
సిరియాలో నరమేధం
కారుబాంబు దాడుల్లో 120 మంది మృతి
బీరుట్: సిరియాలోని హామ్స్ నగరంలో, డమాస్కస్ శివారులోని ఓ ప్రార్థన మందిరం వద్ద ఆదివారం జరిగిన రెండు కారు బాంబు దాడుల్లో 120 మంది మృత్యువాతపడ్డారు. హామ్స్‌లోని అల్-జహ్రనా జిల్లాలో జరిగిన దాడిలో 57 మంది చనిపోయారు. సయీదా జినాబ్‌లో జరిగిన దాడిలో 63 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో అత్యధికం సాధారణ పౌరులు ఉన్నారని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవ హక్కుల సంస్థ తెలిపింది.