అమెరికాలో తీవ్రత తగ్గని మంచుతుపాను
న్యూయార్క్: అమెరికాలో మంచు తుపాను ఉధృతి కొనసాగుతోంది. పశ్చిమ న్యూయార్క్ రాష్ట్రంలో మం చుతుపాను దెబ్బకు కనీసం ఏడుగురు మరణించారు. దాదాపు ఆరు అడుగులమేర మంచు పేరుకుపోవడంతోజనం ఇళ్లలోను, రోడ్లపైన చిక్కుకుపోయారు. ఈరీ కౌంటీలోని ఆల్డెన్ ప్రాంతంలో 15 అడుగులమేర మంచు కప్పుకున్న కారులో 46 ఏళ్ల వ్యక్తి మృతదేహం బయల్పడినట్టు కౌంటీ అధికారులు తెలిపారు.
ఈరీ కౌంటీలోని బఫెలో నగరంలో మంచుతుపాను తీవ్రత ఎక్కువగా ఉంది. న్యూయార్క్‌లోని కొన్ని ప్రాంతాల్లో మరో మూడు అడుగులమేర మంచు కురువవచ్చని సీబీఎస్ న్యూస్ వార్తా సంస్థ అంచనా వేస్తున్న నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ ఆడ్రూ మార్క్ కౌమో అత్యయిక పరిస్థితిని ప్రకటించారు.