ఫేస్‌బుక్‌తో వెన్నునొప్పి మాయం! | Back Pain Solutions with Facebook! | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌తో వెన్నునొప్పి మాయం!

Published Sat, Jun 11 2016 10:03 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్‌బుక్‌తో వెన్నునొప్పి మాయం! - Sakshi

ఫేస్‌బుక్‌తో వెన్నునొప్పి మాయం!

లండన్: ఫేస్‌బుక్‌లో అదే పనిగా చాటింగ్ చేస్తుంటే మెడనొప్పి, ఆపై వెన్నునొప్పి రావడం ఖాయమనే విషయం తెలిసిందే. అయితే ఫేస్‌బుక్ వెన్నునొప్పిని తగ్గిస్తుందనే విషయం మీకు తెలుసా? బ్రిటన్‌లోని లీసెస్టర్ ఆస్పత్రికి చెందిన భారతీయ వైద్యుడు అరుముగాన్ మూర్తి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు చదివితే ఫేస్‌బుక్ వెన్నునొప్పిని తగ్గిస్తుందని మీకే తెలుస్తుంది. ఇంతకీ ఆయన ఏం చెప్పాడంటే... వెన్నునొప్పితో బాధపడేవారు ముందుగా వైద్యుల వద్దకు వెళ్లకుండా ఉపశమనం కోసం చిన్నపాటి చిట్కాలను పాటిస్తారు.

అయితే ఈ చిట్కాలు ఇప్పుడు ఫేస్‌బుక్‌లో పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని, వాటినే ఎక్కువమంది పాటిస్తున్నారని మూర్తి తెలిపారు. తన వద్దకు వచ్చిన రోగులకు వెన్ను నొప్పికి సంబంధించి కొన్ని రకాల ఎక్సర్‌సైజుల గురించి చెప్పినప్పుడు.. తమకు ఫేస్‌బుక్ వల్ల ముందే తెలుసని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement