పాక్‌లో మోడీ వ్యతిరేక తీర్మానం! | Anti-Narendra Modi resolution blocked in Pakistan's Punjab province Assembly | Sakshi
Sakshi News home page

పాక్‌లో మోడీ వ్యతిరేక తీర్మానం!

Published Thu, May 29 2014 1:53 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Anti-Narendra Modi resolution blocked in Pakistan's Punjab province Assembly

లాహోర్: భారత ప్రధాని నరేంద్రమోడీ వ్యతిరేక తీర్మానాన్ని పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు బుధవారం అక్కడి విపక్షం యత్నించింది. పాక్‌పై తీవ్రవాద ఆరోపణలు చేసిన మోడీకి వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్ష పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్, పీపీపీ, పీఎంఎల్‌క్యూ సభ్యులు యత్నించారు.
 
 ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు స్పీకర్ రాణా ఇక్బాల్ అంగీకరించకపోవడంతో భారత్, మోడీ, నవాజ్‌షరీఫ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారంతా వాకౌట్ చేశారు. స్పీకర్ పరోక్షంగా మోడీకి మద్దతిస్తున్నాడంటూ ప్రతిపక్ష నేత మొహమ్మద్ ఉర్ రషీద్ ఆరోపించారు. తీర్మాన ప్రతిని మీడియాకు వినిపించారు. భారత ప్రధాని పాక్‌కు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement