'అశ్లీల చిత్రాల్లో నటన మానేసినా.. ' | Bree Olson describes hardships after leaving adult film industry | Sakshi
Sakshi News home page

'అశ్లీల చిత్రాల్లో నటన మానేసినా.. '

Published Thu, Mar 31 2016 8:02 PM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

'అశ్లీల చిత్రాల్లో నటన మానేసినా.. '

'అశ్లీల చిత్రాల్లో నటన మానేసినా.. '

బ్రిటన్: ఒకప్పుడు అశ్లీల చిత్రాల్లో నటించి ఆ తర్వాత తనను తాను తెలుసుకొని ఆ రంగాన్ని వదిలేసి వచ్చిన తనకు జీవితం దుర్భరంగా మారిందని ఒకప్పటి అడల్ట్ స్టార్ బ్రీ ఓల్సాన్ తెలిపింది. ఏ అమ్మాయి జీవితం కూడా తనలాగా తయారు కాకూడదని కోరుకుంటున్నానని అన్నారు. ఆ పనికిరాని కూపం(అశ్లీల చిత్రాల్లో నటించడం)లో ఏ యువతి కూరుకోవద్దని వాపోయింది. 2011లోనే తాను అశ్లీల చిత్రాల్లో నటించడం మానుకొని మాములు మనిషిగా మారాలని నిర్ణయించుకున్నానని, కానీ ఏదైతే తాను ఊహించుకున్నానో అలా తన జీవితం లేదని చెప్పింది.

బయటకు వచ్చిన తనను గుర్తించిన వారు ఎంతో రోతగా చూస్తున్నారని, వినకూడని మాటలు వినాల్సి వస్తోందని, అసభ్యకరంగా పలకరిస్తూ తనను ఇంకా అదే కోణంలో చూస్తున్నారని వాపోయింది. తాను ఎన్నో వ్యాపారాలు ప్రారంభించినా అవి కొద్ది రోజులకే దెబ్బతిని మూతపడ్డాయని, తాను ఎక్కడికి వెళ్లినా తన గతమే మనుషుల రూపంలో వెంటాడుతోందని, సమాజం తనను బాగా అసంహ్యించుకుంటోందని బాధపడింది. ప్రస్తుతం కెమెరా మోడల్గా చేస్తున్నానని తెలిపింది.

లాస్ ఏంజెల్స్లో ఉన్న ఆమె ప్రస్తుతం ఇండియానాకు వెళ్లిపోయి అక్కడే ఉంటున్నట్లు తెలిపింది. ఎవరేమనుకున్నా ప్రస్తుతం తాను సంతోషంగానే ఉన్నానని, నా గతంలాంటిదాన్ని జీవితంలో ఇక కోరుకోనని, ఎప్పటికీ అలా జరగదు కూడా అని చెప్పింది. రియల్ వుమెన్, రియల్ స్టోరీస్ అనే పేరిట ఓ టెలీ చానెల్ నిర్వహించిన వీడియో ఇంటర్వ్యూలో ఆమె ఈ అంశాలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement