఆసక్తి రేగుతుంది. అనువాదాలూ పెరిగే అవకాశమూ ఉంది. నిజానికి, అభ్యు దయ సాహిత్యాన్ని అనేక భాషల నుంచి తెలుగులోకి తెచ్చుకున్న మనం అన్నమయ్య నుంచి ఆధునిక సాహిత్యం దాకా మన సాహిత్యపు లోతులను అంతర్జాతీయ పాఠకులకు తగినంతగా చేరవేయలేదు. బుకర్ ప్రైజ్ నిర్ణేతల సారథి సైతం అనువాదాలు లేక, రాక ఎందరో భారతీయ రచయితల ప్రతిభ ప్రపంచానికి తెలియడం లేదన్నారు. అన్ని భాషల్లోనూ, ముఖ్యంగా తెలుగునాట సమర్థులైన ఆంగ్ల అనువాదకులు, ఆ అనువాదాలను ప్రోత్సహించే ప్రచురణకర్తల కొరత నేటికీ ఉంది. దాని నుంచి బయటపడేందుకు ‘రేత్ సమాధి’ నవల, దానికి దక్కిన బుకర్ ప్రైజ్ ఊతమిస్తుందని ఆశిద్దాం. అనువాద కళను ప్రోత్సహిస్తే, భారతీయ సాహిత్యానికి మరో నోబెల్ కల తీరినా ఆశ్చర్యం లేదు. -
Geetanjali Shree: భారత రచయిత్రి గీతాంజలి శ్రీ సంచలనం
భారత రచయిత్రి గీతాంజలి శ్రీ అంతర్జాతీయ సాహిత్య వేదికపై సంచలనం సృష్టించారు. ఆమె రాసిన నవలకు బుకర్ ప్రైజ్ దక్కింది. ఢిల్లీకి చెందిన గీతాంజలి శ్రీ (గీతాంజలి పాండే) హిందీ నవలా, లఘు కథా రచయిత్రి. ఆమె రాసిన రేత్ సమాధి(2018).. ఆంగ్ల తర్జుమా ‘టాంబ్ ఆఫ్ శాండ్’కు 2022కుగానూ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ లభించింది. టాంబ్ ఆఫ్ సాండ్ అనేది అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ భాషలో వ్రాసిన మొదటి పుస్తకం. పైగా హిందీ నుండి అనువదించబడిన మొదటి నవల. అంతేకాదు బుకర్‌ప్రైజ్ గౌరవం అందుకున్న తొలి భారత రచయిత/రచయిత్రి ఈమెనే. గురువారం లండన్‌లో జరిగిన ప్రదానోత్సవంలో.. గీతాంజలి శ్రీ(64)కి ప్రైజ్‌ను అందించారు. గీతాంజలితో పాటు రేత్ సమాధిని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసిన డైసీ రాక్వెల్(అమెరికా)కు కలిపి ఈ గౌరవం అందించారు. అంతేకాదు యాభై వేల బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్లను సైతం క్యాష్ ప్రైజ్‌గా అందించారు. The moment of joy. Huge congratulations to Geetanjali Shree, translator @shreedaisy and @TiltedAxisPress on winning the #2022InternationalBooker Prize for Tomb of Sand @TheBookerPrizes pic.twitter.com/tduTnTzBMo — Ted Hodgkinson (@TeditorTed) May 26, 2022 రేత్ సమాధి.. ఉత్తర భారతంలో ఎనభై ఏళ్ల వృద్ధురాలి కథ. వృద్ధురాలు తన భర్త మరణంతో తీవ్ర డిప్రెషన్లోకి జారుకుంటుంది. ఆపై ఆమె జీవితం కొత్త మారుతుంది.. అది ఎలా అనేది నవలా కథ. బుకర్ వస్తుందని కలలలో కూడా ఊహించలేదు. సాధిస్తా అనుకోలేదు. ఇది ఒక గొప్ప గౌరవం. అద్భుతంగా ఉంది. గర్వంగా ఉంది అని పేర్కొన్నారు గీతాంజలి శ్రీ. ఇప్పటివరకు ఆమె ఐదు నవలలు రాయగా, మయి(2000) క్రాస్‌వర్డ్ బుక్ అవార్డు 2001కి నామినేట్ అయ్యింది. భారతీయ ప్రముఖ రచయిత ప్రేమ్‌చంద్‌పై విమర్శనాత్మక రచన కూడా చేసింది. చిన్నతనంలో పిల్లల పుస్తకాలు ఎక్కువగా ఆంగ్లంలో లేకపోవడంతోనే తాను హిందీపై మక్కువ పెంచుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్తుంటారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనల ఆధారంగా రాసిన హమారా షహర్ ఉస్ బరాస్ విమర్శలకు ప్రశంసలు అందుకుంది. Take a look at the moment Geetanjali Shree and @shreedaisy found out that they had won the #2022InternationalBooker Prize! Find out more about ‘Tomb of Sand’ here: https://t.co/VBBrTmfNIH@TiltedAxisPress #TranslatedFiction pic.twitter.com/YGJDgMLD6G — The Booker Prizes (@TheBookerPrizes) May 26, 2022 డైసీ రాక్వెల్.. అమెరికన్ రైటర్, ట్రాన్స్‌లేటర్‌గా మాత్రమే కాదు.. పెయింటర్‌గా కూడా పాపులర్. ఉర్దూ, హిందీ నవలలను, రచలను ఎన్నింటినో ఆమె ఆంగ్లంలోకి అనువదించారు. వాస్తవానికి 2018లో హిందీలో రేత్ సమాధి ప్రచురించబడింది, 'టాంబ్ ఆఫ్ సాండ్' ఆమె పుస్తకాలలో యూకే ఇంగ్లీష్‌లోకి తర్జుమా అయయింది. టిల్టెడ్ యాక్సిస్ ప్రెస్ ద్వారా ఆగస్టు 2021లో ఆంగ్లంలో ప్రచురించబడింది. మొత్తం 135 పుస్తకాలను యూకేకు చెందిన ఈ అంతర్జాతీయ సాహిత్య వేదిక జ్యూరీ పరిశీలించగా.. చివరి తరుణంలో ఆరు పుస్తకాలు బుకర్ ప్రైజ్ కోసం పోటీపడ్డాయి. అందులో టాంబ్ ఆఫ్ శాండ్‌కు ఈ గౌరవం దక్కింది. -
బుకర్ ప్రెజ్ రేసులో సంజీవ్ సహోతా
లండన్: ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ కోసం ఈ ఏడాది 13 మంది రచయతలు పోటీ పడుతున్నారు. బుకర్ ప్రెజ్ లాంగ్ లిస్టులోని ఈ 13 మందిలో భారతీయ సంతతికి చెందిన సంజీవ్ సహోతా కూడా ఉన్నారు. ఆయన రచించిన చైనా రూమ్ నవల్లో వలసదారుల అనుభవాల విషయంపై నవలలో అద్భుతమైన మలుపు ఉందని జడ్జిలు ప్రశంసించారు. 1960ల్లో సంజీవ్ తాత బ్రిటన్‌కు వలసవచ్చారు. 2015లో సైతం ఆయన బుకర్ ప్రైజ్‌కు షార్ట్ లిస్టయ్యారు. 2017లో ఆయన యూరోపియన్ యూనియన్ సాహిత్య బహుమతి అందుకున్నారు. తాజా పుస్తకం చైనా రూమ్ పలువురి ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ఫ్రైజ్ కోసం పోటీ పడుతున్న జాబితాలో సంజీవ్‌తో పాటు గత విజేత కజో ఇషిగురో, దక్షిణాఫ్రికా రచయత డామన్‌గాలట్, అమెరికా రచయత రిచర్డ్ పవర్స్, శ్రీలంక రచయత అనుక్ అరుద్‌ప్రగాశమ్, కెనడాకు చెందిస రబెల్ కస్క్, అమెరికాకు చెందని నాథన్ హారిస్ తదితర లబ్దప్రతిష్టులు ఉన్నారు. ఈ 13 మంది నుంచి ఆరుగురి రచనలను షార్ట్‌లిస్ట్ చేసి సెప్టెంబర్ 14న ప్రకటిస్తారు. ఈ ఆరుగురికి 2,500 పౌండ్ల బహుమతి లభిస్తుంది. అంతిమ విజేతను నవంబర్3న ప్రకటిస్తారు. విజేతకు 50వేల పౌండ్ల ప్రైజ్‌మనీ దక్కుతుంది. 2020లో ఈ బహుమతిని షుగ్గీ బీన్ అనే నవలకు స్కాటిష్ అమెరికన్ రచయత డగ్లస్ స్టూవార్డ్ అందుకున్నారు. -
డగ్లస్ స్టువార్ట్‌కు బుకర్ ప్రైజ్
లండన్: న్యూయార్క్‌కు చెందిన స్కాటిష్ రచయత డగ్లస్ స్టువార్ట్ 2020 సంవత్సర బుకర్ప్రైజ్ను గెలుచుకున్నారు. ‘‘షుగ్గీబెయిన్’’ పేరిట రచించిన తన ఆత్మకథకు ఆయన 50వేల పౌండ్ల బుకర్ ప్రైజ్‌ను సాధించారు. 1980 ప్రాంతంలో గ్లాస్గో నగరంలో జరిగిన ఘటనల సమాహారంగా ఈ నవలను మలచారు. పోటీలో ఐదుగురు రచయితలను తోసిరాజని డగ్లస్ ఈ బహుమతి పొందారు. పోటీలో పాల్గొని ఓటమి పొందిన వారిలో భారతీయ మూలాలున్న రచయిత అవని దోషి (రచన: బర్న్ట్ షుగర్)కూడా ఉన్నారు. రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌లో గ్రాడ్యుయేషన్ అనంతరం డగ్లస్ న్యూయార్క్‌కు వచ్చారు. షుగ్గీ బెయిన్ పబ్లిష్ కావడానికి ముందు 30 మంది ఎడిటర్లు ఆ రచనను తిరస్కరించారు. (చదవండి: జార్జియా రీకౌంటింగ్‌లో బైడెన్ గెలుపు) -
కూతురి ఒడిలో అమ్మ
ఏమయింది ఆ తల్లికి! మొండిగా, నిక్కచ్చిగా పెరిగింది. తల్లిదండ్రులపై కోపం. భర్తపై అసంతృప్తి. బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది. బిడ్డనూ పట్టించుకోలేదు. బిడ్డే తల్లిని ఒడిలోకి తీసుకుంది! ‘బుకర్’ పోటీలో ఓ నవల ఇది. బహుమతికి వడపోత మొదలైంది. పదమూడు మందిలో... తొమ్మిది మంది రచయిత్రులే! ఒకరిని మించిన థీమ్ ఒకరిది. జడ్జిలకు పెద్ద పరీక్షే పెట్టారు. చిన్నప్పుడు తార మొండిగా ఉండేది. పెద్దయ్యాక, పెళ్లయ్యాక కూడా! అయితే కారణం ఉండేది ఆ మొండితనానికి. భర్త తనతో ప్రేమగా ఉండటం లేదని అతyì నుంచి విడిపోయింది. ఒడిలో చిన్న బిడ్డ. అంత బిడ్డ ఉన్న తల్లి ఎంత జాగ్రత్తగా ఉండాలి! ఉండదు. సంపన్నులైన తన తల్లిదండ్రులకు చెడ్డపేరు తేవడానికి ఆశ్రమ జీవితం గడుపుతూ, పనిగట్టుకుని యాచకురాలిగా కొన్నాళ్లు గడుపుతుంది. తైల సంస్కారం ఉండదు, మంచి బట్టలు వేసుకోదు. కూతురు పెద్దదవుతుంటుంది. తారకూ వయసు మీద పడి అన్నీ మర్చిపోతుంటుంది. కూతురే ఆమెను జాగ్రత్తగా చూసుకోవలసిన స్థితికి వస్తుంది. తల్లి.. కూతురి ఒడిలో బిడ్డవుతుంది! తల్లి తనకేదైతే ‘కేరింగ్’ను ఇవ్వలేదో, అదే కేరింగ్‌ను కూతురు తన తల్లికి ఇవ్వవలసి వస్తుంది. ఆ తల్లీకూతుళ్ల మధ్య ప్రేమ, ద్వేషాలే.. ‘బరన్ట్ షుగర్’ నవల. పోటీలో గెలిస్తే 50 లక్షల రూపాయల నగదు బహుమతి వచ్చే ‘బుకర్ ప్రైజ్’ రేస్‌లో ఉంది ‘బరన్ట్ షుగర్’! దుబాయ్‌లో ఉంటున్న అవనీ దోషీ ఈ పుస్తక రచయిత్రి. అవని కనుక ఈ ఏడాది విజేత అయితే.. అరుంధతీరాయ్, కిరణ్ దేశాయ్‌ల తర్వాత బుకర్ ప్రైజ్ పొందిన మూడో భారతీయురాలు అవుతారు. లండన్‌లోని ‘బుకర్ ప్రైజ్’ కమిటీ మంగళవారం విడుదల చేసిన తొలి వడపోత (లాంగ్ లిస్ట్) ఆంగ్ల భాషా నవలా రచయితల జాబితాలో (పుస్తకాల జాబితా అనాలి) 165 మందికి 13 మంది మిగిలారు. వారిలో ఒకరు అవనీ దోషీ. ఈ పదమూడు మందిలోంచి ఆరుగురిని రెండో విడతగా (షార్ట్ లిస్ట్) వడకడతారు. నవంబరులో అంతిమ విజేతను ప్రకటిస్తారు. అవని తొలి నవల ‘గర్ల్ ఇన్ ది వైట్ కాటన్’. గత ఏడాది ఆగస్టులో ఇండియాలో పబ్లిష్ అయింది. అందుకనే పోటీకి పంపించలేక పోయింది. యు.కె., ఐర్లండ్‌లలో ప్రచురణ అయిన నవలలను మాత్రమే బుకర్ కమిటీ పోటీకి స్వీకరిస్తుంది. ‘బరన్ట్ షుగర్’ అవని రెండో నవల. లండన్‌లోని పెంగ్విన్ బుక్స్ సంస్థ ఈ రోజు (జూలై 30) ఆ పుస్తకాన్ని విడుదల చేస్తోంది. ముందరి ఏడాది అక్టోబర్ 1 నుంచి.. అవార్డు ప్రకటించే ఏడాది సెప్టెంబర్ 30 లోపు వచ్చిన పుస్తకాలను బుకర్ కమిటీ పోటీకి పరిగణనలోకి తీసుకుంటుంది కనుక ‘బరన్ట్ షుగర్’ పోటీలో చోటు చేసుకుంది. ఏడాది బుకర్ ప్రైజ్ లాంగ్ లిస్ట్‌లో ఒక విశేషం ఉంది. పోటీకి నిలిచిన పదమూడు మందిలో తొమ్మిది మంది మహిళా రచయితలే. అవనితో పాటు.. డయేన్ కుక్ (ది న్యూ వైల్డర్నెస్), ట్సిట్సీ డాన్గరేంబ్గా (దిస్ మార్నబుల్ బాడీ), హిలరీ మాంటెల్ (ది మిర్రర్ అండ్ ది లైట్), మాజా మాంగిస్ట్ (ది షాడో కింగ్), కైలీ రీడ్ (సచ్ ఎ ఫన్ ఏజ్) యాన్ టైలర్ (రెడ్‌హెడ్ బై ది సైడ్ ఆఫ్ ది రోడ్), సోఫీ వార్డ్ (లవ్ అండ్ అదర్ థాట్ ఎక్స్పెరిమెంట్స్), పామ్ జాంగ్ (హౌ మచ్ ఆఫ్ దీజ్ హిల్స్ ఈజ్ గోల్డ్).. ఒకరికొకరు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ తొమ్మిది పుస్తకాలలో ‘ది మిర్రర్ అండ్ ది లైట్’కి కనుక ప్రైజ్ వస్తే.. పుస్తక రచయిత్రి హిలరీ మాంటెల్కి ఇది మూడో ‘బుకర్’ అవుతుంది. 2009లో, 2012లో ప్రైజ్ గెలుచుకున్న ‘ఉల్ఫ్ హాల్’, ‘బ్రింగ్ అప్ ద బాడీస్’ ఆమె రాసిన నవలలే. ఏమైనా ఈ ఏడాది పోటీ ‘టఫ్’గా ఉండబోతోంది. ఈ ‘నవ’లామణులు ఒకరిని మించిన థీమ్‌తో ఒకరు న్యాయ నిర్ణేతలకు గట్టి పరీక్షే పెట్టబోతున్నారు. నవలల సారాంశం ‘ది న్యూ వైల్టర్నెస్’ వాతావరణ మార్పులకు నివాసయోగ్యం కాని ప్రపంచం నుంచి కూతుర్ని కాపాడుకునే తల్లి కథ. ‘దిస్ మార్నబుల్ బాడీ’ జీవితానికి ఆశల రెక్కలు తొడుగుతుంది. ‘ది మిర్రర్ అండ్ ది లైట్’ ఎనిమిదవ హెన్రీ చక్రవర్తి ముఖ్య సలహాదారు థామస్ క్రాంవెల్ చరమాంకం. ‘ది షాడో కింగ్’ ఒక సైనికాధికారి ఇంట్లోకి పనమ్మాయిగా వచ్చిన అనాథ.. నియమ నిబంధనలతో కూడిన తన కొత్త జీవితానికి అలవాటు పడలేకపోవడం. ‘సచ్ ఎ ఫన్ ఏజ్’.. తగని చోట తగిన విధంగా ఉంటే ఏం జరుగుతుందన్నది! ‘రెడ్‌హెడ్ బై ది సైడ్ ఆఫ్ ది రోడ్’ అసంఖ్యాకంగా అక్కచెల్లెళ్లు, అత్తమామల కుటుంబ సభ్యులతో విసురుగా మెసిలే ఒక మొరటు మనిషి హృదయ నైర్మల్యం. ‘లవ్ అండ్ అదర్ థాట్ ఎక్స్పెరిమెంట్స్’ పిల్లలు పుట్టడం ఎదురు కోసం చూస్తూ, భవిష్యత్తును అల్లుకుంటున్న ఓ జంట జీవితంలోని హటాత్పరిణామం. ‘హౌ మచ్ ఆఫ్ దీజ్ హిల్స్ ఈజ్ గోల్డ్’ గూడు కోసం, అదృష్టం కోసం వెదకులాడే ఒక వలస కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన అనూహ్య ఘర్షణ. -
‘ప్రేమలో పడుతున్నాం.. నిబంధనలు ఉల్లంఘించాం’
లండన్ : ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు రచయిత్రులకు అరుదైన గౌరవం దక్కింది. మహిళలకు సంబంధించిన అంశాలే ప్రధాన కథావస్తువుగా ఎంచుకున్న మార్గరెట్ ఎట్వుడ్, బెర్నార్డైన్ ఎవరిస్టో సంయుక్తంగా బుకర్ ప్రైజ్-2019ను సొంతం చేసుకున్నారు. 1984లో లింగసమానత్వంపై తాను రాసిన ‘ద హ్యాండ్‌మేడ్’ టేల్‌తో ప్రాచుర్యం పొందిన కెనడియన్ రచయిత్రి ఎట్వుడ్... తన తాజా నవల ‘ద టెస్టామెంట్’కు గానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకోగా.... ‘గర్ల్, వుమన్, అదర్’ నవలతో బుకర్ ప్రైజ్ సాధించిన తొలి నల్లజాతి మహిళగా ఎవరిస్టో నిలిచారు. కాగా కాల్పనిక సాహిత్యానికి ఇచ్చే ఈ అత్యున్నత అవార్డు చరిత్ర(1969లో ప్రారంభమైంది)లో 1992 తర్వాత తొలిసారి ఇద్దరు విజేతలను ప్రకటించడం విశేషం. ఈ విషయం గురించి న్యాయ నిర్ణేతల మండలి చైర్మన్ పీటర్ ఫ్లోరెన్స్ మాట్లాడుతూ.. దాదాపు ఐదు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. ‘మేము తీసుకున్నది నిబంధనలను ఉల్లంఘించే నిర్ణయం. వారి గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే... అంత ఎక్కువగా వారితో ప్రేమలో పడిపోతున్నాం. కాబట్టి వారిద్దరూ గెలవాలని కోరుకున్నాం’ అని ఎట్వుడ్, ఎవరిస్టోను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక ఎవరిస్టోతో కలిసి సంయుక్తంగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం తనకు ఆనందంగా ఉందని 79ఏళ్ల ఎట్వుడ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ నేను తొందరగా ముసలిదాన్ని అయ్యానని అనిపిస్తోంది. కాబట్టి నాకు ఎవరి అటెన్షన్ అక్కర్లేదు. అయితే నీకు అవార్డు రావడం వల్ల అటెన్షన్ మొత్తం నీ మీదే ఉంటుంది(తన కంటే వయసులో చిన్నవారనే ఉద్దేశంతో). నేను ఒక్కదాన్నే అవార్డు తీసుకుని ఉంటే కాస్త ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు నువ్వు నాతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ గిల్్డహాల్లో జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఎవరిస్టోతో ఎట్వుడ్ సరాదాగా వ్యాఖ్యానించారు. కాగా ఆమె రాసిన ‘ద హ్యాండ్మేడ్స్ టేల్’ కూడా 1986లో బుకర్ ప్రైజ్‌కు షార్ట్‌లిస్ట్ అయింది. మేము రాయకపోతే... బుకర్ ప్రైజ్ సొంతం చేసుకున్న సందర్భంగా ఎవరిస్టో(60) మాట్లాడుతూ.. ‘నల్లజాతి బ్రిటీష్ మహిళలమైన మా గురించి మేము రాయకపోతే ఇంకెవరూ సాహిత్యంలో మాకు చోటివ్వరు. లెజెండ్, దయా హృదయురాలైన మార్గరెట్ ఎట్వుడ్తో కలిసి ఈ అవార్డు పంచుకోవడం అసమానమైనది’ అని ఉద్వేగానికి గురయ్యారు. నల్లజాతికి చెందిన భిన్న మనస్తత్వాలు కలిగిన పన్నెండు మంది మహిళలు తమ కుటుంబం, స్నేహితులు, ప్రేమికుల గురించి పంచుకునే భావాలే.. ‘గర్ల్, వుమన్, అదర్’ నవల సమాహారం. కాగా భారత్‌కు చెందిన సల్మాన్ రష్దీ నవల ‘క్విచోటే’ కూడా బుకర్ ప్రైజ్‌కు షార్ట్‌లిస్ట్ అయిన ఆరు నవలల్లో ఒకటిగా నిలిచింది. సమకాలీన అమెరికాలోని క్రేజీనెస్‌ను రష్దీ తన నవలలో అద్భుతంగా వర్ణించారని జ్యూరీ పేర్కొంది. ఇక ముంబైలో జన్మించిన రష్దీ.. నవలలు ప్రతిష్టాత్మక అవార్డు తుదిజాబితాలో చోటు దక్కించుకోవడం ఇది ఐదోసారి. 1981లో ఆయన రాసిన ‘మిడ్నైట్స్ చిల్డ్రన్’ నవలకు బుకర్ ప్రైజ్ లభించిన విషయం తెలిసిందే. -
మూడు జీవితాల ముచ్చటకు బుకర్
కొత్త బంగారం ఒమాన్ రాజధాని నగరం మస్కట్‌కు దగ్గర్లోనే ఉన్న కాల్పనిక ఊరైన ‘అల్ అవాఫీ’ లో ధనిక కుటుంబపు సలీమా, అజ్జాన్లకు ముగ్గురు కూతుళ్ళు. మయ్యాకు కుట్టుపనంటే ఇష్టం. తనిష్టపడిన అలీతో ప్రేమ విఫలమై, ధనవంతుడైన అబ్దల్లాని పెళ్ళి చేసుకుంటుంది. పుస్తక పురుగైన అస్మాకు తల్లిదండ్రుల ఇష్టప్రకారం ఖాలిద్‌తో పెళ్ళవుతుంది. ఆఖరిదైన ఖ్వాలా, కెనెడా నుంచి తిరిగి వచ్చిన తండ్రి సహోదరుడి కొడుకును వివాహమాడుతుంది. మయ్యా తన కూతురుకి ‘లండన్’ అన్న పేరు పెడుతుంది. భర్తను పట్టించుకోదు. ‘మయ్యా, ప్రేమంటే తెలియదా? నీ కళ్ళెప్పుడూ కుట్టు మెషీన్ మీదే ఉంటాయి తప్ప నన్ను గానీ నా ప్రేమని గానీ ఎందుకు చూడలేవు?’ అని అబ్దల్లా అడిగి, ‘యీ టీవీ డైలాగులేమిటి? నీవు చూసే ఈజిప్షియన్ సినిమాల ప్రభావమా!’ అన్న మయ్యా ఎగతాళిని ఎదురుకుంటాడు. అజ్జాన్– ‘చందమామంత అందంగా ఉండే’ నాజియాతో ప్రేమలో పడి, సలీమాను నిర్లక్ష్యపెడతాడు. జరీఫా– అబ్దల్లా తండ్రి సులేమాన్ ఇంటి బానిస. ఒమాన్ సమాజంలో చోటు చేసుకుంటున్న సామాజిక మార్పులను అంగీకరించే ముగ్గురు అక్కచెల్లెళ్ళనీ, వారి కుటుంబాలనీ అనుసరిస్తుంది జోఖా అల్హార్తీ రాసిన ‘సెలెస్టియల్ బాడీస్’ నవల. గత సంఘటనల ద్వారా– రచయిత్రి, పాఠకులకు ఒమాన్ దేశపు పేదరికాన్నీ, పడిన కష్టాలనూ చిన్నచిన్న సంఘటనల ద్వారా చూపుతారు (బ్రిటిష్ పాలన, తిరుగుబాటు, ఒప్పందం) . అబ్ద్దల్లా– తండ్రి చేసిన బానిసల వర్తకం గుర్తు చేసుకుంటాడు. ‘‘ఆయన అరవడం మానలేదు. ‘ఒరేయ్, సంజర్ను గుంజకు కట్టేయండ్రా. వాడికి ఎవరు నీళ్ళిచ్చినా, నీడ కలిపించినా నాకు సమాధానం చెప్పాలి’ అన్నప్పుడు– ‘నాన్నా, ప్రభుత్వం బానిసలను విడిపించి ఎన్నేళ్ళో అయింది’’ అంటాడు అబ్దల్లా. అతనికి నిద్రలో ఒకే జ్ఞాపకం కలలో వస్తుంటుంది. తండ్రి తనను నూతిలో తలకిందులా వేళ్ళాడదీయడం. ‘అయ్యో, వద్దు, వద్దు’ అని వేడుకుంటున్నప్పుడు మెలకువ వస్తుంది. తనను పెంచిన జరీఫాను తన తల్లి గురించి ఎన్నిసార్లు అడిగినా, ఆమె మరణించిందని తప్ప సరైన సమాధానం ఎప్పుడూ దొరకదు. తల్లి జీవించే ఉందన్న సూచన మాత్రం నవల చివర్న కనబడుతుంది. జరీఫా కొడుకు, ‘నాకు పెళ్ళి చేసి మమ్మల్నిద్దరినీ పని చేయిస్తాడు సులేమాన్. ఇప్పుడు మనం బానిసలం కాము’ అన్నప్పుడు, తల్లి ‘అతనే లేకపోతే మనం ముష్టెత్తుకునేవాళ్ళం’ అంటుంది. ఒమాన్‌లో బానిసత్వం 1970 లోనే రద్దయినప్పటికీ, బానిసల ప్రవర్తన గానీ బానిసల యజమానుల ఆలోచనలు గానీ మారవు. లండన్– బానిస సంతతిని పెళ్ళి చేసుకుని– అతని దాంపత్య ద్రోహం, అతను తన్ని కొట్టడం భరించలేక విడాకులు తీసుకుంటుంది. ఒమాన్‌లో కాన్పు తరువాత పొట్ట రాకుండా, 40 రోజులు కడుపుకి రాయిని కడతారు. ఇంటి బయట వేరే గదిలో ఉంచుతారు. పెళ్ళికి ముందు వారంపాటు పెళ్ళి కూతుర్ని ఎవరూ చూడకూడదు. ఆస్మా పెళ్ళప్పుడు, అందరూ ఒక బంధువు ఉదంతం చెప్పుకుంటారు: శోభనపు రాత్రి భర్తను ఏడిపించేందుకు ఒకామెకు సూది కొనలుండే గాజులు తొడుగుతారు. అదర్థం కాని ఆమె– రాత్రి భర్త తనను సమీపించినప్పుడల్లా గాజులతో గుచ్చిగుచ్చి పెడుతుంది. నెలరోజుల తరువాత భయపడిన భర్త అడుగుతాడు: ‘నన్ను బలవంతంగా కట్టబెట్టారా, నన్నిలా గాజులతో చంపుతున్నావు!’ అని. చితక్కొట్టి్టన వెల్లుల్లి రెబ్బకి సూది గుచ్చి(ఇన్ఫెక్షన్ రాకుండా), ఆడపిల్లల చెవులకి పైనుండి కిందవరకూ పది కన్నాలు పొడుస్తారు. ఇలాంటి ఆచారాల వివరాలెన్నో ఉంటాయి పుస్తకంలో. ఒమాన్ ఉన్నత వర్గం– అత్తరు మానేసి, గూచీ పెర్ఫ్యూమ్ ఆధునికతనైతే అలవరచుకుంటుంది గానీ దృక్పథం మాత్రం సనాతనమైనదే. అధికారం ఉండేది పురుషుని చేతిలోనే. రచయిత్రి అల్హార్తీ బానిసలను గొప్పగానూ చూపించరు, బానిసల యజమానులను దుయ్యనూబట్టరు. అక్కచెల్లెళ్ళ జీవితాల కథలు చూపుతూ ఎడారి ప్రాంతం నుండి రాజధానికి చేరిన మూడు తరాల కథలనూ చెప్తారు. రచనకున్న నిర్మాణ క్రమం గమనింపతగ్గది. 60 అధ్యాయాలున్న నవల్లో– ఒక అధ్యాయం ప్రథమ పురుషలో ఉన్న ఒక పాత్ర కథనం అయితే, రెండోది విమానంలో కూర్చుని తన జీవితం గురించి ఆలోచించుకుంటున్న అబ్దల్లా గొంతుతో ఉంటుంది. అయితే, ఒక క్రమం అంటూ లేని కథనాలన్నీ గతంలో జరిగిన సంఘటనలను వర్ణించేవే. ప్రతీ అధ్యాయం భిన్నమైన పాత్రల మీద కేంద్రీకరిస్తుంది. ఎవరెవరికి ఏ విధమైన చుట్టరికమో తెలుసుకోడానికి, మొదటి పేజీలో ఉన్న వంశవృక్షాన్ని అస్తమానం చూడాల్సి వస్తుంది. నవలకున్న కొద్దిపాటి కథాంశమేదో మొదట్లోనే ఉంటుంది. అల్హార్తీ చేసినదల్లా అక్కడున్న ఖాళీలని పూరించడమే. జాతి, బానిసత్వం, లింగం గురించిన పడికట్టు మాటలేవీ ఉపయోగించరు రచయిత్రి. ఒక నిర్దిష్టమైన ముగింపు లేని నవలిది. సంభాషణలు తక్కువ. అవి కూడా కథనంలో కలిసిపోయి ఉంటాయి. ప్రతి పాత్రా ఏదో విధానంలో చరిత్రలో చిక్కుకునే ఉంటుంది. విమోచన కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. లండన్ డాక్టర్ అయివుండి కూడా ముందుకు కదలలేకపోతుంది. నవలకు ఈ వారంలోనే ‘మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్’ ప్రదానం చేశారు. అరబ్ దేశాల నుండి మొట్టమొదటి మ్యాన్ బుకర్ అవార్డ్ పొందిన రచయిత అల్హార్తీ. 2016 నుంచి మారిన నియమాల ప్రకారం, యాబై వేల పౌండ్ల అవార్డ్ సొమ్ముని పుస్తకాన్ని ఇంగ్లిష్‌లోకి అనువదించిన మారిలిన్ బూథ్తో పంచుకున్నారు. అల్హార్తీ– ఎడిన్బర్ యూనివర్సిటీ నుండి క్లాసికల్ అరబిక్ లిటరేచర్‌లో పీహెచ్డీ పొందారు. ప్రస్తుతం ఒమాన్‌లోని సుల్తన్ ఖాబూస్ యూనివర్సిటీలో అరబిక్ డిపార్టుమెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. - కృష్ణ వేణి -
‘ద ఇంగ్లిష్ పేషంట్’కు గోల్డెన్ బుకర్
లండన్: శ్రీలంక మూలాలు కలిగిన కెనడా రచయిత, సాంస్కృతిక దిగ్గజం మైకేల్ ఆందాజీ రచన ‘ద ఇంగ్లిష్ పేషంట్’ గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకుంది. ఇది గత యాభై ఏళ్లలో బుకర్ ప్రైజ్ సాధించిన పుస్తకాల్లో అత్యుత్తమమైందిగా ఎంపికైంది. బుకర్ ప్రైజ్ స్థాపించి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఓటింగ్ నిర్వహించి దీన్ని ఎంపిక చేశారు. గతంలో మ్యాన్ బుకర్ ప్రైజ్ సాధించిన భారతీయ మూలాలు కలిగిన రచయితలు వీఎస్ నైపాల్ (ఇన్ ఎ ఫ్రీ స్టేట్–1971), సల్మాన్ రష్దీ (మిడ్నైట్స్ చిల్డ్రన్–1981), అరుంధతీరాయ్ (ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్–1997), కిరణ్ దేశాయ్ (ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్–2006), అరవింద్ అడిగ (ద వైట్ టైగర్–2008)లతో సహా విజేతలందరినీ ఓడించి 74 ఏళ్ల ఆందాజీ ఈ ఘనత సాధించారు. ‘ద ఇంగ్లిష్ పేషంట్’ నవల బేరీ ఉన్స్‌వర్త్ రచన ‘సేక్రెడ్ హంగర్’తో కలిసి 1992లో బుకర్ ప్రైజ్ గెల్చుకుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితుల నేపథ్యంలో ప్రేమ, సంఘర్షణకు సంబంధించిన కథను ఆందాజీ ఆ నవలలో అత్యద్భుత వర్ణనలతో అందరినీ ఆకట్టుకునేలా రచించారు. మ్యాన్ బుకర్ ప్రైజ్ 50వ వార్షికోత్సవం సందర్భంగా గతంలో ఈ ప్రైజ్ సాధించిన 51 మంది విజేతలను జడ్జీల ప్యానెల్‌గా ఎంపిక చేశారు. వారు ప్రతి దశాబ్దానికీ ఓ నవలను ఎంపిక చేయగా.. ఆ ఐదు నవలల్లో ప్రజలు ఓట్ల ద్వారా ఆందాజీ యుద్ధ కాలపు ప్రేమ కథకు పట్టం కట్టారు. ఈ సందర్భంగా లండన్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆందాజీ మాట్లాడుతూ జాబితాలో ఇదే అత్యుత్తమ పుస్తకమని తాను నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ చైర్మన్ హెలెనా కెన్నెడీ ఆందాజీ రచన గురించి మాట్లాడుతూ ‘ఇది కవితాత్మక, తాత్విక అంశాలతో కూడిన సమగ్ర రచనా సృష్టి. ఇది ముమ్మాటికీ గోల్డెన్ మ్యాన్ బుకర్ ప్రైజ్‌కు అర్హత కలిగింది’ అని అన్నారు. జడ్జి కమిలా షంసీ మాట్లాడుతూ ఇది అరుదైన నవలని, అందరినీ భావోద్వేగానికి గురిచేస్తుందని అన్నారు. 2008లో బుకర్ ప్రైజ్ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఓటింగ్ నిర్వహించగా ప్రజలు సల్మాన్ రష్దీ ‘మిడ్నైట్స్ చిల్డ్రన్’కు పట్టం కట్టారు. -
జార్జ్ శాండర్స్‌కు బుకర్ ప్రైజ్
లండన్: అమెరికా రచయిత జార్జ్ శాండర్స్ (58) ఈ ఏడాది మ్యాన్ బుకర్ ప్రైజ్ విజేతగా నిలిచారు. శాండర్స్ రచించిన ‘లింకన్ ఇన్ ది బార్డో’ నవలకు ఈ అవార్డును ప్రకటించారు. దివంగత అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ కొడుకు విల్లీ 11 ఏళ్లకే టైఫాయిడ్ వ్యాధిబారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. లింకన్ జీవితంలోని ఆ విషాదంనాటి సంఘటనల సమాహారమే ‘లింకన్ ఇన్ ది బార్డో’ నవల. ఈ నవల కథనం ఆద్యంతం వాస్తవిక కోణంలో ఎంతో అద్భుతంగా ఉందని బుకర్ ప్రైజ్ న్యాయనిర్ణేతల మండలి చైర్మన్ లోలా పేర్కొన్నారు. -
వినోదం, అశ్లీలాల కలబోత బాలీవుడ్
ఇతర నగరాలతో పోలిస్తే భారతదేశంలో అత్యంత ఉదార ప్రాంతంగా పేరున్న ముంబైలోనే అశ్లీలాన్ని అధికస్థాయిలో సహిస్తున్నారు. అలాగే పొరుగు దేశాలతో పోలిస్తే భారత దేశంలోనే అశ్లీలాన్ని అధికంగా భరిస్తున్నారు. కళాత్మక నాణ్యత కంటే విశాల దృష్టి, సహనభావమే బాలీవుడ్ అత్యుత్తమ లక్షణం. కొన్ని సంవత్సరాల క్రితం ప్రముఖ పాకిస్తానీ రచయిత్రి మోని మొహ్సి న్ భారత్ సందర్శించారు. ‘ది ఫ్రైడే టైమ్స్’ పత్రికలో ఆమె కాలమ్ ఆధారంగా ప్రచురించిన ‘టెండర్ హుక్స్’ పుస్త కాన్ని విడుదల చేయడం నాటి సందర్భం. ముంబైలో ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నేను నా స్నేహితుడు, అంతకు కొద్ది నెలల క్రితమే బుకర్ ప్రైజ్‌కు నామినేట్ అయిన నవలా రచయిత నీల్ ముఖర్జీ హాజరయ్యాము. మోని పుస్తకాన్ని ఆనాడు సామాజిక వ్యంగ్య రచనగా పేర్కొన్నాను. ఆ సభలో మోనీ, పాకిస్తాన్ సమాజం గురించి వాగ్ధాటితో ప్రసంగించారు. ఆ శైలిలో ఆ పుస్తకాన్ని ఎందుకు రాయవలసివచ్చిందో తెలిపారు. అది లాహోర్ సంపన్న గృహిణి రాసుకున్న దినచర్యలా ఉండేది. పాకిస్తాన్, భారత్‌లను సరిపోల్చినప్పుడు ఆమె బాలీవుడ్‌పై ప్రతికూల వ్యాఖ్య చేశారు. బాలీవుడ్ సినిమాల నాణ్యత నాసిర కమనీ, అవి మనకు అవసరం లేదని, బాలీవుడ్ లేకున్నా మనం బతకగలమని ఆమె వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఇరాన్ సినిమాలే మరింత ఉత్త మంగా ఉంటాయని ఆమె అభిప్రాయం. ఆనాడు ఆమె చెప్పిన మాటలను ఇప్పుడు గుర్తు తెచ్చుకుని రాస్తున్నాను. కానీ ఆమె మాటల సారాంశాన్ని ఖచ్చితంగా ఇక్కడ పొందుపర్చాను. ఇరానీ సినిమాల గురించి నాకు పెద్దగా తెలియదు కానీ, డిసెంబర్లో జరిగిన బెంగళూరు చిత్రోత్స వంలో చూపించిన నాసర్ జమిరి చిత్రం ‘విత్ అదర్స్’తోపాటు కొన్ని విసుగుతెప్పించే ఇరాన్ సిని మాలను నేను చూసి ఉన్నాను. కానీ బాలీవుడ్ గురించి ఆమె ఏమన్నారన్న విషయంపై నేను ఆసక్తి చూపించాను. చాలా సంవత్సరాల క్రితం సాదత్ హసన్ మం టో గురించి కూడా ఇలాగే చెప్పుకున్నారు. మంటో కాల్పనికేతర రచనలను నేను అనువదించాను. వాటిలో బాలీవుడ్ తొలి 25 సంవత్సరాల చరిత్రపై వ్యాసం ఒకటి. ‘హిందుస్తానీ సనత్ ఇ ఫిల్మ్సజి పార్ ఏక్ నజర్’ అనేది మూల వ్యాసం పేరు. దాంట్లో మంటో బాలీవుడ్ కళా నైపుణ్యం గురించి చర్చిస్తూ ఇలా రాశారు. ‘మనకు మంచి సినిమాలు రావాలి. ఇతర దేశాల నుంచి వచ్చిన సినిమాలకు పోటీ పడే స్థాయిలో మనకూ గొప్ప సినిమాలు కావాలి. భారత దేశానికి సంబంధించిన ప్రతిదీ ప్రకాశించాలని మనం కోరుకుంటున్నాం. కానీ గత 25 సంవత్సరాలను అంటే 9,125 రోజులను పరి శీలిస్తే మనం ఏం ప్రదర్శించాం? మన దర్శకులను ఘనంగా చూపగలిగామా? ఇకపోతే, ఇతరుల రాత లకు కాస్త పూత పూసి బతుకు సాగించే మన రచయి తల మాటేమిటి? మన సినిమాలను ఇతరులకు చూపగలమా? (అవన్నీ అమెరికా సినిమాలకు నకళ్లే). అస్సలు చూపలేం’. నా అభిప్రాయంలో భారత్‌కు బాలీవుడ్ ప్రాముఖ్యత అనేది దాని కళాత్మక నాణ్యతకు సంబంధించినది కాదు. దీనిపై తర్వాత చర్చిస్తాను. ప్రభుత్వం ఇటీవల చిత్ర నిర్మా త పహలాజ్ నిహలానీని కొత్త సెన్సార్ బోర్డు చీఫ్ గా నియమించిందని వార్తలు చూసినప్పుడు ఈ అంశంపై నాకు ఆలోచన తట్టింది. గోవిందాతో అం ఖేన్, అక్షయ్ కుమార్‌తో తలాష్ వంటి సినిమాలు తీసిన రికార్డు ఉన్న నిహలానీని ఈ పదవికి ఎంపిక చేయడం రెండు విషయాలను తెలుపుతోంది. తాను బీజేపీకి చెందిన వాడిననీ, ప్రధానే తన యాక్షన్ హీరో అని నిహలానీ ప్రకటించాడు. చాలా బాగుంది. ఇది రాజకీయ నియామకమే. అయితే టెలివిజన్‌లో చాలా అధికంగా నగ్నత్వం ప్రదర్శిస్తున్నారని, దీన్ని తప్పకుండా నియంత్రిం చాలని నిహలానీ చెప్పారు. కాని నేను కొన్ని తప్పు చానళ్లను చూసినప్పటికీ టీవీలో ఎలాంటి నగ్న త్వాన్నీ నేను చూసి ఉండలేదు. నిహలానీ దృష్టిలో అశ్లీలం అంటే ఏమిటని నేను ఆలోచిస్తు న్నాను. అందుకే బాలీవుడ్ నాణ్యతపై పై వ్యాఖ్యలను దీంతో ముడిపెట్టాలని భావిస్తున్నాను. వాస్తవమేమిటంటే ఇరాన్ చిత్ర నిర్మాతలకు ప్రజానురంజక వినోదాన్ని అందించడానికి అను మతి లేదు కాబట్టే ఆ దేశం కొన్ని మంచి, కళాత్మక సినిమాలను నిర్మించగలిగింది. మంచి సినిమాలు రావాలంటే కొన్నింటిని నిషేధించ పనిలేదు కానీ అశ్లీల పునాదినుంచే జనరంజక వినోద చిత్రాలను నిర్మిస్తున్నారన్నది వాస్తవం. ఇతర నగరాలతో పోలిస్తే భారతదేశంలో అత్యంత ఉదారప్రాంతంగా పేరున్న ముంబైలోనే అశ్లీలాన్ని అధికస్థాయిలో సహిస్తున్నారు. అలాగే పొరుగు దేశాలతో పోలిస్తే భారత దేశంలోనే అశ్లీలాన్ని అధికంగా భరిస్తు న్నారు. అందుకే మొత్తం దక్షిణాసియా వినోద పరి శ్రమకే బాలీవుడ్ కేంద్రమై నిలుస్తోంది. లాహోర్, నేటి పాకిస్తాన్‌లోని ఇతర నగరాలకు చెందిన వ్యక్తు లు బాలీవుడ్‌పై ఆధిపత్యం చలాయించి చాలా కాలం కాలేదు. అయితే ప్రతిభ ఉన్నప్పటికీ, బాలీ వుడ్ స్థాయిని కలిగిన చిత్ర పరిశ్రమను లాహోర్ నిర్మించలేకపోయింది. లాహోర్‌లో ఈనాటికీ కళా త్మక ప్రతిభ చావలేదని నా దృఢనమ్మకం. జన రం జకమైన వినోదాన్ని రూపొందించడానికి లాహోర్‌కు అనుమతి లేదన్నదే అసలు విషయం. ఒక జాతిని జాగృతపర్చడానికి అనేక మార్గాలు న్నాయని, వాటిలో అన్నిటికంటే ముఖ్యమైనది సినిమా అనే విషయంలో ఏకాభిప్రాయం ఉందని సాదత్ మంటో తన వ్యాసంలో రాశారు. ఎంత సంక్లిష్టమైనదైనా సరే సినిమాల ద్వారా సం దేశాన్ని ప్రతిభావంతంగా కమ్యూనికేట్ చేయటం సుల భం.. మనస్సును జాగృతపర్చి, పదునుబెట్టి కొత్త భావాలను, కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టగల వినో దాత్మక సినిమాల అవసరం భారత్‌కు ఎంతైనా ఉం దని మంటో చెప్పారు. ఈ మాటల్ని మంటో 1938లో రాశారు. అప్ప టికి ఆయన వయసు 26 సంవత్సరాలు మాత్రమే. చిత్రపరిశ్రమలో తన కెరీర్ తొలినాళ్లలో ఆయన ఇలా రాశారు. అయితే తన రచనల్లో నిర్దిష్ట విష యాంశాలను ఆయన స్పృశించనప్పటికీ, అశ్లీలం పట్ల సమాజానికి ఉండవలసిన సహనభావంపై ఆయన ఆలోచనలు ఏమిటనేది మనం మంటో కథానికలలో చూడగలం. బాలీవుడ్ పనిచేసే తీరును మంటో అర్థం చేసుకున్నారు. దాని కళాత్మక నాణ్యత కంటే దాని విశాల దృష్టి, సహనభావమే బాలీవుడ్ అత్యుత్తమ లక్షణమని ఆయన గుర్తించారు. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) Aakar.patel@icloud.com - ఆకార్ పటేల్ -
న్యూజిలాండ్ రచయిత్రికి బుకర్ ప్రైజ్
లండన్: సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే మాన్ బుకర్ ప్రైజ్ ఈసారి న్యూజి లాండ్ యువరచయిత్రి ఎలియనార్ కాటన్‌ను వరించింది. 19వ శతాబ్దిలో సాగిన బంగారం అన్వేషణ ఇతివృత్తంతో ఆమె రాసిన మర్డర్ మిస్టరీ నవల ‘ద లూమినరీస్’(నిష్ణాతులు)కు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. 28 ఏళ్ల కాటన్ ఈ అవార్డు అందుకున్న అత్యంత పిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించారు. మంగళవారం లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు బహుమతి కింద 50 వేల పౌండ్లు అందజేశారు. భారతీయ అమెరికన్ రచయిత్రి ఝంపా లహరి నవల ‘ద లోల్యాండ్’ మాన్ బుకర్ కోసం పోటీ పడినా ఫలితం లేకపోయింది. అయితే, అమెరికా నేషనల్ బుక్ అవార్డు కోసం ఫైనలిస్టుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. -
బుకర్ ప్రైజ్ తుది జాబితాలో ఝంపా లహరి
లండన్: భారతీయ అమెరికన్ రచయిత్రి ఝంపా లహరి(46) ప్రతిష్టాత్మక ‘బుకర్ ప్రైజ్’ తుది జాబితాలో చోటు సాధించారు. గతంలో ఆమె పులిట్జర్ బహుమతి సాధించారు. కోల్‌కతా నేపథ్యంలో ఆమె రాసిన ‘ద లో లాండ్’ రచనకుగానూ మన్ బుకర్ ప్రైజ్-2013 తుది జాబితాలో ఎంపికైనట్లు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు.