Salman Rushdie Makes Surprise Appearance at PEN America Gala - Sakshi
Sakshi News home page

సల్మాన్ రష్డీ: కత్తి పోట్లతో చావు అంచుల దాకా వెళ్లొచ్చి.. ఇప్పుడు కలం ఈవెంట్‌లో..

May 20 2023 4:59 PM | Updated on May 20 2023 5:20 PM

Salman Rushdie Makes Surprise Appearance at PEN America Ga - Sakshi

భారత మూలాలున్న వివాదస్పద  రచయిత, బుకర్‌ బహుమతి విజేత సల్మాన్‌ రష్దీ చాన్నాళ్ల తర్వాత బహిరంగంగా కనిపించాడు. గత ఏడాది ఆగస్టులో అనూహ్యంగా ఓ వ్యక్తి చేతిలో దాడికి గురైన సల్మాన్ రష్డీ ఇప్పుడు ప్రాణాలతో బతికి ఉండడం నిజంగా వైద్య పరంగా గొప్ప విషయమే.

అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన PEN America పెన్ అమెరికా ఈవెంట్ కు రష్డీ హాజరయ్యారు. అందరికీ ధన్యవాదాలు, మీ అందరినీ మళ్లీ కలుసుకున్నందుకు సంతోషమన్నారు. ప్రపంచమనే ఈ పుస్తకంలో మానవ హక్కుల కోసం ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుందన్నారు రష్డీ. తనను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని, కత్తిపోట్లకు గురయిన తనను కాపాడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. 

► సల్మాన్‌ రష్టీపై దాడికి పాల్పడిన వ్యక్తిని.. న్యూజెర్సీకి చెందిన హదీ మటర్‌ అనే వ్యక్తిగా గుర్తించారు.

► 1988లో సల్మాన్‌ రష్టీ రాసిన ది సాటానిక్ వెర్సెస్ తీవ్ర దుమారం రేపింది. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న రాజీవ్‌ గాంధీ సైతం ఆ నవలను నిషేధించారు. 

► ముంబైలో పుట్టిన సల్మాన్‌ రష్టీ.. ప్రతిష్టాత్మక బుక్‌ ప్రైజ్‌ను గెల్చుకున్నారు. అదే సమయంలో.. ‘ది సాటానిక్ వెర్సెస్‌’నవల ద్వారా ఊహించని రేంజ్‌లో వివాదాన్ని, విమర్శలను మూటగట్టుకున్నారు. 

► సల్మాన్‌ రష్డీ.. 1947 ముంబైలో కశ్మీరీ ముస్లిం కుటుంబంలో జన్మించారు. రాడికల్‌ రాతలతో అజ్ఞాతంలోనే ఎక్కువగా గడిపారు ఈయన. ఆ టైంలో జోసెఫ్‌ ఆంటోన్‌ అనే కలం పేరుతో ఆయన రచనలు సాగాయి. 

► 1975 నుంచి 2019 దాకా మొత్తం 14 నవలలు రాశారు ఆయన. 

► మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌కు బుక్‌ ప్రైజ్‌ గెల్చుకోవడంతోపాటు ఇప్పటిదాకా ఐదుసార్లు బుకర్‌కు నామినేట్‌ అయ్యారు. 

► 2007లో సాహిత్యంలో సేవలకు బ్రిటిష్‌ ప్రభుత్వం నైట్‌హుడ్‌ గౌరవం ఇచ్చింది.

► 1988, సెప్టెంబర్‌లో ది సాటానిక్ వెర్సెస్ నవల పబ్లిష్‌ అయ్యింది. ఈ నవలలోని అంశం ఇస్లాం మతానికి వ్యతిరేకం. రష్డీ తనను తాను ముస్లిమేతరుడిగా, నాస్తికుడిగా అభివర్ణించుకున్నాడు. ఇస్లామిక్ ఛాందసవాదులు సల్మాన్ రష్దీ రాతల్ని చూసి రగిలిపోయారు. అది వివాదం కావడంతో.. ప్రాణభయంతో తొమ్మిదేళ్లపాటు ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు.

76 ఏళ్ల వయసున్న రష్డీ.. తన రెండో నవల మిడ్‌నైట్స్‌ చిల్డ్రన్‌(1981) ద్వారా బుకర్‌ ప్రైజ్‌ను సాధించి.. ఆ ఘనత అందుకున్న తొలి భారతీయ పౌరుడిగా ఘనత దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement