న్యూజిలాండ్ రచయిత్రికి బుకర్ ప్రైజ్
లండన్: సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే మాన్ బుకర్ ప్రైజ్ ఈసారి న్యూజి లాండ్ యువరచయిత్రి ఎలియనార్ కాటన్‌ను వరించింది. 19వ శతాబ్దిలో సాగిన బంగారం అన్వేషణ ఇతివృత్తంతో ఆమె రాసిన మర్డర్ మిస్టరీ నవల ‘ద లూమినరీస్’(నిష్ణాతులు)కు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. 28 ఏళ్ల కాటన్ ఈ అవార్డు అందుకున్న అత్యంత పిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించారు. మంగళవారం లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు బహుమతి కింద 50 వేల పౌండ్లు అందజేశారు. భారతీయ అమెరికన్ రచయిత్రి ఝంపా లహరి నవల ‘ద లోల్యాండ్’ మాన్ బుకర్ కోసం పోటీ పడినా ఫలితం లేకపోయింది. అయితే, అమెరికా నేషనల్ బుక్ అవార్డు కోసం ఫైనలిస్టుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.