hardships
-
సినీ కార్మి కుల కష్టాన్ని గుర్తించాలి
సాక్షి, న్యూఢిల్లీ: సినీ కార్మికుల కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కథానాయకులు రూ.కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నారని, కార్మి కుల వేతనాలు మాత్రం అంతంతగానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ కార్మికుల కష్టానికి తగ్గ ఫలం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు, 2023పై ఆయన మాట్లాడారు. భారతీయ చలనచిత్ర రంగంలో వివిధ విభాగాల్లో రెండు లక్షల మందికిపైగా కార్మి కులు పనిచేస్తున్నారని తెలిపారు. చిత్ర నిర్మాణ వ్యయంలో మూడోవంతు పైగా భాగం కథానాయకుల పారితోషికాలకే సరిపోగా.. మిగిలిన మొత్తంతో చిత్రనిర్మాణం పూర్తి చేయాల్సి వస్తోందన్నారు. సెన్సార్ బోర్డ్ సరి్టఫికెట్ పొందిన చిత్ర నిర్మాత లేదా దర్శకుడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు దాఖలు కాకుండా నిరోధించేలా సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణ చేయాలని కోరారు. రైల్వే అప్రెంటీస్లకు న్యాయం చేయండి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) చేసిన తప్పిదం కారణంగా వందలాది కోర్సు కంప్లీటెడ్ అప్రెంటిస్ అభ్యర్థులకు రైల్వే నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్సీవీటీ పరీక్షకు హాజరు కాలేదన్న సాకుతో వారి నియామకాన్ని రైల్వే పెండింగ్‌లో పెట్టిందన్నారు. మానవతా దృక్పథంతో ఆ అభ్యర్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పైరసీ సైట్ల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి:ఎంపీ నిరంజన్‌రెడ్డి విచ్చలవిడిగా పెరిగిపోతున్న పైరసీ సైట్ల నియంత్రణకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి భారతీయ సినిమా ఆర్థికంగా నష్టపోకుండా చూడాలన్నారు. పైరసీ సైట్లు సుమారు రూ.20 వేల కోట్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయన్నారు. గురువారం రాజ్యసభలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. ఆయా సైట్లను బ్లాక్‌చేయడం ద్వారా భారతీయ సినిమాను రక్షించొచ్చన్నారు -
మహా పతనం.. ఒక కప్పు చాయ్ రూ.100, లీటర్ పెట్రోల్ 280, కిలో చికెన్ 1000
రావణుడి పాలనలో శ్రీలంక భోగభాగ్యాలతో తులతూగేదని చదివాం! కానీ ప్రస్తుత లంక పరిస్థితి మాత్రం ఆంజనేయుడు దహనం చేసిన తర్వాత లంక లాగా ఉంది. విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి క్షీణించడంతో లంక ఆర్థిక వ్యవస్థ పతనం అంచుకు చేరింది. కరోనాతో ప్రారంభమైన ఆర్థిక కష్టాలు ఉక్రెయిన్ యుద్ధంతో చెప్పలేనంతగా పెరిగాయి. వీటిని దాటుకొని శ్రీలంక నిలబడుతుందా? లేక దివాలా తీస్తుందా? అని ఆర్థికవేత్తలు అనుమానపడుతున్నారు. స్వాతంత్య్రానంతరం ఎన్నడూ చూడని మహా ఆర్థిక సంక్షోభం శ్రీలంకను చుట్టుముట్టింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భగ్గుమన్నాయి. మూలిగే నక్కపై తాటిపండు అన్నట్లు విదేశీ నిల్వలు అడుగంటి అల్లాడుతున్న శ్రీలంకలో ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం అదుపుతప్పింది. విద్యార్థుల పరీక్షలు నిర్వహించేందుకు తగిన పేపర్లు లేవని ప్రభుత్వం పలు పరీక్షలు వాయిదా వేయడం, పెట్రోలు కోసం క్యూలో నిలబడి ఇద్దరు సామాన్య పౌరులు చనిపోవడం లంకలో పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ దుస్థితికి ప్రస్తుత ప్రభుత్వమే కారణమని సామాన్యుల నుంచి ప్రతిపక్షం దాకా ఆరోపిస్తున్నాయి. లంక విదేశీ మారక నిల్వల్లో క్షీణత 2020 ఆగస్టు నుంచే ఆరంభమైంది. 2021 నవంబర్‌లో ఈ నిల్వలు ప్రమాదకర హెచ్చరిక స్థాయి దిగువకు చేరాయి. జనవరి 2022లో శ్రీలంక విదేశీ నిల్వలు మరింత దిగజారి 230 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. నిల్వల తరుగుదలతో ప్రభుత్వం నిత్యావసరాల దిగుమతులు చేసుకోవడానికి, అప్పులు చెల్లించడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో త్వరలో లంక డిఫాల్ట్ (ఎగవేత) దేశంగా మారే ప్రమాదం ఉందన్న భయాలు పెరిగాయి. స్వతంత్రం వచ్చినప్పటినుంచి లంక విత్తలోటుతో సతమతమవుతూనే ఉంది. 2019లో ఈస్టర్ దాడుల ప్రభావం లంక టూరిజంపై పడి విదేశీ నిధుల రాక తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం కోవిడ్ లంకను కోలుకోలేని దెబ్బ తీసింది. 2020 ఏప్రిల్, జూన్ కాలంలో కేంద్రబ్యాంకు విదేశీ నిధులను ఉపయోగించి 10 వేల కోట్ల డాలర్ల ప్రభుత్వ విదేశీ రుణాలను తీర్చింది. ఇలా ఉన్న నిధులు అప్పుల కింద చెల్లించాల్సిరావడం లంక పరిస్థితిని ఇక్కట్ల పాలు చేసింది. అన్నిటికీ కొరతే విదేశీ నిల్వల తరుగుదలకు ఇంధన ధరల పెరుగుదల తోడవడంతో దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయి. దేశంలో ఎక్కడ చూసినా నిత్యావసరాల కొరత కనిపిస్తోంది. వీటికి విద్యుత్ కోతలు, నీటి సరఫరా కోతలు తోడవుతున్నాయి. కిరాణా కొట్లు, పెట్రోల్ బంకులు, మెడికల్ షాపుల ముందు భారీగా ప్రజలు క్యూ కడుతున్నారు. దేశంలో విదేశీ మారకం కొరత కారణంగా దిగుమతి దారులు బ్యాంకుల నుంచి ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పొందటం కష్టంగా మారింది. దీనివల్ల నౌకాశ్రయాల్లో కంటైనర్లు పేరుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇంధన లేమితో పలు విద్యుత్ ప్లాంట్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల వ్యవసాయానికి ఉంచిన నీటిని వాడి విద్యుదుత్పాదన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీని వల్ల తీవ్రమైన ఆహారకొరత ఎదురుకానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫార్మా రంగంలో ఔషధాల కొరత తీవ్రతరమైందని లంక ఫార్మా ఓనర్ల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. సంక్షోభ కారణంగా లంక రేటింగ్‌ను ఏజెన్సీలు మరింత డౌన్‌గ్రేడ్ చేసే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే ఇప్పట్లో దేశంలోకి విదేశీ ఇన్వెస్టర్లు రావడం జరగకపోవచ్చని భయాలున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అంతర్గతంగా పలు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. విత్తలోటుకు కారణమయ్యే లగ్జరీ వాహనాలు, రసాయన ఎరువులు, పసుపులాంటి ఆహార వస్తువుల దిగుమతిని నిషేధించింది.దేశీయ బ్యాంకులు కుదుర్చుకునే ఫార్వార్డ్ కాంట్రాక్టులపై కేంద్ర బ్యాంకు పరిమితులు విధించింది. విదేశీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల ఆకర్షణకు, చెల్లింపుల ప్రవాహం (రెమిటెన్స్ ఫ్లో– దేశంలోకి వచ్చే విదేశీ నిధులు) పెరుగుదలకు కీలక పాలసీలు ప్రకటించింది. విదేశీ సాయం లంకకు సాయం చేయడం కోసం బంగ్లా, చైనాలు కరెన్సీ స్వాపింగ్(అసలును ఒక కరెన్సీలో, వడ్డీని మరో కరెన్సీలో చెల్లించే వెసులుబాటు) సదుపాయాన్ని పొడిగించాయి. దీంతో పాటు చైనా 70 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేసింది. ఇండియా సైతం 240 కోట్ల డాలర్ల విలువైన పలు రకాల సహాయాలు ప్రకటించింది. పాకిస్తాన్ సిమెంట్, బాస్మతీ రైస్, ఔషధాల సరఫరాకు ముందుకు వచ్చింది. ఖతార్ తదితర దేశాలు కూడా తగిన సహాయం ప్రకటించాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ సాయాన్ని అంగీకరించాలంటే పలు కఠిన షరతులను లంక అంగీకరించాల్సి వస్తుంది. బెయిల్ అవుట్ లేకుండానే తాము గట్టెక్కుతామని, పరిస్థితి త్వరలో చక్కబడుతుందని లంక ప్రభుత్వం, లంక కేంద్ర బ్యాంకు (సీబీఎస్‌ఎల్) ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలపై అటు ఆర్థికవేత్తలు, ఇటు ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. చైనా సాయం పేరిట దేశాన్ని కబళిస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం తాజాగా ఐఎంఎఫ్‌ను సంప్రదిస్తామని ప్రకటించింది. కప్పు టీ రూ.100 ► దేశంలో టోకు ద్రవ్యోల్బణం 15.1 శాతాన్ని, ఆహార ద్రవ్యోల్బణం 25.7 శాతాన్ని తాకాయి. ఇవి ఆసియాలోనే గరిష్టం. ► వంటగ్యాస్ సిలిండర్ ధర గత అక్టోబర్‌లో 1500 రూపాయలుండగా, ప్రస్తుతం 3వేల రూపాయలకు దగ్గరలో ఉంది. ► పాల పౌడర్ ధరలు పెరగడంతో ప్రస్తుతం కప్పు టీ ధర రూ. 100కు చేరింది. ► ఒక గుడ్డు ధర రూ.35కు చేరగా, కిలో చికెన్ రూ.1,000ని తాకింది. ► లీటర్ పెట్రోల్ ధర రూ. 280ని దాటేసింది. ► లంక రూపాయి 30 శాతం క్షీణించి అమెరికా డాలర్‌తో మారకం 275కు చేరింది. ఇదీ పరిస్థితి ► గత నవంబర్‌నాటికి శ్రీలంక మొత్తం విదేశీ రుణాలు 3200 కోట్ల డాలర్లున్నాయి. ► శ్రీలంక 2021– 26 కాలంలో 2,900 కోట్ల డాలర్ల రుణాలను చెల్లించాల్సి ఉంది. ► కరోనాకు ముందు లంక టూరిజం ఆదాయం 360 కోట్ల డాలర్లుండగా ప్రస్తుతం 60 కోట్ల డాలర్ల దిగువకు పడిపోయింది. ► లంకకు వచ్చే టూరిస్టుల్లో రష్యన్లు, ఉక్రేనియన్ల వాటా దాదాపు 25 శాతం. యుద్ధం కారణంగా వీరి రాక ఆగిపోయింది. ► లంక ఎగుమతుల్లో కీలకమైన తేయాకును దిగుమతి చేసుకునే దేశాల్లో రష్యా, ఉక్రేనియన్ కీలకం. ► కరోనాకు ముందు చైనా నుంచి లంకకు లక్షల్లో టూరిస్టులు వచ్చేవారు. కరోనా దెబ్బకు వీరంతా తగ్గిపోయారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
తప్పు నల్లిది... శిక్ష మంచానికి!
మనుష్యుడు తనంతతానుగా తప్పు చేసేవాడు కాకపోయినా, దుర్మార్గులతో స్నేహం చేస్తే పడరాని కష్టాలను పడతాడని చెప్పడానికి...సుమతీ శతకకారుడు బద్దెనగారు బహు సులభమైన ఉపమానాలతో వివరిస్తున్నాడు... ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ ...‘‘కొంచెపు నరు..’’ అంటే... బుద్ధి పరిణతి చెందనివాడు, అధముడు, దుర్బుద్ధి కలిగినవాడు, ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలతో ఉండేవాడు–వాడు బాగుపడడు, ఇతరులను బాగపడనివ్వడు. దుర్జనులతో స్నేహం చేస్తే అంచితముగ కీడువచ్చు..అంటే అంతాఇంతా అని చెప్పలేనంత అపకీర్తి, ప్రమాదం, కష్టం ముంచుకొచ్చేస్తాయి.... ఎలాగంటే... ఇప్పటితరానికి ఎక్కువగా తెలిసే అవకాశం లేదు కానీ వెనకటికి నులక మంచాలు, నవారు మంచాలు, పేము మంచాలంటూ ఉండేవి. కట్టెమంచాలకు నవారు, నులక లేదా పేము అల్లి వాడుకొనేవారు. మంచానికున్న పట్టీలు, కోళ్ళు, నవారు, నులకల మధ్య సందుల్లో కుప్పలు కుప్పలుగా నల్లులు చేరేవి, గుడ్లు పెట్టేవి. వీటికి ఒక లక్షణం ఉంటుంది. మంచంమీద పడుకున్న వ్యక్తి మేలుకుని ఉన్నంతవరకు అవి బయటికి రావు. నిద్రలోకి జారుకోగానే అవి కుడుతుంటే సుఖంగా నిద్రపోవడం సాధ్యం కాదు. వాటి బాధ వదిలించుకోవాలంటే పగలు ఎర్రటి ఎండలో మంచాన్ని నేలకేసి పదేదపదే కొడితే నల్లులు రాలిపడుతుంటాయి. కాళ్లతో వాటిని నలిపి చంపుతారు. అయినా ఇంకా సందుల్లో గుడ్లు ఉంటాయి. వాటిమీద కిరసనాయిలు పోసేవారు.... ఇప్పడు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే.... నిద్రపోతున్న మనుషులను కుట్టినది నల్లులయితే మధ్యలో ఆ మంచం చేసిన తప్పేమిటి ? నిజానికి పడుకోవడానికి ఉపయోగపడడం తప్ప మరోపాపం ఎరుగదు. కానీ నల్లులకు ఆశ్రయం ఇచ్చినందుకు ... దెబ్బలు తిన్నది మాత్రం మంచమే. నల్లులు చేరిన తరువాత మంచానికి కష్టాలు ఎలా వచ్చాయో, దుర్మార్గులతో కలిసిన వారి జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. మహాభారతంలో దుర్యోధనడు అంటాడు...‘‘జానామిధర్మంనచమే ప్రవృత్తిః జానామ్యధర్మం నచమే నివృత్తిః...’’ నాకు ధర్మం తెలియదనుకుంటున్నారా...నాకు అన్నీ తెలుసు కానీ దాన్ని పాటించాలనిపించడం లేదు. దాన్ని పట్టుకుంటే జీవితంలో వృద్ధిలోకి వస్తామని కూడా తెలుసు. విజయాలు వరిస్తాయనీ తెలుసు. నాకు అధర్మం ఏదో తెలియదనుకుంటున్నారా.. ఏది చెయ్యకూడదో నాకు తెలుసు. అది చేస్తే భగవంతుడి అనుగ్రహం ఉండదని కూడా తెలుసు. అలా ఉంటే జీవితంలో ఇబ్బందులపాలవుతామనీ తెలుసు...అయినా అధర్మాన్ని విడిచిపెట్టాలనిపించదు. ’’ అంటూ ఇంకా దుర్యోధనుడు ఏమన్నాడో చూడండి...‘‘...కేనాపి దేవేన హృధిస్థితేన యథాప్రవృతోస్మి తథాకరోమి’’...అన్నాడు... అంటే.. ఇందులో నా తప్పేముంది? మీ అందరికీ ఉన్నట్టే నా హృదయంలో కూడా భగవంతుడున్నాడు. ఆయన నన్ను ధర్మాన్ని పట్టుకోనీయడం లేదు. అధర్మాన్ని పట్టుకోనిస్తున్నాడు. నేను పట్టుకుంటున్నా. ఇది నా తప్పెలావుతుంది? ఏదయినా తప్పు ఉంటే లోపల ఉన్న భగవంతుడిది అవుతుంది..’’ అటువంటి వితండవాదనలు చేసే మూర్ఖులను ఎంతమంది రుషులు, సాధుసత్పురుషులు వచ్చినా ఏం మార్చగలరు? జీవితంలో మనకు ఇటువంటి వారు కూడా ఎక్కువగా తారసపడుతుంటారు... వారితో స్నేహం వల్ల మన జీవితాలు కూడా దారి తప్పుతాయి... మన చుట్టూ ఉండేవారిపట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో బద్దెనగారు ఉద్బోధ చేస్తున్నారు. అలా ఉండకపోతే...నల్లులకే కాదు, మంచానికి ఏర్పడిన ప్రమాదం లాగా మనకే కాదు, మన పక్కన ఉన్న ఇతరులు కూడా కష్టాలపాలవుతారని హెచ్చరిస్తున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
షరియా.. ఉల్లంఘిస్తే ఉరే
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ హస్తగతం చేసుకోవడంతోపాటు తమ పాలనను ప్రజలపై రుద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో షరియా చట్టంపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అఫ్గాన్‌లో తాలిబన్లు షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తారని, మహిళలకు ఇక కష్టాలు తప్పవని, వారు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోతారని, మగవాళ్ల కింద బానిసలుగా మారిపోతారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ చట్టానికి తాలిబన్లు తమదైన సొంత భాష్యం చెబుతున్నారు. నిజానికి షరియా అనేది ఇస్లాం లో ఒక చట్టబద్ధమైన వ్యవస్థ అంటున్నారు. షరియా చట్టం కింద అఫ్గానిస్తాన్‌లోని మహిళలు వారి హక్కులను సంపూర్ణంగా అనుభవించవచ్చని భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల పాలనలో ఈ చట్టం కింద మహిళల స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.. ► మహిళలు మార్కెట్‌కు వెళ్లొచ్చా? వెళ్లొచ్చు. అయితే, వారి కుటుంబానికే చెందిన ఒక పురుషుడు తప్పనిసరిగా తోడుగా ఉండాలి. ఒంటరిగా బయట అడుగు పెట్టడానికి వీల్లేదు. ► బయటకు వెళ్లి స్నేహితులతో సరదాగా గడపొచ్చా? ఎంతమాత్రం కుదరదు. మహిళల సరదాలు, సంతోషాలు ఇంటికే పరిమితం. బయటకు వెళ్లి దొరికిపోతే కఠిన శిక్షలుంటాయి. ► మగ స్నేహితులను కలవొచ్చా? 12 ఏళ్ల వయసు దాటిన పరాయి పురుషులతో, కుటుంబ సభ్యులు కాని మగవాళ్లతో మాట్లాడటానికి అనుమతి లేదు. ► చదువుకోవచ్చా? మహిళలు చదువుకోవచ్చు. కానీ, బయట స్కూల్, కాలేజీల్లో కాదు. ఇళ్లల్లోనే చదువు నేర్చుకోవాలి. స్కూళ్లు, కాలేజీలు, మదర్సాలు కేవలం మగవాళ్ల కోసమే. ► మేకప్ వేసుకోవచ్చా? మహిళలు కనీసం గోళ్ల రంగుతో సహా ఎలాంటి మేకప్ వేసుకోవడానికి తాలిబన్లు అనుమతించరు. ► సంగీతం, నృత్యం నేర్చుకోవచ్చా? షరియా కింద సంగీతం చట్టవిరుద్ధం. డ్యాన్స్ కూడా నేర్చుకోవద్దు. వేడుకల్లో పాటలు పాడిన వారిని, నృత్యాలు చేసిన వారిని తాలిబన్లు గతంలో శిక్షించారు. ► కార్యాలయాల్లో పని చేయవచ్చా? చేసుకోవచ్చు. బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే మహిళలు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు తాలిబన్లు ఎస్కార్టుగా వస్తుంటారట. మహిళల బదులు వారి కుటుంబాల్లోని మగవాళ్లను ఉద్యోగాలకు పంపించాలని సూచిస్తుంటారట. ► బుర్ఖా తప్పనిసరిగా ధరించాలా? అవును ధరించాల్సిందే. షరియా చట్టం ప్రకారం మహిళలు తమ అందాన్ని బహిర్గతం చేయకూడదు. 8 ఏళ్లు దాటిన ప్రతి బాలిక బయటకు వెళ్లి నప్పుడల్లా బుర్ఖా ధరించాలి. బయటకు వెళ్లి ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే కుటుంబ సభ్యుల్లోని మగవారిని తోడుగా తీసుకెళ్లాలి. ► బిగ్గరగా మాట్లాడొచ్చా? అలా మాట్లాడొద్దు. మహిళలు అందరికీ వినిపించేలా గట్టిగా మాట్లాడడం నేరం. ► హై హీల్స్ సంగతేంటి? ఎత్తు మడమల చెప్పులు, బూట్లను తాలిబన్లు నిషేధించారు. మహిళలు నడిచేటప్పుడు శబ్దం రాకూడదు. ► ఇంటి బాల్కనీలో కూర్చోవచ్చా? తాలిబన్ల పాలనలో బాల్కనీల్లో మహిళలు కనిపించకూడదు. ఇంటి లోపలే ఉండాలి. ► సినిమాల్లో నటించవచ్చా? మహిళలు సినిమాల్లో నటించడం, వారి ఫొటోలను వార్తా పత్రికల్లో, పుస్తకాల్లో, పోస్టర్లలో ప్రచురించడం నిషిద్ధం. మోడలింగ్ చేయరాదు. ► షరియా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది? ఈ చట్టాన్ని ఉల్లంఘించడాన్ని తాలిబన్లు సీరియస్‌గా తీసుకుంటారు. కొరడాలతో కొట్టడం, రాళ్లతో కొట్టి చంపడం, బహిరంగంగా ఉరి తీయడం వంటి కఠినమైన శిక్షలు విధిస్తారు. -
'అశ్లీల చిత్రాల్లో నటన మానేసినా.. '
బ్రిటన్: ఒకప్పుడు అశ్లీల చిత్రాల్లో నటించి ఆ తర్వాత తనను తాను తెలుసుకొని ఆ రంగాన్ని వదిలేసి వచ్చిన తనకు జీవితం దుర్భరంగా మారిందని ఒకప్పటి అడల్ట్ స్టార్ బ్రీ ఓల్సాన్ తెలిపింది. ఏ అమ్మాయి జీవితం కూడా తనలాగా తయారు కాకూడదని కోరుకుంటున్నానని అన్నారు. ఆ పనికిరాని కూపం(అశ్లీల చిత్రాల్లో నటించడం)లో ఏ యువతి కూరుకోవద్దని వాపోయింది. 2011లోనే తాను అశ్లీల చిత్రాల్లో నటించడం మానుకొని మాములు మనిషిగా మారాలని నిర్ణయించుకున్నానని, కానీ ఏదైతే తాను ఊహించుకున్నానో అలా తన జీవితం లేదని చెప్పింది. బయటకు వచ్చిన తనను గుర్తించిన వారు ఎంతో రోతగా చూస్తున్నారని, వినకూడని మాటలు వినాల్సి వస్తోందని, అసభ్యకరంగా పలకరిస్తూ తనను ఇంకా అదే కోణంలో చూస్తున్నారని వాపోయింది. తాను ఎన్నో వ్యాపారాలు ప్రారంభించినా అవి కొద్ది రోజులకే దెబ్బతిని మూతపడ్డాయని, తాను ఎక్కడికి వెళ్లినా తన గతమే మనుషుల రూపంలో వెంటాడుతోందని, సమాజం తనను బాగా అసంహ్యించుకుంటోందని బాధపడింది. ప్రస్తుతం కెమెరా మోడల్‌గా చేస్తున్నానని తెలిపింది. లాస్ ఏంజెల్స్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం ఇండియానాకు వెళ్లిపోయి అక్కడే ఉంటున్నట్లు తెలిపింది. ఎవరేమనుకున్నా ప్రస్తుతం తాను సంతోషంగానే ఉన్నానని, నా గతంలాంటిదాన్ని జీవితంలో ఇక కోరుకోనని, ఎప్పటికీ అలా జరగదు కూడా అని చెప్పింది. రియల్ వుమెన్, రియల్ స్టోరీస్ అనే పేరిట ఓ టెలీ చానెల్ నిర్వహించిన వీడియో ఇంటర్వ్యూలో ఆమె ఈ అంశాలు తెలిపింది. -
బంద్‌తో చెప్పలేనన్ని ఇబ్బందులు
పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ గురువారం తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహించడంతో.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. బంద్ పేరు చెప్పి ముందుగానే సిటీబస్సులను డిపోల లోంచి బయటకు తీయలేదు. దాంతో కాలేజీలు, కార్యాలయాలకు వెళ్లాల్సిన వాళ్లు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ప్రతిరోజూ సిటీబస్సులో వెళ్లేవాళ్లలో కొంతమందికి ద్విచక్ర వాహనాలున్నా.. వాటిలో ఇంధనం సరిపడ ఉందో, లేదో తెలియని పరిస్థితి. పోనీ రోడ్డుమీదకు వెళ్లి ఏదైనా బంకులో పెట్రోలు పోయించుకుందామంటే, నగరం మొత్తమ్మీద ఒకటి, అరా తప్ప పెట్రోలు బంకులు కూడా తెరిచిన పాపాన పోలేదు. ధైర్యం చేసి రోడ్డుమీదకు వెళ్దామంటే, నడిరోడ్డు మీద బండి ఆగిపోతే పరిస్థితి ఏంటోనని ఆందోళన. ఇదే పరిస్థితి సాయంత్రం వరకు కొనసాగింది. ఇక సొంత వాహనాలు లేకుండా కేవలం సిటీబస్సుల మీదే ఆధారపడినవాళ్ల కష్టాలు ఇక చెప్పనలవి కావు. సిటీబస్సులు లేని సమయం చూసి ఆటోవాలాలు విజృంభించారు. సాధారణంగా షేర్ ఆటోకు పది రూపాయలు తీసుకునే చోట కూడా 25 నుంచి 40 రూపాయల వరకు డిమాండ్ చేసి, ముక్కు పిండి మరీ వసూలు చేశారు. రోడ్డు మీద ఏ ఆటో చూసినా కనీసం ఏడెనిమిది మందికి తక్కువ కాకుండా ఎక్కించుకుని వెళ్తున్నా, ట్రాఫిక్ పోలీసులు కూడా పట్టించుకోలేదు. కొన్ని రూట్లలో సెట్విన్ బస్సులు మాత్రం తిరిగాయి. అవి కూడా అతి తక్కువ సంఖ్యలోనే కనిపించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది, నాలుగు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి.. ఇక తెలంగాణ బంద్‌లు ఉండబోవని ఆశించిన సామాన్య ప్రజలకు గురువారం చుక్కెదురైంది. రోడ్డుమీద ఏ వాహనం వెళ్తున్నా కూడా బొటనవేలు పైకి చూపించి లిఫ్ట్ అడిగేవాళ్ల సంఖ్యకు లెక్కలేదు. ఇక ఏ బస్టాపులో చూసినా ఆటోలు తప్ప మరో వాహనం కనిపించలేదు. ఇలా బంద్ పేరు చెప్పి హైదరాబాద్ నగరవాసులకు మాత్రం ఆఫీసులకు వెళ్లేసరికి దేవుడు కనిపించాడు!!