బర్డ్.. బయోనిక్..
సడన్‌గా చూస్తే.. ఏదో పక్షి ఎగురుతుందనుకుంటాం.. అయితే.. ఇది మరపక్షి. పేరు బయోనిక్ బర్డ్. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ఆధారంగా పనిచేస్తుంది. బ్లూటూత్ ద్వారా దీనికి ఆదేశాలు పంపవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే.. 10 నిమిషాలపాటు ఎగురుతుంది. ఫ్రాన్స్‌కు చెందిన ఎడ్విన్ దీని రూపకర్త. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉంది. క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్ ‘ఇండీగోగో’ ద్వారా దీని ఉత్పత్తి కోసం నిధులను సేకరిస్తున్నారు.
మనకు 330 అడుగుల పరిధిలో తిరిగే ఈ బయోనిక్ బర్డ్ బరువు కేవలం 9 గ్రాములు. ఈ యాప్ తాలూకు ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వస్తుంది. భవిష్యత్తులో దీన్ని మరింత మెరుగుపరిచేందుకు యత్నిస్తున్నారు. తర్వాతి దశల్లో హెచ్‌డీ వీడియో రికార్డింగ్ చేసేందుకు వీలుగా ఇందులో కెమెరాలను అమర్చనున్నారు. అంతేకాదు.. చేతి సంజ్ఞల ఆధారంగా పనిచేసేలా దీన్ని మార్చడంతోపాటు బయోనిక్ బర్డ్ ఎగిరే పరిధినీ విస్తరించనున్నారు.