north texas
-
మహాత్మా గాంధీ స్మారక స్థలి వద్ద యోగా దినోత్సవ వేడుకలు
అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద 10వ అంతర్జాతీయ యోగాదినోత్సవ వేడుకలు ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగాయి. గౌరవ కాన్సుల్ జెనరల్ అఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ భారత ప్రధాని నరేంద్రమోడి 10 సంవత్సరాల క్రితం ఐక్యరాజ్య సమితిలో ఇచ్చిన పిలుపుననుసరించి నేడు విశ్వవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21 వ తేదీని అంతర్జాతీయ యోగాదినోత్సవంగా పాటించడం ముదావహం అన్నారు. అనునిత్యం యోగాభ్యాసం చెయ్యడంవల్ల అనేక ప్రయోజనాలున్నాయన్నారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర గౌరవ కాన్సుల్ జెనరల్ అఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ కు స్వాగతం పలుకుతూ గత పది సంవత్సరాలగా ఈ మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అంతర్జాతీయ యోగాదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని, ప్రతి సంవత్సరం హజరవుతున్నవారి సంఖ్య పెరుగుతున్నదని, ఇది కేవలం ఒకరోజు వేడుక కాకూడదని, అన్ని కార్పోరేట్ మరియు విద్యాసంస్థలలో ప్రతిరోజు యోగాభ్యాసం చేసే విధాననిర్ణయాలు తీసుకుని, దానికి తగిన ఏర్పాట్లుకల్పిస్తే అందరూ శారీరక, మానసిక ఆరోగ్యాలలో సత్ఫలితాలు సాధించవచ్చునని అన్నారు.డా. ప్రసాద్ తోటకూర మహత్మాగాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులందరితో కలసి గౌరవ కాన్సుల్ జెనరల్ అఫ్ ఇండియా, డి. సి. మంజునాథ్ కు మహాత్మాగాంధీ చిత్రపటాన్ని బహుకరించి, ఘనంగా సన్మానించారు. ముందుగా మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వాల సభను ప్రారంభించి ముఖ్యఅతిథికి, బోర్డుసభ్యులకు, పాల్గొన్న వారందరికీ స్వాగతం పలికారు.ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షురాలు, మరియు మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డు సభ్యురాలు అయిన సుష్మ మల్హోత్రా క్రమక్రమంగా యోగావేడుకలలో పాల్గొంటున్న వారి సంఖ్య పెరుగుతోందని, ఈ సంవత్సరం డి.ఎఫ్.డబ్ల్యు హిందూ టెంపుల్, యోగభారతి, హార్ట్ఫుల్నెస్, ఈషా, ది యూత్ ఎక్ష్సలెన్స్ లాంటి సంస్థలు వారి సభ్యులతో పాల్గొనడం చాలా సంతోషం అన్నారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు రావు కల్వాల, జాన్ హామండ్, రన్నా జానీ, మురళి వెన్నం, సుష్మా మల్హోత్రా, కమల్ కౌశల్, రాజీవ్ కామత్, బి. యెన్. రావు మరియు ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ కార్యవర్గ సభ్యులు ృ మహేందర్ రావు, దినేష్ హూడా, ఉర్మీత్ జునేజా, దీపక్ కాల్ రా, ఆమన్ సింగ్, అమిత్ బూచె, సమర్నిక రౌత్ మొదలైన వారు తగు ఏర్పాట్లుచేసి యోగావేడుకలు విజయవంతంగావడంలో కీలకపాత్ర వహించారు. విశాలమైదానంలో రెండుగంటలకు పైగా సాగిన ఈ యోగావేడుకలలో అన్ని వయస్సులవారు ఉత్సాహంగా పాల్గొని, యోగాభ్యాసం అనంతరం ‘పీకాక్ ఇండియా రెస్టారెంట్’ వారు ఏర్పాటు చేసిన ఫలాహారాలను ఆస్వాదించి ఆనందించారు. -
మహాత్ముడికి టాంటెక్స్ నివాళులు
టెక్సాస్: జనవరి 30న జాతిపిత గాంధీజీ వర్ధంతి. సత్యం, అహింస మార్గాలే తన ఆయుధాలని చెప్పిన మహోన్నతుడాయన. 20వ శతాబ్దంలో భారత దేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్య పాలన నుంచి విముక్తి చేసేందుకు ముందుండి పోరాడారు. చేతిలో కర్ర పట్టుకుని, నూలు వడికి, మురికి వాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు, కులాలు ఒక్కటే అని చాటి చెప్పారు, సత్యం, అహింస అనేవి తన ఆయుధాలని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. బ్రిటిష్ పాలకుల చేతుల్లోంచి భారతమాతకు విముక్తి కలిగించిన మహోన్నతుడు గాంధీ. గాంధీ వర్ధంతి సందర్భంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సభ్యులందరి తరపున టాంటెక్స్ అద్యక్షురాలు లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి, సహాయ కార్యదర్శిగా శ్రీకాంత్ రెడ్డి జొన్నల స్థానికంగా జాఫర్ సన్ పార్క్, అర్వింగ్‌లోని మహాత్ముడి విగ్రహానికి పుష్పగుచ్చం సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల సేవలను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. (చదవండి: సాగువీరుడా ! సాహిత్యాభివందనం) -
టాంటెక్స్ ఆధ్వర్యంలో వినూత్నంగా సంక్రాంతి సంబరాలు
కొవిడ్-19 కారణంగా ఈ ఏడాది ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వినూత్నంగా యూట్యూబ్‌లో వర్చువల్‌గా నిర్వహించారు. సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి, కార్యక్రమ సమన్వయ కర్త సరిత ఈదర అధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సంస్థ 2020 సంవత్సరం అధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు ప్రసంగిస్తూ.. ఎన్నో స్వచంద సేవా కార్యక్రామాలు జూమ్ ద్వారా సాంకేతిక శిక్షణలు ఈ కరోనా సమయములో చేయటము జరిగినట్లు తెలిపారు. కరోనా విరాళాలను మూడు భాగములుగా విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి, అలాగే డల్లాస్ టెక్సాస్ రాష్ట్రానికి ఇచ్చినట్లు తెలియ జేశారు. అంతేకాక 2021 పాలక మండలికి తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. అనంతరం కృష్ణా రెడ్డి కోడూరు సంస్థ నూతన అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటిని పరిచయం చేశారు. 2021 అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి ప్రసంగిస్తూ.. తమకు సహాయ సహకారాలు అందించిన కార్యవర్గ సభ్యులందరికి కృతఙ్ఞతలు తెలియజేశారు. డల్లాస్‌లోని తెలుగు వారి కోసం ప్రస్తుతం చేస్తున్న సేవ కార్యక్రమాలే కాకుండా, మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలియ చేశారు. టాంటెక్స్ నూతన కార్యవర్గ సభ్యులను ఒక పాట రూపంగా అందరికీ పరిచయం చేశారు. ఉమా మహేష్ పార్నపల్లి ఉత్తరాధ్యక్షుడుగా, శరత్ రెడ్డి ఎర్రం ఉపాధ్యక్షులుగా, కళ్యాణి తాడిమేటి కార్యదర్శిగా, శ్రీకాంత్ రెడ్డి జొన్నల సహాయ కార్యదర్శిగా, చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి కోశాధికారిగా, స్రవంతి ఎర్రమనేని సహాయ కోశాధికారిగా పరిచయం చేశారు. పాలక మండలి అధిపతి డాక్టర్ పవన్ పామదుర్తి, 2020 పాలక మండలి అధిపతి పవన్ నెల్లుట్ల ప్రసంగిస్తూ.. అందరికీ 2021 నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటితన ప్రసంగములో ఈ సంక్రాంతికి మీకు నచ్చిన మీరు మెచ్చిన కార్యక్రామాలను మీ ముందుకు తీసుకు వచ్చారు. జానపద కళలకు పెట్టింది పేరు మన రెండు తెలుగు రాష్ట్రాలు. కాలక్రమేణా అలాంటి కళలు సరైన పోషకులు లేక అంతరించి పోతున్నాయి, అందువలన కళలను నమ్ముకొని జీవిస్తున్న కళాకారులను మనము గుర్తుపెట్టుకోవలసిన సమయము ఆసన్నమయింది. ఒకప్పుడు గ్రామీణులకు వినోదం, వికాసం అందించడంలో ప్రసిద్ధిగాంచిన బుర్ర కధలు, హరిదాసులు, గంగిరెద్దు మేళములు, జానపద పేరడీలు మొదలయిన కళలు మరుగున పడి పోకుండా కాపాడుకొంటూ వస్తున్న కళాకారులను ఇకపై మీ ముందుకు తీసుకు రావడం జరుగుతుంది. కళలను పోషిస్తూ కూడా దుర్భరమైన జీవనము గడుపుతున్న అలాంటి కళాకారుల కుటుంబాలను గుర్తించి మన టాంటెక్స్ సంస్థ ద్వారా వెలుగులోనికి తెచ్చి తగినంత సహాయము చేసి భావితరాలకు మన జానపద కళలను సజీవంగా అందించాలనే దే మా ప్రయత్నం. ఈ కార్యక్రమ ప్రదర్శనలకు విరాళాలిచ్చి ఆర్ధిక సహాయ సహకారాలందిస్తున్న పోషక దాతలకు మన సంస్థ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేజశారు. అనంతరం తెలుగు వెలుగు సంపాదకులు శ్రీమతి స్రవంతి సంక్రాంతి సంచికను వర్చువల్‌గా అవిష్కరించారు. తాను 2020లో సాంస్కృతిక కార్యక్రమాలని కోవిడ్ మూలంగా చేయలేక పోయామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సమీరా ఇల్లెందుల తమ వ్యాఖ్యానంలో సంక్రాంతి పండగ విశేషాలైన భోగిమంటలు, గొబ్బమ్మలు, గంగిరెద్దులు , హరిదాసులు, గాలిపటాలు వివరించారు. హరిదాసు (ప్రశాంత్ కుమార్) శ్రీ మద్రమా రమణ గోవిందో హరి అంటూ సాంస్కృతిక కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. గంగిరెద్దు మేళం, డాక్టర్ అరుణ సుబ్బా రావు బృందముతో తోలుబొమ్మలాట, పేరడీ జానపద గేయాలు, శ్రీమతి హేమాంబుజ కట్టారి వీణామృతం, నాని బృందం కోలాటం, సినీ గాయని శ్రీమతి ఉషా గానములు, లాస్య సుదా అకాడమీ నుంచి కీర్తన, నర్తన కలవగుంట సోదరీమణుల నృత్య ప్రదర్సనలు,గలీనా అకాడమీ నుంచి శ్రీమతి స్వప్న గుడిమెళ్ళ శిష్యుల శాస్త్రీయ జానపద నృత్యం అందరిని ఆకట్టుకున్నాయి. కొత్తగా భాధ్యతలు శ్వీకరించిన సాంస్కృతిక కార్యదర్శి సురేష్ పఠానేని ఎంతో నేర్పుగా సమయ స్పుర్తితో సాంస్కృతిక కార్యక్రమాలను ముందుకు నడిపించారు. కార్యక్రమ సమన్వయ కర్త సరిత ఈదరగారు, పోషక దాతల గురంచి పేరు పేరునా అభివందనములు తెలియజేశారు. అలాగే ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా 2021 నూతన సంవత్సరంలో జరిగిన 162వ సాహితీ సదస్సు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చిరంజీవునులు సాహితి వేముల, సిందూర వేముల “నమో నమో మారుతి” అన్న కీర్తనతో సభ ప్రారంభమైంది .ఈ మాసపు సాహిత్య సభకు బలుసు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా “రామాయణ కల్ప వృక్షము - వైశిష్ట్యము ” అన్న అంశంపై మాట్లాడుతూ.. విశ్వనాథ కవితా గుణాలను అద్భుతమైన రీతిలో ఆవిష్కరించారు. ఇక మధురకవిగా పాఠకుల హృదయాలలో ముద్ర వేసిన బులుసు సమకాలీన పద్యకవులలో విశిష్ఠమైన స్థానం కలిగి ఉన్నవారు. ప్రతి పద్యంలోని ప్రతీ పాదంలోనూ విశ్వనాథ ఎంతటి చమత్కారాన్ని, ఎంతటి భావుకతను చూపారో బులుసు సోదాహరణంగా విశ్లేషించి నిరూపించారు. విశ్వనాథ పద్య పాదాలు పోటాపోటీగా ఒలికించిన రసమాధుర్యాన్ని వడపోసి పట్టి సభికులకందించారు. తెలుగు ప్రజల ఆచార సాంప్రదాయాలను కలగలిపి విశ్వనాథ తెలుగు రామాయణంగా ఎలా తీర్చిదిద్దారో వివరించారు. రామాయణ కల్పవృక్షమెంత మహోన్నతమైన కావ్యమో తెలియాలంటే బలుసు తాదాత్మ్యం చెందిన పరిపూర్ణ కవితా హృదయ స్పందనను వినాల్సిందే అన్నంత ప్రతిభావంతంగా వారి ఉపన్యాసం సాగింది. ప్రధాన వక్త ప్రసంగానికి ముందు ప్రతీ మాసం ఎంతో ఆదరణ పొందుతున్న“మనతెలుగు సిరి సంపదలు” ధారావాహికలో భాగంగా ఉరుమిండి నరసింహా రెడ్డి ఆధునిక కవుల ఉక్తులు సూక్తులు అన్న శీర్షిక కింద మహాకవుల ప్రసిద్ద కవితాపంక్తులను, ప్రశ్నలు జవాబుల రూపంలో సంధిస్తూ సదస్యులను చర్చలో భాగస్వాములును చేశారు. ఉపద్రష్ట సత్యం “పద్య సౌగంధం” శీర్షికన కృష్ణ రాయల వారి ఆముక్తమాల్యదలోని ఒక పద్యాన్ని వివరిస్తూ రాయల వారు నాటి జనజీవనాన్ని తన కావ్యంలో ఎలా ప్రతిబింబింపచేశారో వివరించారు. సమకాలీన ప్రజా జీవితాన్ని తమ కావ్యాలలో పొందుపరచిన కొద్ది మంది ప్రాచీన కవులలో ఒక రాజ్యాన్ని ఏలిన మహారాజు ఉండడం విశేషంగా సభికులు గుర్తించే విధంగా ఉపద్రష్ట ప్రసంగించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం “మాసానికో మహనీయుడు” అనే శీర్షక కొనసాగింపుగా జనవరి మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులైన ఎందరో మహానుభావులను ప్రజెంటేషన్ ద్వారా సభకు గుర్తు చేసి స్మరణకు తెచ్చారు. లెనిన్ బాబు వేముల మరో అంశం పై చర్చిస్తూ హిందూ సౌర్య కాలమానంలోని మకర రాశి (మకర సంక్రాంతి ఈ రాశిలోనే వస్తుంది!), దానికి సరి పోలిన గ్రీకు రాశి కాప్రికార్న్కి ఉన్న పోలికను తేడాలను ఖగోళశాస్త్ర దృష్టి కోణం నుంచి చెప్పారు. బల్లూరి ఉమాదేవి.. సంక్రాంతిపై స్వీయ రచనలను కవితాగానం చేసి రంజింపజేశారు. ఈ కార్యక్రమానికి 2021వ సంవత్సర అధ్యక్షులు లక్ష్మి పాలేటి ,నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు సమన్వయకర్త నీరజా కుప్పాచి తదితర కార్వవర్గ సభ్యులు, పాలక మండలి సభ్యులు ,స్థానిక సాహిత్య ప్రియులు హాజరయ్యారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం 2020 అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ముఖ్య అతిథి బులుసు వేంకటేశ్వర్లుకు, ప్రార్థనా గీతం పాడిన సాహితి, సింధూరలతోపాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు -
‘యూజీపీఏటీ’ సంస్థ అంతర్జాల ఆవిర్భావ కార్యక్రమం
బహుళజాతి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉత్తర అమెరికా యూజీపీఏటీ సంస్థ నడుం బిగించింది. ఉత్తర అమెరికాలోని “యునైటెడ్ గ్లోబల్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఆఫ్ తెలుగూస్” సంస్థ అంతర్జాల ఆవిర్భావ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే. నారాయణస్వామి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే జూపూడి ప్రభాకర్ రావు, కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు, తదితరులు ముఖ్య అతిధులుగా విచ్చేసి అశీర్వచనాలతో ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు చేయూతనివ్వడానికి, తెలుగు జాతి కీర్తిని ఖండాంతరాలలో విస్తరింపజేయడానికి పూనుకున్న యూజీపీఏటీ నిర్వాహకుల ఆలోచనను సమిష్టిగా అభినందించారు. బలహీన వర్గాల కలల సహకారానికి దోహదపడే ఉద్దేశంతో ఈ సంస్థ ఆలోచనలను, ఆశయాలను రూపొందించడం గర్వకారణమని, భవిష్యత్తులో సామాజిక బలహీన వర్గానికి చెందిన ప్రతి పేదవారి ఆశను సంపూర్ణం చేయడానికి ఈ సంస్థ ముందుకు రావడం ప్రపంచ తెలుగు వారికి గర్వకారణమని అన్నారు. ప్రభుత్వాల ఆశయాలకు ఈ సంస్థ తమ తోడ్పాటును అందించి పేద బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మార్గాదర్శకాలను, సూచనలను రూపొందించేందుకు తమ సహకారాన్ని అందించాలానే సంకల్పం, తెలుగు జాతి భవిష్యత్తుకు ఒక పెద్ద పీట వేయడం అన్నారు. అణగారిన జాతి అభ్యున్నతి కోసం పాటుబడిన అంబేద్కర్, పెరియార్, ఫూలే వంటి ఎందరో మహానుభావులను ఈ సందర్భంగా వక్తలు గుర్తుచేశారు. విద్య, ఉద్యోగం, వ్యవస్థాపక అభివృద్ధి తమ ప్రామాణికాలు, కుల మతాలకు అతీతంగా, రాబోయే తరాలకు వారధిగా, చుక్కానిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ఖండాంతరాలు దాటి విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయ తెలుగు వారు సమిష్టిగా కలసి భారదేశంలోని తమ తెలుగు జాతి అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం, తమ మేధస్సును వినియోగించ ఉద్దేశించిన కార్య-రూప ఆవిర్భావమే ఈ “యునైటెడ్ గ్లోబల్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఆఫ్ తెలుగూస్” యూజీపీఏటీ సంస్థ అని నిర్వాహకులు కాకుమాని ప్రసన్న, శరత్ గద్దె, మెర్సీ ఏంజిలీన్ , కల్పనా దొప్పలపూడిలు అన్నారు. ప్రజా ప్రయోజన, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించి ప్రజల అభినందలను అందుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజున ఈ సంస్థను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంస్థ అన్నివేళల బలహీన వర్గాల తెలుగు జాతి కోసం పాటుపడుతుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఉత్తర అమెరిక తెలుగు ప్రజల వారధి రత్నాకర్ పండుగాయల కృషి మరువలేనిదని, వారి సహాయ సహకారాలతో ప్రభుత్వ పతినిధులను ఈ సంస్థ కార్యక్రమానికి ఆహ్వానించి జయప్రదం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తమ సంస్థ భవిష్యత్ కార్యాచరణ వివరాలను సభ్యులందరితో చర్చించి సంస్థ వెబ్ సైట్లో పొందుపరుస్తామని, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన అందరికి సంస్థ కన్వీనర్ కాకుమాని ప్రసన్న, శరత్ గద్దె అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వాలకు, బడుగు జాతి వర్గానికి వారధిగా నిలుస్తూ, సంక్షేమ పధకాల రూపకల్పనలో జాతి అభివృద్ధికి తగు సూచనలు, సలహాలు ఇస్తూ తమవంతు సహాయసహకారాలు అందించడం మంచి పరిణామం అని కొనియాడారు. ఇందుకు మత విభేదాలకు తావు ఇవ్వకుండా బడుగు బలహీన వర్గాల ఆశలను, ఆశయాలను సంపూర్ణం చేయడానికి తమవంతు కృషిని అందిస్తామని పలువురు వక్తలు అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తమ సంస్థ ఆవిర్భావ కార్యక్రమాన్ని, కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాన్ని జూమ్ వీడియో ప్రసారం ద్వారా వీక్షించడానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథులు సంస్థ వెబ్ సైట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ వీక్షించి, సంస్థ అభివృద్ధికి తమ సలహాలు సూచనలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. సంస్థ గవర్నింగ్ కమిటీ సభ్యులు చార్లెస్ తోడేటి, బాబా సొంట్యాన, యువజన కన్వీనర్ తేజ యాదవ్, రీజినల్ కోఆర్డినేటర్స్ గాబ్రియేల్ కందుకూరి, ప్రవీణ్ మన్నం, సలీమ్ షేక్, కామేశ్వర రావు, వెంకట్ మట్ట, నరేంద్ర కడియం, సాంకేతిక నిపుణులు, ఇతర కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఘనంగా ‘నెలనెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 161వ'నెల నెలా తెలుగు వెన్నెల' సాహిత్య సదస్సు డాలస్‌లో ఘనంగా జరిగింది. నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహిక ఈ ఏడాది చివరి అంశంగా డిసెంబర్ మాసం సాహిత్యాభిమానులందరి మధ్య ఘనంగా జరిగింది.సభాసదుల ఉత్సాహం మార్గశిర మాసపు శీతలాన్ని తొలగించి వెడచ్చదనాన్ని నింపింది. చిరంజీవులు సాహితి వేముల, సిందూర వేముల “వినాయకా నిను వినా బ్రోచుటకు” అన్న రామకృష్ణ భాగవతార్ స్వామి వారి కీర్తన పాడి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మాసపు సాహిత్య సభకు ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వ విద్యాలయ పూర్వ అధ్యాపకురాలు డాక్టర్ కృష్ణకుమారి విచ్చేశారు. ఈ సందర్భంగా..ఆయన ‘భారతదేశంలో స్త్రీ వాగ్గేయకారులు’’ అన్న అంశంపై విశేషమైన ప్రసంగం చేశారు. వాగ్గేయకారుల భక్తి సంగీత సాంప్రదాయాల పైనే తొలుత వీరి సిద్దాంత గ్రంథం ఉండగా ప్రత్యేక శ్రద్ధతో స్త్రీ వాగ్గేయకారులను వెలికితీసే పరిశోధన మొదలుపెట్టారు. ఈ క్రమంలో భాగంగా ఇతర ద్రవిడ భాషలతో పరిచయం పెంచుకొని తెలుగే కాకుండా తమిళ, కన్నడ భాషలలోని ప్రతిభా మూర్తులైన సాహిత్యకారిణుల చరిత్రావలోకనం చేశారు. ఒక్క కీర్తన రూపంలోనే కాకుండా.. లయ తాళ జ్ఞానం, భావ స్పష్టత విచక్షణాగుణం (కాకువు) ప్రదర్శంచిన రచయిత్రులు కూడా వాగ్గేయకారిణులే అన్న విశేష సందేశాన్ని తెలియజేశారు. వేదకాలంలోని సూర్య, గోష, వాక్ మొదలైన ఋషికలను మొదట పరిచయం చేసి తమిళ సంగమ సాహిత్యంలో ఎన్నదగ్గ విదుషీమణులైన కరైక్కాల్, ఆండాళ్ వారి తిరుప్పావై సూక్తులను స్వయంగా కూడా సంగీతజ్ఞులైన కృష్ణ కుమారి సభలో రాగయుక్తంగా పాట రూపంలో వినిపించారు. కన్నడ నాటి హన్నమ్మ, రఘనాథనాయకుని సభలలో ప్రభవిల్లిన తెలుగు ప్రతిభా మూర్తులు రామభధ్రాంబ, పసుపులేటి రంగాజమ్మలను సైతం గుర్తు చేశారు. శాంతి స్వభావం, సమతుల్యత గుణాలు ప్రకృతి వరప్రసాదంగా పొందిన స్త్రీలు తమ రచనలలో లాలిత్యము, మాతృ ప్రేమ, భక్తి తత్వ సుగంధ పరిమళాలను ఎంత సహజ సుకుమారంగా పొందు పరుస్తారో కృష్ణ కుమారి చెప్పి స్త్రీ జాతికి గర్వాతిశయాన్ని ఆపాదించి మెప్పించారు. ప్రధాన వక్త ప్రసంగానికి ముందు ప్రతీ మాసం ఎంతో ఆదరణ పొందుతున్న“మన తెలుగు సిరి సంపదలు” ధారావాహిక లో భాగంగా ఉరుమిండి నరసింహా రెడ్డి గారు ఆధునిక కవుల ఉక్తులు సూక్తులు అన్న శీర్షిక క్రింద బసవరాజు, విశ్వనాథ, సోమసుందర్, దాశరథి వంటి వారి ప్రసిద్ద కవితాపంక్తులను, ప్రశ్నలు జవాబుల రూపంలో సంధిస్తూ సదస్యులను చర్చలో భాగస్వాములును చేయడం జరిగింది. అదే అంశంలో భాగంగా పొడుపు కథలు, అర్థభేదం గల జంట పదాలు, వ్యుత్పత్వర్థాలు అనే పలు శీర్షికల పరంపరను ఉరుమిండి వారు ప్రశ్న జవాబుల రూపంలో కొనసాగించారు. ఉపద్రష్ట సత్యం “పద్య సౌగంధం” శీర్షికన పారజాతాపహరణ కృతికర్త ముక్కు తిమ్మనార్యుని ముద్దు పలుకులను సభలో ఉటంకించి పండించారు. జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం “మాసానికో మహనీయుడు” అనే శీర్షక కొనసాగింపుగా, డిసెంబరు మాసంలో జన్మించిన తెలుగు సాహితీ మూర్తులు నార్ల, ఉన్నవ, కట్టమంచి, బలిజేపల్లి వంటి ఎందరో మహానుభావులను ప్రజెంటేషన్ ద్వారా సభకు గుర్తు చేసి స్మరణకు తెచ్చారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరుముఖ్య అతిధి ఉస్మానియా విశ్వ విద్యాలయ పూర్వ అధ్యాపకురాలు డాక్టర్ కృష్ణకుమారికి, ప్రార్థనా గీతం పాడిన సాహితి,సింధూరలకు, మిగిలిన వక్తలకు,విచ్చేసిన సాహిత్య అభిమానులకి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
గాంధీ మునిమనవడు మృతికి నివాళులు
టెక్సాస్: కరోనా కారణంగా చనిపోయిన మహాత్మా గాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా మృతి పట్ల మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎమ్జీఎమ్ఎన్టీ) వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మా గాంధీ రెండో కుమారుడు మణిలాల్, సుశీలాబెన్ల కుమార్తె సీతా, శశికాంత్‌ల తనయుడు సతీష్ ధుపేలియా దక్షిణాఫ్రికాలో మృతి చెందారని తెలిపారు. గత నెల రోజులగా న్యూమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ క్రమంలోనే ఆస్పత్రిలో కరోనాసోకి నవంబర్ 22న మృతి చెందడం విచారకరమన్నారు. మూడు రోజులక్రితమే సతీష్ ఆస్పత్రిలో తన 66 వ జన్మదినాన్ని జరుపుకున్నారన్నారు. 2014 లో అక్టోబర్ 2 వ తేదిన అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్‌ను డల్లాస్‌లో సతీష్ చేతులమీదుగా ఆవిష్కరణ జరుపుకోవడం ఒక మధురానుభూతని పేర్కొన్నారు. విజయవాడకు చెందిన శిల్పి బుర్రా శివ వరప్రసాద్ తయారుచేసిన ఆ మహాత్మాగాంధీ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతోందని సతీష్ ప్రశంసించారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఉన్న నాలుగు రోజులు డల్లాస్‌లో అనేక కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. (చదవండి: సియాటిల్‌లో ప్రవాస భారతీయుల వర్చువల్ భేటీ) గాంధీ మునిమనవడు సతీష్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఎమ్జీఎమ్ఎన్టీ వ్యవస్థాపక ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూరతో పాటు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ రావు కల్వల, మురళి వెన్నం, జాన్ హేమండ్, రన్నా జాని, అభిజిత్ రాయల్కర్, స్వాతి షా, శైలేష్ షా, లోక్ నాథ్ పాత్రో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దక్షిణాఫ్రికాలో స్థిరపడిన సతీష్ వృత్తి పరంగా మీడియా ఫోటోగ్రాఫర్‌గా, వీడియో గ్రాఫర్‌గా పని చేశారు. ప్రవృత్తి పరంగా మహాత్మాగాంధీ 1904లో స్థాపించిన ఫేనెక్ష్ సెటిల్మెంట్లో, డర్బాన్ దగ్గరలో ఉన్న సంస్థలోను, గాంధీ డెవలప్మెంట్ ట్రస్ట్‌లోనూ అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవారు. సతీష్‌కు ఉమ, కీర్తి అనే ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. (చదవండి:అమెరికా చదువులకు మన ఖర్చెంతో తెలుసా?) -
ఆన్లైన్లో టెక్సస్ సాహిత్య సదస్సు
అమెరికాలోని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక సమర్పించే నెల నెలా తెలుగు వెన్నెల 153వ సదస్సు ఏప్రిల్ మూడో ఆదివారం ఆన్లైన్లో జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 153 నెలల పాటు సాహిత్య సదస్సు జరగడం విశేషం. చిన్నారులు సాహితీ, సిందూర వేముల ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. తర్వాత సదస్సు సమన్వయకర్త మల్లిక్ కొండా ప్రసంగీకులని పరిచయం చేశారు. అనంతరం సత్యం ఉపద్రష్ట– పెద్దన, తెనాలి రామలింగ కవులు ఆశువుగా చెప్పిన పద్యాలలో ప్రయోగించబడిన అలంకారిక, ఔచిత్య లక్షణాలను వివరించారు. ఊర్మిండి నరసింహారెడ్డి తెలుగు సిరి సంపదల పేరుతో తెలుగు జాతీయాలని సభికులతో పంచుకున్నారు. భాషా శాస్తవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి తెలుగుకూ, మధ్య ద్రావిడ భాషా కుటుంబాలకూ చేసిన సేవను లెనిన్‌బాబు వేముల కొనియాడారు. మహాభారత ఇతిహాసాన్ని విరచించిన వ్యాస మహామునిపై స్వీయ కవితల గానం చేశారు బల్లూరి ఉమాదేవి. మానవాళిని పీడిస్తున్న కరోనాపై అయినంపూడి శ్రీలక్ష్మి కవిత ‘కరోనాకి ఓ రిటర్న్ గిఫ్టు’ చదివి వివరించారు అనంత్ మల్లవరపు. చివరిగా సదస్సు ముఖ్య అతిథి స్వరకర్త, గాయకులు పాలగుమ్మి రాజగోపాల్ ‘తెలుగు కావ్యానికి స్వరాభిషేకం’ శీర్షిక కింద తమ పద్య గానంతో సభను రంజింపజేశారు. భావానికి సరిపడే రాగాలను, స్వర రచనా ప్రణాళికను ఎలా ఎంచుకొన్నదీ సోదాహరణంగా వివరించారు. సంగీత దర్శకులు సాలూరు రాజేస్వరరావుతో తనకున్న సాన్నిహిత్యం గురించి కూడా పంచుకున్నారు. రాజగోపాల్‌కూ, సదస్సుకు హాజరైన ఇతర సాహిత్య ప్రియులకూ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు. -
డాలస్‌లో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు
మహాత్మా గాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యం లో అక్టోబర్ 6న ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఇర్వింగ్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా (1201 హిడెన్ రిడ్జ్ డ్రైవ్, ఇర్వింగ్, టెక్సాస్) వద్ద మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఈ వేడుకలకు టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ ముఖ్య అతిధి గా విచ్చేసి మహాత్మాగాంధీకి నివాళులర్పించి ప్రసంగిస్తారని, ఇర్వింగ్ పట్టణ మేయర్ రిక్ స్టాప్ఫేర్, టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి జూలీ జాన్సన్, డిప్యూటీ కాన్సల్ జనరల్ అఫ్ ఇండియా సురేంద్ర అదానా ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారని ప్రకటించారు. ఈ వేడుకలలో భాగంగా శాంతికి సంకేతం గా 15 పావురాలను గాల్లోకి వదులుతామని.. ఇండియా అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ అధ్వర్యంలో "గాంధీ శాంతి యాత్ర" జరుగుతుందని అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. ప్రవేశం ఉచితమని, బ్రేక్ ఫాస్ట్ , టి షర్ట్స్, అందజేసాస్తామన్నారు. గాంధీ మెమోరియల్‌కు సమీపంలో ఉన్ననార్త్ లేఖ్ కాలేజ్ నుంచి గాంధీ మెమోరియల్‌కు ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్లు, తమ కార్లను అక్కడ పార్క్ చేసి ఉదయం 7:30 నుంచి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలియజేశారు. గాంధీ మెమోరియల్ బోర్డు సభ్యులు డా. ప్రసాద్ తోటకూర, బి. ఎన్. రావు, జాన్ హామేండ్, రావు కల్వాల, టయాబ్ కుండావాల, పియూష్ పటేల్, అక్రం సయెద్, కమల్ కౌశిల్ , అభిజిత్ రాయల్కర్, మురళి వెన్నం, రన్నా జాని, ఆనంద్ దాసరి, డా. సత్ గుప్తా, శ్రీకాంత్ పోలవరపు, శ్రీధర్ తుమ్మల, షబ్నం మోడ్గిల్, గుత్తా వెంకట్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
అమెరికాలో కాల్పులు.. 8మంది మృతి
టెక్సాస్ : అమెరికాలో మరోసారి గన్ పేలింది. టెక్సాస్‌లో ఓ దుండగుడు ఓ ఇంట్లో కాల్పులతో రెచ్చిపోయాడు. ఫలితంగా అతడితో సహా ఎనిమిదిమంది మృత్యువాత పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం ఈ ఘటన ఆదివారం రాత్రి డల్లాస్‌కు 20 మైళ్ల దూరంలోని ప్లానో అనే ప్రాంతంలోని ఓ ఇంట్లో చోటు చేసుకుంది. ప్లానో పోలీసు అధికార ప్రతినిధి డేవిడ్ టీల్లీ వివరాలు తెలియజేస్తూ కాల్పులకు సంబంధించిన సమాచారం అందగానే ఓ పోలీసు అధికారి ఘటనా స్థలికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్లి చూడగానే కాల్పుల జరిపిన వ్యక్తి పోలీసులతో గొడవకు దిగి ఫైరింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీనికి ప్రతిగా పోలీసులు కాల్పులు జరపడంతో అతడు చనిపోయిడు. ఈ ఘటనలో చనిపోయినవారంతా కూడా యువకులేనని, మరో ముగ్గురు గాయపడ్డారని వారి పరిస్థితి ఇప్పుడే చెప్పలేమని వివరించారు. కాల్పులు జరిపిన వ్యక్తి, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
నార్త్ టెక్సాస్‌లో మహాత్మగాంధీ మెమోరియల్ ప్లాజా
డల్లాస్, టెక్సాస్: అమెరికాలోని నార్త్ టెక్సాస్‌లో కొత్తగా ఏర్పాటైన మహాత్మ గాంధీ మెమోరియల్ ప్లాజాను అక్టోబర్ రెండో తేదీన గురువారం నాడు ప్రారంభించారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్‌సీ), ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఐఏఎన్టీ) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ మెమోరియల్ ప్లాజా ఏర్పాటు కార్యక్రమం జరిగింది. మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మహాత్మగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్, తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తెలిపారు.ఈ కార్యక్రమానికి మహాత్మ గాంధీ మనవడు సతీష్ ధుపేలియా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏడు అడుగుల 30 అంగుళాలు ఉండే ఈ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుర్రా వర ప్రసాద్ తయారు చేశారు. వెండి పూతతో తయారు చేసిన ఈ విగ్రహం అమెరికాలో ఉన్న గాంధీ విగ్రహాల్లోనే అత్యంత పెద్దది. ఇప్పటివరకూ అమెరికాలో 17 గాంధీ విగ్రహాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 4వ తేదీన మహాత్మా గాంధీ జీవిత ఆశయాలను కొనసాగించేందుకు మహాత్మా గాంధీ పీస్‌వాక్ - 2014ను నిర్వహించినట్లు ప్రసాద్ తోటకూర తెలిపారు.