అమెరికాలో కాల్పులు‌.. 8మంది మృతి | At least 8 dead after shooting in North Texas | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు‌.. 8మంది మృతి

Published Mon, Sep 11 2017 12:26 PM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

అమెరికాలో కాల్పులు‌.. 8మంది మృతి - Sakshi

అమెరికాలో కాల్పులు‌.. 8మంది మృతి

టెక్సాస్‌ : అమెరికాలో మరోసారి గన్‌ పేలింది. టెక్సాస్‌లో ఓ దుండగుడు ఓ ఇంట్లో కాల్పులతో రెచ్చిపోయాడు. ఫలితంగా అతడితో సహా ఎనిమిదిమంది మృత్యువాత పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం ఈ ఘటన ఆదివారం రాత్రి డల్లాస్‌కు 20 మైళ్ల దూరంలోని ప్లానో అనే ప్రాంతంలోని ఓ ఇంట్లో చోటు చేసుకుంది. ప్లానో పోలీసు అధికార ప్రతినిధి డేవిడ్‌ టీల్లీ వివరాలు తెలియజేస్తూ కాల్పులకు సంబంధించిన సమాచారం అందగానే ఓ పోలీసు అధికారి ఘటనా స్థలికి చేరుకున్నాడు.

అక్కడికి వెళ్లి చూడగానే కాల్పుల జరిపిన వ్యక్తి పోలీసులతో గొడవకు దిగి ఫైరింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. దీనికి ప్రతిగా పోలీసులు కాల్పులు జరపడంతో అతడు చనిపోయిడు. ఈ ఘటనలో చనిపోయినవారంతా కూడా యువకులేనని, మరో ముగ్గురు గాయపడ్డారని వారి పరిస్థితి ఇప్పుడే చెప్పలేమని వివరించారు. కాల్పులు జరిపిన వ్యక్తి, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement