అబాట్‌కు ఉద్వాసన | Australian Prime Minister Tony Abbott lost his position | Sakshi
Sakshi News home page

అబాట్‌కు ఉద్వాసన

Published Tue, Sep 15 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

అబాట్‌కు ఉద్వాసన

అబాట్‌కు ఉద్వాసన

- ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా టర్న్‌బుల్
కాన్‌బెర్రా:
నాటకీయ పరిణామాల మధ్య ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తన పదవిని కోల్పోయారు. అధికార పీఠం ఎక్కిన రెండేళ్ల తర్వాత అబాట్‌ను సోమవారం పార్టీ అంతర్గత ఓటింగ్‌లో తొలగించారు. అర్ధరాత్రి దాటాక లిబరల్ పార్టీ  నిర్వహించిన ఓటింగ్‌లో అబాట్‌కు 44 ఓట్లే దక్కాయి. అబాట్ వ్యతిరేక వర్గం నేత మాల్కం టర్న్‌బుల్‌కు 54 ఓట్లు దక్కాయి. కమ్యూనికేషన్ల మంత్రి పదవికి టర్న్‌బుల్   రాజీనామా చేశారు. దేశానికి ఆర్థిక పరిపుష్టిని ఇచ్చే నాయకత్వ లక్షణాలు అబాట్‌కు  లేవంటూ ఆయన నాయకత్వాన్ని టర్న్‌బుల్ సవాల్ చేయడంతో ఓటింగ్ జరిపారు. 2010లో కెవిన్ రడ్‌ను పదవీచ్యుతుడిని చేసి గిలార్డ్ ప్రధాని అయిన ఉదంతం మాదిరిగానే తాజా ఘటన జరిగింది. అబాట్ రాజీనామా చేశాక టర్న్‌బుల్ ప్రధాని పదవి చేపడతారు.

Advertisement
Advertisement