Ice storm
-
మంచు తుపానులో కాలిఫోర్నియా విలవిల
లాస్ఏంజెలిస్/డాలస్: అమెరికాలోని కాలిఫోర్నియాను వారం రోజులుగా భారీ మంచు తుపాను వణికిస్తోంది. కాలిఫోర్నియా, ఓరెగాన్లలో ఈ శతాబ్దంలోనే అత్యధికంగా ఏడడుగుల మేర మంచుకురిసింది. కొన్ని రిసార్టు ప్రాంతాల్లో 10 అడుగుల మేర మంచు పేరుకుపోయిందన్నారు. అనూహ్య మంచు తుపానుతో కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో కొండ ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరాలు, ఆహారం, మందులు, పాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ మంచుమయం కావడంతో బయటకు వచ్చే వీలులేకపోయింది. కొండప్రాంతాల నివాసితులు రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. ఇళ్లు, వాహనాలు మంచు గుట్టల మధ్య కూరుకుపోయాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. రెండిళ్లలో పేలుళ్లు సంభవించినట్లు, మంచు భారంతో ఇళ్లపైకప్పులు కూలినట్లు, కొన్ని ఇళ్లలో గ్యాస్ లీకేజీ జరిగినట్లు సమాచారం ఉందని సిబ్బంది తెలిపారు. అత్యవసర వైద్య సాయం అవసరమైన వారిని రెడ్‌క్రాస్ షెల్టర్‌కు తరలించారు. కరెంటు తీగలు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నెవాడా సరిహద్దుల్లో ఉన్న సాక్రమెంటో, లేక్ టహో ప్రాంతాల్లో మంచుతుపాను శనివారం మరింత తీవ్ర మవుతుందని నిపుణులు హెచ్చరించారు. కాలిఫోర్నియాలోని 13 కౌంటీల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అయితే, మంచు తుపాను కారణంగా కాలిఫోర్నియా ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు తొలిగినట్లేనని అధికారులు చెప్పారు. పెనుగాలుల విధ్వంసం టోర్నడో తుపాను దెబ్బకు టెక్సాస్, లూసియానాల్లో అంధకారం అలుముకుంది. టెక్సాస్‌లోని డాలస్, ఫోర్ట్ వర్త్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. డాలస్‌లో భారీగా చెట్లు నేలకూలాయి. వాహనాలు పల్టీలు కొట్టాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయని పోలీసులు తెలిపారు. డాలస్–ఫోర్ట్‌వర్త్, డాలస్ లవ్ ఫీల్డ్ విమానాశ్రయాల్లో 400 విమానాలు రద్దయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో టెక్సాస్‌లోని సుమారు 3.40 లక్షల వినియోగదారులు గురువారం రాత్రి చీకట్లోనే గడిపారు. వాతావరణ విభాగం హెచ్చరికలతో డాలస్, ఫోర్ట్‌వర్త్ తదితర ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసివేశారు. -
ఈ వారం హిట్స్
స్నోబోర్డింగ్ విత్ ది ఎన్.వై.పి.డి. నిడివి : 2 ని. 41 సె. హిట్స్ : 1,24,36,041 న్యూయార్క్ ఈమధ్య మంచు తుపానులో కూరుకుపోయింది. రోడ్లు, వాహనాలు ఎక్కడివక్కడ బిగదీసుకుపోయాయి. అయితే ఈ పరిస్థితిని ఎంజాయ్ చేసినవాళ్లూ ఉన్నారు! టైమ్‌స్క్వేర్ నుంచి న్యూయార్క్ నగరంలోని తక్కిన ప్రధాన కూడళ్లకు.. రోడ్డు మీద పేరుకుని పోయిన ఐస్‌లో.. స్నోబోర్డింగ్ చేశారు. ఐస్‌ను తొలగించే పనుల్లో ఉన్న న్యూయార్క్ పోలీసులు కూడా ఎంజాయ్ చేస్తూ తమ పని కానిచ్చేశారు. జేన్-పిల్లోటాక్ : వీడియో సాంగ్ నిడివి : 3 ని. 26 సె. హిట్స్ : 3,74,90,669 ఇంగ్లండ్ గాయకుడు జేన్ మాలిక్ త్వరలో విడుదల చేయబోతున్న తన తొలి సోలో స్టూడియో ఆల్బమ్ ‘మైండ్ ఆఫ్ మైన్’లోని ఒక పాట పిల్లోటాక్. మార్ధవ స్వరంతో, డౌన్బీట్లో జేన్ పాడిన ఈ ప్రణయగీతం యువతీయువకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రేమానుబంధం గాలిలో తేలిపోయే దశకు చేరుకున్నప్పుడు హృదయాలు బరువెక్కి ఎంతగా మెత్తబడతాయో ఈ సాంగ్‌లో 23 ఏళ్ల జేన్ లయబద్ధంగా అభినయిస్తూ ఆలపించారు. కోల్డ్‌ప్లే : హెమ్న్ ఫర్ ది వీకెండ్ నిడివి : 4 ని. 20 సె. హిట్స్ : 2,14,48,968 బ్రిటిష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్‌ప్లే’ విడుదల చేసిన వీడియో సాంగ్ ‘హెమ్న్ ఫర్ ది వీకెండ్’. అమెరికన్ గాయని బేయన్స్, భారతీయ నటి సోనమ్ కపూర్ ఇందులో కనిపిస్తారు. చిత్రీకరణ గత అక్టోబర్‌లో ముంబైలో జరిగింది. దాంతో ఈ వీడియో ఆధునిక, సంప్రదాయ సంగీతాల సమ్మేళనంలా కనిపిస్తుంది. వినిపిస్తుంది. దేహం, మనసు ఐక్యం చెందే భావనను అనుభూతి చెందాలంటే ఈ వీడియోను తప్పని సరిగా చూడాల్సిందే. -
అమెరికా అతలాకుతలం
మంచు తుపానుతో వణికిపోతున్న అగ్రరాజ్యం 18 మంది మృత్యువాత వాషింగ్టన్/న్యూయార్క్: అమెరికా తూర్పు కోస్తా ప్రాంతం మొత్తం బలమైన ఈదురు గాలులు, మంచు తుపాను ధాటికి అల్లకల్లోలం అవుతోంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. మంచు తుపాను ధాటికి దాదాపు 18 మంది మృత్యువాత పడ్డారు. ‘స్నోజిల్లా’ అని పిలుస్తున్న ఈ మంచు తుపాను ప్రభావంతో అమెరికా పశ్చిమ ప్రాంతం మొత్తం స్తంభించిపోయింది. దాదాపు మూడు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఇప్పటికే దాదాపు 10 రాష్ట్రాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ వంటి ప్రధాన నగరాలు మంచు తుపానులో చిక్కుకోవడం దాదాపు 8.5 కోట్ల మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కూడా లేకపోవడంతో కొన్ని వేల మంది చీకట్లోనే గడుపుతున్నారు. వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. న్యూయార్క్ వంటి నగరాల్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్న కారణంతో ప్రజలు కార్లలో ప్రయాణించకూడదని ఆంక్షలు విధించింది. భూగర్భ మెట్రో రైలు సర్వీసులను రద్దు చేసింది. ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లేందుకు రోడ్లపై పేరుకుపోయిన మంచును అధికారులు తొలగిస్తున్నారు. ఇంకో 24 గంటలు ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. -
అమెరికాలో తీవ్రత తగ్గని మంచుతుపాను
న్యూయార్క్: అమెరికాలో మంచు తుపాను ఉధృతి కొనసాగుతోంది. పశ్చిమ న్యూయార్క్ రాష్ట్రంలో మం చుతుపాను దెబ్బకు కనీసం ఏడుగురు మరణించారు. దాదాపు ఆరు అడుగులమేర మంచు పేరుకుపోవడంతోజనం ఇళ్లలోను, రోడ్లపైన చిక్కుకుపోయారు. ఈరీ కౌంటీలోని ఆల్డెన్ ప్రాంతంలో 15 అడుగులమేర మంచు కప్పుకున్న కారులో 46 ఏళ్ల వ్యక్తి మృతదేహం బయల్పడినట్టు కౌంటీ అధికారులు తెలిపారు. ఈరీ కౌంటీలోని బఫెలో నగరంలో మంచుతుపాను తీవ్రత ఎక్కువగా ఉంది. న్యూయార్క్‌లోని కొన్ని ప్రాంతాల్లో మరో మూడు అడుగులమేర మంచు కురువవచ్చని సీబీఎస్ న్యూస్ వార్తా సంస్థ అంచనా వేస్తున్న నేపథ్యంలో న్యూయార్క్ గవర్నర్ ఆడ్రూ మార్క్ కౌమో అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. -
మంచు తుపానుకు అమెరికా విలవిల
*20 రాష్ట్రాల్లో హిమపాతం ప్రభావం * 8 లక్షల ఇళ్లలో అంధకారం వాషింగ్టన్: అమెరికాను మంచు తుపాను మళ్లీ ముంచెత్తింది. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. అలబామా రాష్ట్రం నుంచి వర్జీనియా రాష్ట్రం వరకూ సుమారు 20 రాష్ట్రాల్లో మంచు ప్రభావం కనిపించింది. ముఖ్యంగా వాషింగ్టన్లో గురువారం భారీగా కురిసిన హిమపాతంతో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. వాషింగ్టన్‌లోని పలు ప్రాంతాల్లో 11 అంగుళాల మేర మంచు కురిసింది. గ్రిడ్ వైఫల్యం కారణంగా 8 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వాషింగ్టన్‌లోని చాలా చోట్ల అంధకారం నెలకొంది. దేశవ్యాప్తంగా 5000కుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఒక్క అట్లాంటాలోని హార్ట్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోనే సగానికిపైగా సర్వీసులు నిలిచిపోయాయి. ఈశాన్య ప్రాంతమైన న్యూ ఇంగ్లండ్‌లో 18 అంగుళాల మేర మంచు కురిసింది. హిమపాతం కారణంగా ఉత్తర కరోలినా రాష్ట్రంలో చాలా చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. తుపాను ప్రభావం తగ్గే వరకూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దొని ఉత్తర కరోలినా గవర్నర్ ప్యాట్ మెక్‌క్రోరీ కోరారు. న్యూయార్క్, న్యూజెర్సీలను కూడా మంచు తుపాను తాకనుండటంతో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని వాతావరణ కేంద్రం సూచించింది. మంచు తుపానుకు ఇప్పటివరకూ 11 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటికే వరదలతో అతలాకుతలమైన బ్రిటన్‌లో గురువారం పెను గాలులు బీభత్సం సృష్టించాయి. -
అమెరికాలో మంచు తుపాను
బ్రిటన్ సహా యూరోప్ దేశాల్లోనూ తుపాన్లు 24 మంది మృతి విద్యుత్ సరఫరాకు విఘాతం అగస్టా (అమెరికా): అమెరికాలోని మధ్య, ఈశాన్య ప్రాంతాలతో పాటు కెనడాలోని తూర్పు ప్రాంతాన్ని మంచు తుపాను ముంచెత్తింది. తుపాను కారణంగా 24 మంది మరణించగా, ఉభయ దేశాల్లోనూ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బ్రిటన్ సహా పలు యూరప్ దేశాలనూ తుపానులు అతలాకుతలం చేశాయి. ఫలితంగా 50 లక్షలకు పైగా జనాభా క్రిస్మస్ రోజున అంధకారంలోనే గడిపారు. తుపాను ప్రభావాన మరింతగా మంచు కురిసే అవకాశాలు ఉన్నాయని అమెరికా జాతీయ వాతావరణ విభాగం వెల్లడించింది. విద్యుత్ సరఫరా లేనందున జనరేటర్లు వినియోగించి, వాటి నుంచి వెలువడిన విషవాయువు కారణంగా కెనడాలో ఐదుగురు మరణించారు. మంచు తుపాను కారణంగా కెనడా తూర్పు ప్రాంతంలో జరిగిన వాహన ప్రమాదాల్లో మరో ఐదుగురు మరణించారు. అమెరికాలో 14 మంది మరణించారు. వారిలో ఇద్దరు జనరేటర్ల నుంచి వెలువడిన విషవాయుల కారణంగానే మరణించినట్లు పోలీసులు తెలిపారు. మంచు తుపాను తాకిడికి గురైన ప్రాంతాల్లో కనీస ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. టొరంటోలో మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ సిబ్బంది నిరంతరాయంగా కృషి చేస్తున్నారని అధికారులు తెలిపారు. స్థానిక సహాయక బృందాలు వారికి సహకరిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, బ్రిటన్ సహా పలు యూరప్ దేశాలను కూడా తుపానులు ముంచెత్తుతున్నాయి. బ్రిటన్‌లోని దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాల్లో దాదాపు 50 వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపోయింది. బ్రిటన్ సహా పలు యూరప్ దేశాలను భారీ వర్షాలు, పెనుగాలులు అతలాకుతలం చేశాయి. బొర్న్మౌత్ సమీపంలో స్టౌర్ నదికి వరదలు రావడంతో ఆ ప్రాంతం నుంచి 90 వేల మంది ప్రజలను బుధవారం వేకువ జామున సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. తుపానుల కారణంగా విమానాల రాకపోకలకూ అంతరాయం ఏర్పడిందని వారు చెప్పారు. -
మంచు తుఫాన్ తో అమెరికాలో పలుచోట్ల గాఢాంధకారం
క్రిస్మస్ పండగ రోజున లక్షలాది మంది ఉత్తర అమెరికా, ఈస్టర్న్ కెనడా వాసులు గాడాంధకారంలో గడిపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంచు తుఫాన్ కారణంగా కలిగిన విద్యుత్ అంతరాయం కలిగింది. విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు సిబ్బంది రేయింబళ్లు కష్టించి పనిచేస్తున్నారు. మంచు తుఫాన్ కు సుమారు 24 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. ఇప్పట్లో వాతావరణం సాధారణ స్థాయికి వచ్చే పరిస్థితి లేదని యూఎస్ జాతీయ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గ్రేట్ లేక్స్, మిడ్ వెస్ట్ ప్రాంతాల్లో భారీగా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కెనడాలో విపరీతమైన చలి నుంచి ఉపశమనం పొందడానికి గ్యాస్ జనరేటర్లు ఉపయోగించారని.. అయితే కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు వెలువడటంతో ఐదుగురు మరణించారని పోలీసులు తెలిపారు. అమెరికాలో మంచు తుఫాన్ కు 14 మంది బలయ్యారని అధికారులు తెలిపారు. టొరంటోలో ఉష్టోగ్రత మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతోందని అధికారులు తెలిపారు