
సాహితీ దిగ్గజం కజౌ ఇషిగురో(62)ను సాహిత్య నోబెల్- 2017 వరించింది. అమెరికా విసిరిన అణుబాంబును తన గుండెలపై భరించిన జపాన్‌లోని నాగసాకిలో ఇషిగురో 1954 నవంబర్ 8న జన్మించారు. ఆయనకు ఐదేళ్ల వయసున్న సమయంలో కుటుంబం యూకేకు వచ్చేయడంతో అక్కడే స్థిరపడ్డారు.
ఇషిగురో ఇప్పటివరకూ ఎనిమిది పుస్తకాలు రచించారు. చిత్రాలకు, టీవీ కార్యక్రమాలకు స్క్రిప్టులను కూడా అందించారు. ఇషిగురో రచనల్లో 'ద రిమెయిన్స్ ఆఫ్ ది డే' ప్రసిద్ధి చెందింది. దీన్ని 1989లో ఆయన రచించారు. 1993లో 'ద రిమెయిన్స్ ఆఫ్ ది డే' చిత్రంగా కూడా విడుదలై ఘన విజయం సాధించింది. ది రిమెయిన్స్ ఆఫ్ ది డే నవలే 2017 సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి ఎంపికైంది.
Watch the very moment the 2017 #NobelPrize in Literature is announced! pic.twitter.com/7IcRm5Bb2f
— The Nobel Prize (@NobelPrize) October 5, 2017
Comments
Please login to add a commentAdd a comment